E-Paper
Advertisement

Big Tv Kissik Talks Promo: రీతూ ఫ్రెండ్ కాదు.. అంతకు మించి.. రిలేషన్ పై ఓపెన్ అయిన డెమోన్!

Big Tv Kissik Talks Promo: రీతూ ఫ్రెండ్ కాదు.. అంతకు మించి.. రిలేషన్ పై ఓపెన్ అయిన డెమోన్!
Advertisement

Big Tv Kissik Talks Promo: డెమోన్ పవన్ పరిచయం అవసరం లేని పేరు. ఒక కామన్ మ్యాన్ గా ఉన్న ఈయన బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొని సెలబ్రిటీ హోదా అనుభవిస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 9 (Big boss 9)రియాలిటీ షో కామన్ మ్యాన్ క్యాటగిరి లో భాగంగా అగ్నిపరీక్ష ద్వారా కొంతమందిని ఎంపిక చేసి హౌస్ లోకి కంటెస్టెంట్లుగా పంపించారు అలాంటి వారిలో డెమోన్ పవన్ (Demon pawan)కూడా ఒకరు. ఒక కామన్ మ్యాన్ గా వెళ్లిన డెమోన్ ఫినాలే వరకు హౌస్ లో కొనసాగి టాప్ 3 కంటెస్టెంట్ గా హౌస్ నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ కార్యక్రమం ద్వారా మంచి సక్సెస్ అందుకున్న ఈయన ప్రస్తుతం పలు బుల్లితెర కార్యక్రమాలలో పాల్గొంటూ బిజీగా ఉన్నారు.

ఫ్రెండ్షిప్ మాత్రమే కాదు..

ఇక డెమోన్ పవన్ తాజాగా బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమో వీడియోలో భాగంగా పవన్ బిగ్ బాస్ కార్యక్రమం గురించి తన వ్యక్తిగత విషయాల గురించి అలాగే రీతు గురించి కూడా ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన తర్వాత డెమోన్ పవన్ రీతూతో చాలా క్లోజ్ గా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో వీరిద్దరి మధ్య కేవలం ఫ్రెండ్ షిప్ మాత్రమే కాదు అంతకుమించి ఏదో ఉంది అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వీరిద్దరి రిలేషన్ పై వార్తలు హల్చల్ చేశాయి. ఇక రీతు మాత్రం ఇద్దరి మధ్య కేవలం మంచి ఫ్రెండ్షిప్ మాత్రమే ఉందని తెలిపారు.

బావ మరదలి రిలేషన్…

Advertisement

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా రీతూ గురించి డెమోన్ కి ప్రశ్నలు ఎదురవడంతో మా ఇద్దరి మధ్య కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే కాదు అంతకుమించి మరో రిలేషన్ ఉందని తెలిపారు .మేమిద్దరం బావ మరదలు ఎలా అయితే సరదాగా ఉంటారో మా ఇద్దరి మధ్య రిలేషన్ కూడా అలాగే ఉండేది అంటూ షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. ఇక పవన్ రీతుని నామినేట్ చేయడం గురించి కూడా వర్ష ప్రశ్నించడంతో తప్పనిసరి పరిస్థితులలో నామినేట్ చేయాల్సి వచ్చిందని ఆ సమయంలో నాకు తెలియకుండానే ఏడ్చేశానని పవన్ తెలిపారు..

Advertisement

ఇక రీతూ హౌస్ లో ఉన్నప్పుడు బయట పెద్ద ఎత్తున తన గురించి ఒక వార్త సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయాన్ని ఫైర్ స్ట్రోమ్ కంటెస్టెంట్లు వెళ్లి పవన్ కి చెప్పగా ఎందుకిలా ఒక వ్యక్తి గురించి చెడుగా చెబుతున్నారు అనుకున్నాను కానీ రీతు మాత్రం చాలా జెన్యూన్ గా ఉందని ఆమె అలా జెన్యూన్ గా ఉండటం వల్ల బయటకు వచ్చిన తర్వాత కూడా మా రిలేషన్ అలాగే ఉందని క్లారిటీ ఇచ్చారు. బయటకు వచ్చిన తర్వాత కూడా మేమిద్దరం ఒక్కసారి కూడా ఇప్పటివరకు గొడవ పడలేదని రీతూతో తనకున్న రిలేషన్ గురించి ఈ సందర్భంగా తెలియజేశారు. ఇక రీతూ ఇంటికి వెళ్లారా అంటూ వర్ష ప్రశ్నించడంతో ఒక్కసారి పిలిచింది కానీ వెళ్ళలేకపోయానని, తర్వాత పిలవడం మానేసింది అంటూ పవన్ తెలిపారు. ఇలా రీతు గురించి పవన్ ఈ కార్యక్రమంలో చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక వీరిద్దరూ ప్రస్తుతం బీబీ జోడీ 2 కార్యక్రమంలో కంటెస్టెంట్లుగా పాల్గొంటున్న విషయం తెలిసిందే.

Also Read: T.G.Vishwa Prasad: అరుదైన గౌరవాన్ని అందుకున్న ది రాజా సాబ్ నిర్మాత!

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×