E-Paper
Advertisement

Big tv Kissik Talks: రవి ఉంటే యాంకరింగ్ చెయ్యం…మొహం మీదే చెప్పిన యాంకర్లు!

Big tv Kissik Talks: రవి ఉంటే యాంకరింగ్ చెయ్యం…మొహం మీదే చెప్పిన యాంకర్లు!
Advertisement

Big tv Kissik Talks Promo: బుల్లితెరపై ఎంతోమంది యాంకర్లుగా కొనసాగుతూ ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు .ఒకానొక సమయంలో యాంకర్ అంటే ఉదయభాను, సుమా కనకాల, ఝాన్సీ వంటి వాళ్ళు మాత్రమే గుర్తుకు వచ్చేవారు. కానీ ఇటీవల కాలంలో ఎంతోమంది సోషల్ మీడియా వేదికగా తమలో ఉన్న టాలెంట్ బయట పెడుతూ ఇండస్ట్రీలో స్థిరపడుతున్నారు. ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది యాంకర్లుగా ప్రస్తుతం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే మేల్ యాంకర్లతో పోలిస్తే లేడీ యాంకర్ల సంఖ్య అధికంగా ఉందని చెప్పాలి. ఇక మేల్ యాంకర్ల విషయానికి వస్తే ప్రదీప్ ,సుడిగాలి సుధీర్, రవి లాంటి వాళ్ళు ప్రస్తుతం పలు షోలకు యాంకర్లుగా వ్యవహరిస్తూ బిజీగా ఉన్నారు.

బుల్లితెరకు దూరమవుతున్న రవి..

ఇక యాంకర్ రవి(Anchor Ravi) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన గత కొన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీలో యాంకర్ గా కొనసాగుతూ ఎన్నో అద్భుతమైన షోల ద్వారా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన సంగతి తెలిసిందే. సూపర్ హిట్ షోలకు యాంకర్ గా వ్యవహరించిన రవి ఇటీవల కాలంలో పూర్తిగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. కేవలం స్పెషల్ ఈవెంట్స్ లో మాత్రమే ఈయన సందడి చేస్తున్నారు.. ఇలా బుల్లితెర కార్యక్రమాలకు దూరం కావడానికి గల కారణాలు ఏంటి అంటూ ఎంతో మంది ఎన్నో సందేహాలను వ్యక్తం చేశారు. తాజాగా రవి ఇండస్ట్రీకి దూరం కావడానికి గల కారణాలను తెలియజేశారు.

ఎదగాలంటే తొక్కేయాల్సిందేనా..

Advertisement

బిగ్ టీవీలో ప్రసారమవుతు ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న కిస్సిక్ టాక్స్ కార్యక్రమంలో భాగంగా యాంకర్ రవి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఈయన తన కెరియర్ గురించి మాట్లాడుతూ తాను ఇండస్ట్రీకి దూరం అవడానికి గల కారణాలను తెలిపారు. సాధారణంగా ఇండస్ట్రీలో ఒకరికి అవకాశం రావాలి అంటే ఒకరిని తొక్కేస్తూ ఉంటారు. అలా నాపై కూడా కుట్రలు జరిగాయని తెలిపారు. అంతేకాకుండా నేను ఉంటే షో చేయనని ఎంతోమంది రిజెక్ట్ చేసిన వాళ్లు కూడా ఉన్నారని తెలిపారు.

Advertisement

ఇలా ఎన్నో షోలలో కొంతమంది యాంకర్లు రవి ఉంటే చెయ్యం అంటూ రిజెక్ట్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయని తెలిపారు. రవి అద్భుతమైన మాట తీరుతో చాలా చక్కగా యాంకరింగ్ వ్యవహరిస్తారు అలాంటిది రవి ఉంటే ఆ షో యాంకరింగ్ చేయము అంటూ చెప్పారనే విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇలా పలు కారణాలతో రవికి బుల్లితెర కార్యక్రమాలు తగ్గిపోవడంతో రవి కూడా పలు స్పెషల్ సాంగ్స్ చేస్తూ కెరియర్ పరంగా బిజీ అవుతున్నారనే చెప్పాలి. మరి రవి పై ఇలా కుట్రలు చేస్తున్నది ఎవరు ఏంటి అని వివరాలు తెలియాలి అంటే ఈ కార్యక్రమం పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఎదురు చడాల్సిందే.

Also Read: Big Tv Kissik Talks : యాంకర్ రవిని తొక్కేయడానికి క్షుద్ర పూజలు..ఎవరా లేడీ యాంకర్?

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×