E-Paper
Advertisement

Big tv Kissik Talks Promo: జీవితంలో అలాంటి రోజు మళ్ళీ రావద్దు.. పృథ్వీరాజ్  ఎమోషనల్!

Big tv Kissik Talks Promo: జీవితంలో అలాంటి రోజు మళ్ళీ రావద్దు.. పృథ్వీరాజ్  ఎమోషనల్!
Advertisement

Big tv Kissik Talks Promo: బుల్లితెర సీరియల్ నటుడిగా తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన నటుడు పృథ్వీరాజ్(Pruthvi Raj) అనంతరం బిగ్ బాస్(Big Boss 8) కార్యక్రమం ద్వారా మరింత మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. బిగ్ బాస్ 8 రియాలిటీ షో దాదాపు 13 వారాలపాటు హౌస్ లో కొనసాగి అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకున్నారు. ఇక ఈ కార్యక్రమం అనంతరం పృథ్వీ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. పలు బుల్లితెర కార్యక్రమాలతో పాటు సినిమాలలో కూడా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. తాజాగా పృథ్వీ బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

జీవితంలో ఆ రోజులు వద్దు..

ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఇందులో భాగంగా ఈయన వృత్తిపరమైన విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. ఇక తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి కూడా ఈ సందర్భంగా తెలియజేశారు. మీ జీవితంలో అత్యంత బాధ కలిగించిన సంఘటన ఏంటి? మళ్లీ ఇలాంటి రోజులు రాకూడదు అనే ఘటనలు ఉన్నాయా? అంటూ ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు పృథ్వీ సమాధానం చెబుతూ కాస్త ఎమోషనల్ అయ్యారు.

నాన్న చనిపోవడం..

Advertisement

నా జీవితంలో అత్యంత బాధాకర సమయం ఏదైనా ఉంది అంటే అది తన తండ్రి మరణించినప్పుడేనని తెలియజేశారు. అలాంటి రోజులు మళ్లీ రాకూడదని నేను కోరుకుంటాను అంటూ ఈయన ఎమోషనల్ అయ్యారు. ఇప్పుడు కనుక మీ నాన్న మీకెదురు పెడితే ఏం చెబుతారు అంటూ మరో ప్రశ్న వేయడంతో ఫస్ట్ నాన్నను హగ్ చేసుకుంటానని మిస్ యు డాడీ అంటూ తనతో చెబుతానని తెలిపారు. ఇక పృథ్వి ఇండస్ట్రీలోకి రావడంతో జరిగిన అవమానాలు గురించి కూడా ఈ సందర్భంగా ప్రస్తావించినట్టు తెలుస్తుంది. తాను ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత చాలామంది మా అమ్మను మీ అబ్బాయి ఏంటి అటువైపు వెళ్లారు మా పిల్లలు చక్కగా జాబ్ చేస్తున్నారు అంటూ చాలామంది మాట్లాడారు.

Advertisement

ఇండస్ట్రీ లోకి వచ్చిన తర్వాత సక్సెస్ రాకపోతే మనకు రెస్పెక్ట్ కూడా ఉండదని పృథ్వీ తెలియజేశారు. ఆ సమయంలో తాను కనీసం చుట్టాల పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి కూడా వెళ్లేవాడిని కాదని ఈ సందర్భంగా కెరియర్ మొదట్లో తనకు ఎదురైన చేదు సంఘటనల గురించి పృథ్వీ రాజ్ ఈ కార్యక్రమంలో భాగంగా ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ఇక ఈ కార్యక్రమంలో ఈయన విష్ణు ప్రియ గురించి తనతో ఉన్న రిలేషన్ గురించి, సినిమాల గురించి కూడా ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారని తెలుస్తుంది. మరి పృథ్వీ ఈ కార్యక్రమంలో ఏ విషయాల గురించి మాట్లాడారు అనేది తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఎదురు చూడాలి ఇక ఈ కార్యక్రమం బిగ్ టీవీలో ప్రతి శనివారం రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది.

Also Read: Big tv Kissik Talks Promo: నన్ను పెళ్లి చేసుకుంటావా.. లైవ్ లోనే పృథ్వీరాజ్ ను అడిగిన విష్ణు..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×