E-Paper
Advertisement

Big tv Kissik Talks : యాంకర్ రవి ఆస్తుల విలువ ఎంతో తెలుసా.. లెక్కలేనంతగా సంపాదించారా?

Big tv Kissik Talks : యాంకర్ రవి ఆస్తుల విలువ ఎంతో తెలుసా.. లెక్కలేనంతగా సంపాదించారా?
Advertisement

Big Tv Kissik Talks: బిగ్ టీవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్ కార్యక్రమం ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ప్రతి వారం ఈ కార్యక్రమానికి సెలబ్రిటీలు హాజరవుతూ వారి కెరియర్ కి సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలు గురించి కూడా అభిమానులతో పంచుకుంటున్నారు. ఇక ఈ వారం ఈ కార్యక్రమానికి బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న రవి (Ravi)హాజరయ్యారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వీడియో విడుదల చేశారు .ఈ ప్రోమో వీడియోలో భాగంగా యాంకర్ రవి తన కెరీర్ కి సంబంధించిన విషయాలతో పాటు తన వ్యక్తిగత విషయాలు అలాగే తన ఆస్తిపాస్తుల గురించి కూడా ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

భారీగా ఆస్తుల కూడ పెట్టిన రవి..

గత కొన్ని సంవత్సరాలుగా బుల్లితెర యాంకర్ గా కొనసాగుతున్న రవి బుల్లితెరపై ప్రసారమవుతున్న ప్రతి ఒక్క ఛానల్లోనూ ఏదో ఒక కార్యక్రమం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి తనదైన శైలిలోనే ప్రేక్షకులను సందడి చేశారు. ఇలా బుల్లితెర యాంకర్ గా మాత్రమే కాకుండా స్పెషల్ ఈవెంట్స్ ఉంటే రవి యాంకర్ గా వ్యవహరించేవారు. ఇక ఇటీవల కాలంలో ఈయన ఆల్బమ్ సాంగ్స్ చేస్తూ మరోవైపు యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తూ భారీగా సంపాదిస్తున్నారు. ప్రస్తుతం కెరియర్ పరంగా బిజీగా ఉన్న రవి భారీగానే ఆస్తులు కూడా సంపాదించారని తెలుస్తోంది.

ఆస్తుల లెక్కలు వెయ్యలేదు..

Advertisement

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా యాంకర్ వర్ష రవిని ప్రశ్నిస్తూ ఈ మధ్యకాలంలో గోల్డ్ రేట్ ఉన్న ఫలంగా పెరిగిపోతుంది మరి మీ ఇంట్లో ఎంత గోల్డ్ ఉంది ఏంటి అంటూ ప్రశ్నలు వేశారు. ఈ ప్రశ్నకు రవి సమాధానం చెబుతూ ఇప్పటివరకు నేను చాలా పర్ఫెక్ట్ గా టాక్స్ లు కడుతున్నాను. అయితే తన వద్ద ఎంత ఆస్తులు ఉన్నాయి, ఎంత గోల్డ్ ఉందనే విషయాలు పర్ఫెక్ట్ గా నాకు తెలియదు ఎప్పుడు లెక్కలు వేయలేదు అంటూ సమాధానం ఇచ్చారు. ఇలా ఆస్తుల గురించి యాంకర్ రవి ఇలాంటి సమాధానం చెప్పడంతో ఒక్కసారిగా వర్ష ఆశ్చర్యపోతూ లెక్కలేనంత ఆస్తి సంపాదించావా రవి అంటూ మాట్లాడారు.

Advertisement

మరి రవి ఆస్తులు విలువ ఎంత ఏంటి అనే విషయాలు తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఎదురు చూడాల్సిందే. ఇక కెరియర్పరంగా రవి ఇండస్ట్రీలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి తనపై జరిగిన కుట్రల గురించి కూడా ఈ కార్యక్రమంలో ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ టాక్ షో కి సంబంధించిన ప్రోమో వీడియో వైరల్ అవుతుంది. ఇక రవి బుల్లితెర యాంకర్ గా మంచి గుర్తింపు సంపాదించుకొని బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే . ఈయన దాదాపు 12 వారాలపాటు హౌస్ లో కొనసాగి బయటకు వచ్చారు.

Also Read: Big tv Kissik Talks: రవి ఉంటే యాంకరింగ్ చెయ్యం…మొహం మీదే చెప్పిన యాంకర్లు!

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×