E-Paper
Advertisement

ఫస్ట్ టైమ్ ప్రేమ పెళ్లి పై ఓపెన్ అయిన ఫైమా… త్వరలోనే పెళ్లి భాజాలు మోగనున్నాయా!

ఫస్ట్ టైమ్ ప్రేమ పెళ్లి పై ఓపెన్ అయిన ఫైమా… త్వరలోనే పెళ్లి భాజాలు మోగనున్నాయా!
Advertisement

Big Tv Kissik Talks: జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఫైమా ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం అలాగే ఢీ కార్యక్రమాలలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలా బుల్లితెర కమెడియన్ గా కొనసాగుతున్న ఈమె తాజాగా బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా తన ప్రేమ గురించి అలాగే పెళ్లి గురించి పలు విషయాలతెలియజేశారు. ఫైమా పెళ్లి ఎప్పుడు అంటూ వర్ష అడగడంతో పెళ్లి గురించి ఎలాంటి ప్లాన్స్ లేవు కానీ పెళ్లయితే చేసుకోవాలని అనుకుంటున్నాము ఇక మా రెండు కుటుంబాలు కూడా పెళ్లి చేయాలనే ఆలోచనలోనే ఉన్నారు అయితే అంటారు కదా సమయం రాకుండానే ఏది జరగదు అని అలా మా పెళ్లికి ఇంకాస్త టైం ఉందేమో అంటూ మాట్లాడారు

దేనికైనా సమయం రావాలి..

ఇక తన ప్రియుడు ప్రవీణ్ (Praveen)గురించి ఫైమా మాట్లాడుతూ పలు విషయాలు తెలిపారు. పెళ్లి తర్వాత తన కెరీర్ కి ఏదైనా ఇబ్బంది వస్తుందని పట్టింపులు ఏమైనా ఉన్నాయా అంటూ అడగడంతో ప్రవీణ్ కు నేను ఎలా ఉంటాను, ఏం చేస్తాననే విషయాలు అన్నీ తెలుసు .ఇప్పుడు ఎలాగ ఉన్నానో పెళ్లి అయిన తర్వాత కూడా అలాగే ఉంటాను నాలో ఏమి మార్పు ఉండదని నా విషయంలో ప్రవీణ్ సపోర్ట్ చాలా ఉంటుందని ఫైమా తెలిపారు. ఇక మీ ఇద్దరి ప్రేమలో ఎప్పుడైనా గొడవలు వచ్చాయా అంటూ కూడా ప్రశ్నలు ఎదురయ్యాయి. ప్రేమలో ఉన్న తర్వాత కచ్చితంగా గొడవలు జరుగుతాయి మా విషయంలో కూడా చాలా గొడవలు జరిగాయని తెలిపారు.

బ్రేకప్ వరకు వెళ్ళాము..

Advertisement

ఒక మాటలో చెప్పాలంటే ప్రవీణ్ నా కోసం ఎన్నో అవమానాలు పడ్డారని పైమా తెలిపారు. మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవ జరిగిన ముందు ప్రవీణ్ తనకు సారీ చెబుతారని తప్పు నాది ఉన్నా అతనే సారీ చెబుతాడని తెలియజేశారు. ఇక అందరిలాగే మేము కూడా చాలాసార్లు గొడవపడ్డాము బ్రేకప్ కూడా చెప్పుకున్నామని అయినప్పటికీ ప్రవీణ్ మాత్రం నన్ను వదిలి వెళ్ళిపోలేదని తెలిపారు. ఒకరోజు బాగా గొడవపడి ఇప్పటికిప్పుడే నువ్వు నాకు హైదరాబాద్లో కనిపించకూడదని చెప్పాను దాంతో అర్ధరాత్రి బట్టలు సర్దుకుని వెళ్లిపోయాడు బస్ స్టాప్ వెళ్ళిన తర్వాత తను లేకపోతే నేను ఎలా ఉంటానని ఆలోచించి నాకోసం వెనక్కి వచ్చారని ఫైమా తెలిపారు.

Advertisement

ఇలా నన్ను ఇంత బాగా అర్థం చేసుకునే వ్యక్తి దొరికినందుకు నేను చాలా అదృష్టవంతురాలిని తనని ఎంత ఇష్టపడుతున్నాడనే విషయం నేను గ్రహించిన తర్వాత తనతో ఎప్పుడు గొడవ పడలేదని, చాలా సంతోషంగా ఉన్నామని ఫైమా ఈ సందర్భంగా తెలియజేశారు. ఇక ఫైమా పటాస్ ప్రవీణ్ తో ప్రేమలో ఉన్నారని అందరూ భావించారు కానీ గత ఎనిమిది సంవత్సరాలుగా ప్రవీణ్ అనే అబ్బాయితో ప్రేమలో ఉన్నారు అయితే ఇద్దరి పేర్లు ఒకటి కావడంతో చాలామంది పటాస్ ప్రవీణ్ తో బ్రేకప్ చెప్పుకొని వేరే అతనితో పెళ్లి పీటలు ఎక్కబోతుందంటూ అప్పట్లో వార్తలు రావడంతో ఫైమా అందరికీ క్లారిటీ ఇచ్చారు.

Also Read: సక్సెస్ ను ఎంజాయ్ చేయలేకపోయాను…నల్లగా పుట్టమే నాకు వరమైంది: ఫైమా

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×