E-Paper
Advertisement

Big tv kissik Talks: నరేష్ హైట్ పై ట్రోల్స్.. భరించలేకపోయానంటూ ఎమోషనల్!

Big tv kissik Talks: నరేష్ హైట్ పై ట్రోల్స్.. భరించలేకపోయానంటూ ఎమోషనల్!
Advertisement

Big tv Kissik Talks: జబర్దస్త్ కమెడియన్ నరేష్ (Naresh)అంటే ఎవరు గుర్తుపట్టకపోవచ్చు కానీ పొట్టి నరేష్ అంటే మాత్రం అందరికీ టక్కున గుర్తుకు వస్తారు. తన హైట్ తనకు ఒకప్పుడు సమస్యగా మారింది కానీ, ఇప్పుడు ఆ హైట్ తనకు ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను తీసుకువచ్చిందని చెప్పాలి. జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా కొనసాగుతున్న పొట్టి నరేష్ తన అద్భుతమైన కామెడీ ద్వారా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నారు. ఇలా జబర్దస్త్(Jabardasth) కార్యక్రమంతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాలలో కూడా పాల్గొంటూ సందడి చేస్తున్న నరేష్ తాజాగా బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ (Big tv kissik Talks) కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా తన వ్యక్తిగత విషయాలతో పాటు వృత్తిపరమైన విషయాల గురించి కూడా అభిమానులతో పంచుకున్నారు.

డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన అమ్మ..

ఇక పొట్టి నరేష్ జబర్దస్త్ స్కిట్ లో పాల్గొన్న తన హైట్ గురించి పంచ్ లు పడుతుంటాయనే సంగతి మనకు తెలిసిందే. అయితే అదంతా సరదాగా అందరూ నవ్వుకోవడం కోసమే చేస్తారు కానీ నిజజీవితంలో కూడా తన హైట్ గురించి ఎన్నో విమర్శలు వచ్చాయని తాజాగా ఈయన ఎమోషనల్ అయ్యారు. తన వయసు పెరుగుతున్నప్పటికీ హైట్ పెరగకపోవడంతో ఎంతోమంది తన హైట్ గురించి హేళన చేస్తూ మాట్లాడారు. ఇలాంటి మాటలు వల్ల నరకం అనుభవించాలని నరేష్ ఎమోషనల్ అయ్యారు. అయితే తన గురించి ఇలాంటి విమర్శలు వస్తున్నప్పుడు తన అమ్మ మాత్రం డిప్రెషన్ లోకి వెళ్లిపోయారని నరేష్ తెలిపారు.

నా హైట్ వల్ల ఇప్పుడు హ్యాపీగా ఉన్నా..

Advertisement

ఇలా నా గురించి అమ్మ ఆలోచించి చాలా బాధపడ్డారు అయితే ఇప్పుడు మాత్రం నాకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితులలో నేను హైట్ లేకపోవడమే మంచిదని భావిస్తున్నాను అంటూ నరేష్ ఈ సందర్భంగా తన హైట్ గురించి వచ్చే విమర్శలపై స్పందించారు. ప్రస్తుతం అయితే తన లైఫ్ హ్యాపీగా సాగిపోతుందని తెలియజేశారు. ఇలా ఈటీవీలో ప్రసారమవుతున్న కార్యక్రమాలలో పాల్గొంటూ సందడి చేస్తున్న నరేష్ సినిమాలపై కూడా దృష్టి సారించారు. పలు సినిమాలలో కమెడియన్ పాత్రలలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

సినిమాలలో నటించడమే తన ధ్యేయమని, సినిమాలు తప్ప తనకు ఏది తెలియదని నరేష్ తెలిపారు. తాను పెద్దగా చదువుకోలేదు కేవలం 9వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నాను. ఇక చదువు కూడా రాకపోవడంతో ఏదో ఒకటి చేయాలని హైదరాబాద్ వచ్చేసానని నరేష్ తెలిపారు. ఇలా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నరేష్ ఏకంగా హైదరాబాద్ లో సొంత ఇంటి కలలు కూడా నెరవేర్చుకున్నారు. ఇక ప్రస్తుతం తనకు సినిమాలలో కూడా అవకాశాలు వస్తున్నాయని నరేష్ ఈ సందర్భంగా తన కెరియర్ గురించి కూడా ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

Also Read: Allu Arjun Pushpa : మందు బాబులూ.. పెగ్ వేయాలని ఉందా… పుష్ప దగ్గరకు వచ్చేయండి

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×