E-Paper
Advertisement

తినడానికి తిండి లేదు…ఒక్క పూట భోజనం కోసం ఎన్నో కష్టాలు..ఫైమా ఎమోషనల్ కామెంట్స్!

తినడానికి తిండి లేదు…ఒక్క పూట భోజనం కోసం  ఎన్నో కష్టాలు..ఫైమా ఎమోషనల్ కామెంట్స్!
Advertisement

Big Tv Kissik Talks: బుల్లితెర కమెడియన్ ఎంతో మంచి సక్సెస్ అందుకొని ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న వారిలో లేడీ కమెడియన్ ఫైమా (Faima)ఒకరు. పటాస్ కార్యక్రమం ద్వారా బుల్లితెరకు పరిచయమైన ఈమె తనలో ఉన్నటువంటి టాలెంట్ బయట పెడుతూ అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రస్తుతం బుల్లితెరపై పలు కార్యక్రమాలలో సందడి చేస్తున్న పైన తాజాగా బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్(Big tv kissik Talks) కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా తన ఫ్యామిలీ ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి తమ ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.

తినడానికి తిండి లేని రోజులు ఎన్నో..

ఫైమా నిరుపేద కుటుంబంలో జన్మించిన సంగతి తెలిసినదే. తన తండ్రి జీవనార్థం ఇతర దేశాలకు వెళ్లి పనులు చేసుకునేవారు తన తల్లి బీడీలు చూడుతూ ఉండేదని పలు సందర్భాలలో తెలిపారు. అయితే తన తల్లిదండ్రుల కష్టం చూసిన ఈమె ఇండస్ట్రీలోకి వచ్చి మంచి సక్సెస్ అందుకొని ఇప్పుడు తన కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలుస్తూ వారికి ఎలాంటి కష్టం లేకుండా చూసుకుంటున్నారు. అయితే చిన్నప్పుడు మాత్రం తాను చాలా ఇబ్బందులు పడ్డానని కనీసం తినడానికి తిండి కూడా లేని రోజులు ఉన్నాయి అంటూ ఎమోషనల్ అయ్యారు.

తిండి కోసమే బడికి వెళ్ళేదాన్ని…

Advertisement

చిన్నప్పుడు భోజనం చేయడానికి కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డామని భోజనం చేయాలి అంటే ఇంట్లో బియ్యం ఉండేది కాదు, బియ్యం ఒక్కటే తెచ్చుకొని అన్నం చేసుకొని పక్కింటి వాళ్ళతో కూరలు వేయించుకొని తిని బ్రతికామని తెలిపారు. అప్పట్లో చికెన్ అంటే ఎలా ఉండేదో కూడా తెలిసేది కాదు .నెలకు ఒక పావు కిలో మాత్రమే చికెన్ తెచ్చేవారు అంటూ ఎమోషనల్ అయ్యారు. నేను అప్పట్లో చదువుకోవడానికి కాదు తిండి పెడతారన్న ఉద్దేశంతోనే బడికి వెళ్ళేదానిని ఫైమా ఎమోషనల్ అయ్యారు. ఎప్పుడైనా స్కూల్ లేకపోతే తాను చాలా బాధపడేదాన్ని అంటూ ఈ సందర్భంగా తన చిన్నప్పటి ఇబ్బందులను గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

Advertisement

చిన్నప్పుడు ఇలా ఒక పూట తిండి కోసం కూడా ఎన్నో ఇబ్బందులు పడిన తాము ఇప్పుడు మూడు పూటలా అన్నం తినగలుగుతున్నాము. చిన్నప్పుడు ఇన్ని కష్టాలు చూసాను కాబట్టి ఇప్పుడు పెద్దగా ఖర్చులు పెట్టడానికి కూడా ఇష్టపడనని, ఇలా నా ఫ్యామిలీ పడిన కష్టాలు చూసి వారికి ఎలాంటి కష్టం లేకుండా చూసుకోవాలని భావించాలి. అందుకే వారి బాగోగులు చూసిన తర్వాతనే తన గురించి ఆలోచించుకుంటానని ఫైమా తెలిపారు. తాను పటాస్ కార్యక్రమానికి వెళ్లిన సమయంలో మా అమ్మ రూ.500 పక్క వాళ్ళతో తీసుకొచ్చి మరి నాకు ఇచ్చింది. ఇక ఈ షో నుంచి ఒకేసారి 1500 రావడంతో మా అమ్మ చేతిలో పెట్టగా చాలా సంతోషించిందని ఫైమా అప్పటి ఇబ్బందులను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు.

Also Read: ఫస్ట్ టైమ్ ప్రేమ పెళ్లి పై ఓపెన్ అయిన ఫైమా… త్వరలోనే పెళ్లి భాజాలు మోగనున్నాయా!

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×