E-Paper
Advertisement

Big tv kissik talks Promo: పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే చంపేస్తాం.. హైపర్ ఆదికి బెదిరింపులు 

Big tv kissik talks Promo: పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే చంపేస్తాం.. హైపర్ ఆదికి బెదిరింపులు 
Advertisement

Big tv kissik talks Promo: హైపర్ ఆది పరిచయం అవసరం లేని పేరు. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకపోయినా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి జబర్దస్త్ షో(Jabardasth Show) ద్వారా కమెడియన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఆది ప్రస్తుతం కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు. ఒకవైపు బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తూనే మరోవైపు వెండి తెరపై కూడా సినిమాలలో కమెడియన్ గా నటించే అవకాశాలను అందుకుంటూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఇక హైపర్ ఆది ఏదైనా ఒక కార్యక్రమంలో ఉన్నారు అంటే ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వాల్సిందే ఆయన వేసే పంచ్ డైలాగులు ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంటాయి.

పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని..

ఇలా ఇండస్ట్రీలో కమెడియన్ గా కొనసాగుతున్న హైపర్ ఆది(Hyper Aadi) రాజకీయాల పరంగా కూడా తరచూ మాట్లాడుతూ వార్తలలో నిలుస్తుంటారు. తాజాగా హైపర్ ఆది బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్(Big Tv Kissik Talks) కార్యక్రమంలో పాల్గొన్నారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ఈ కార్యక్రమంలో భాగంగా తన కెరియర్ గురించి తన ఫ్యామిలీ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి అనంతరం రాజకీయాల గురించి కూడా ప్రశ్నలు ఎదురవడంతో ఈయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. హైపర్ ఆది పవన్ కళ్యాణ్  (Pawan Kalyan)కు వీరాభిమాని అనే విషయం తెలిసిందే.

కాలేజీలో బెదిరింపులు..

Advertisement

రాజకీయాల పరంగా హైపర్ ఆది పవన్ కళ్యాణ్ కు పూర్తి స్థాయిలో మద్దతు తెలియజేస్తున్నారు. ఇక రాజకీయాలు అంటేనే ఒక వ్యక్తి గురించి భారీగా నెగిటివిటీ వస్తుందని ఆది తెలిపారు. అయితే తాను కాలేజీ చదివే సమయంలోనే పవన్ కళ్యాణ్ గారికి  వీరాభిమాని ఆ సమయంలోనే నేను పవన్ కళ్యాణ్ పేరు పలుకుతూ తనకు మద్దతుగా ఉన్నందుకు తన సీనియర్ సుమారు ఒక పది మంది దాకా నన్ను కాలేజ్ బిల్డింగ్ పైకి లాక్కెళ్ళి ఇంకోసారి పవన్ కళ్యాణ్ పేరు పలికితే బిల్డింగ్ పైనుంచి తోసేస్తాము అంటూ బెదిరించారని హైపర్ ఆది ఈ సందర్భంగా తెలియజేశారు.

Advertisement

“నేను నమ్మిన నాయకుడు అసలు జనాభా లెక్కల్లో ఒకడు కాదు.. లెక్కలేనంత జనాభాకు ఒకే ఒక్కడు” అంటూ పవన్ కళ్యాణ్ గురించి ఎంత గొప్పగా చెప్పారు. ఇక పవన్ కళ్యాణ్ కోసం ఎన్నికల సమయంలో హైపర్ ఆది ప్రచార కార్యక్రమాలలో కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇలా ఇండస్ట్రీలోకి రాకముందు నుంచి పవన్ కళ్యాణ్ కు వీరాభిమానిగా ఉన్న ఆది ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత అదే అభిమానాన్ని కొనసాగిస్తూ సినిమాల పరంగా, రాజకీయాల పరంగా పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలియజేస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన తన తల్లిదండ్రుల గురించి లవ్ ఫెయిల్యూర్ గురించి కూడా ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు. ఇక ఈ కార్యక్రమంలో ఆది ఇంకా ఎలాంటి విషయాలను అభిమానులతో పంచుకున్నారనేది తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారం కావాల్సిందే.

Also Read: Sai Pallavi: ఎమ్మెస్ సుబ్బలక్ష్మి బయోపిక్ లో సాయి పల్లవి కన్ఫర్మ్… క్లారిటీ ఇచ్చిన బన్నివాసు?

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×