E-Paper
Advertisement

Big tv kissik Talks: పొట్టి డ్రస్సులపై ఇంద్రజ హాట్ కామెంట్స్… ట్రోల్ చేసే హక్కు ఉందంటూ!

Big tv kissik Talks: పొట్టి డ్రస్సులపై ఇంద్రజ హాట్ కామెంట్స్… ట్రోల్ చేసే హక్కు ఉందంటూ!
Advertisement

Big tv kissik Talks: ఒకప్పుడు అమ్మాయిలు ఎంతో నిండుగా దుస్తులు వేసుకునేవారు కానీ ఇటీవల కాలంలో పూర్తిగా అమ్మాయిల వస్త్రధారణ మారిపోయిందని చెప్పాలి. ఒకానొక సమయంలో సెలబ్రిటీలు వారి పాత్రలకు అనుగుణంగా డ్రస్సులు వేసుకునేవారు కానీ ఇటీవల కాలంలో సినిమాలలో నటించే సమయంలో మాత్రమే కాకుండా పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తూ బోల్డ్ ఫోటోషూట్లు చేస్తున్నారు. అలాగే సెలబ్రిటీలను అనుసరిస్తూ ఎంతోమంది అభిమానులు కూడా అదే శైలిలో వస్త్రధారణను అనుసరిస్తున్నారు ..కొంతమంది వస్త్రధారణ పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే.. ఈ క్రమంలోనే నటి ఇంద్రజ పొట్టి దుస్తులు ధరించడం గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

మా దుస్తులు.. మా ఇష్టం..

ఇటీవల కాలంలో కొంతమంది వస్త్రధారణ గురించి విమర్శలు వస్తే మా దుస్తులు మా ఇష్టం మాకు నచ్చిన విధంగా వేసుకుంటాము అంటూ మాట్లాడుతున్నారు అలాంటి వారి గురించి మీరేం చెబుతారు అంటూ వర్ష ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు ఇంద్రజ సమాధానం చెబుతూ.. నీ డ్రెస్సులు నీ ఇష్టం అంటూ చాలా చండాలంగా డ్రెస్సులు వేసుకొని బయట తిరుగుతున్నప్పుడు ఆ డ్రెస్ గురించి కామెంట్ చేసే హక్కు అందరికీ ఉంటుందని తెలిపారు. మనం ఇంట్లో మనకు నచ్చిన విధంగా మాట్లాడుతాము కానీ బయటకు వస్తే ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడతాము.  అదే విధంగా బయటకు వచ్చినప్పుడు కూడా ఎలాంటి డ్రెస్సులు వేసుకోవాలి, ఎలా ప్రవర్తించాలనే విషయాల పట్ల కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయని తెలిపారు.

అందం ఆక్వర్డ్ గా ఉండకూడదు..

Advertisement

అమ్మాయిలు అందంగా కనిపించాలి కానీ ఆ అందం ఆక్వర్డ్ గా ఉండకూడదు అంటూ ఇంద్రజ తెలిపారు. ఇలా ఇంద్రజ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎంతో మంది సెలబ్రిటీలు డ్రెస్సింగ్ స్టైల్ పై విమర్శలు చేస్తే వెంటనే స్పందిస్తూ ట్రోల్లర్స్ కు ఎడాపెడా సమాధానం చెబుతూ ఉంటారు. అలాంటి వారందరికీ ఇంద్రజ పరోక్షంగా కౌంటర్ ఇచ్చారని చెప్పాలి. ఇక ఇటీవల కాలంలో ఎంతోమంది సెలబ్రిటీలను అనుసరిస్తూ బయట కూడా అమ్మాయిలు ఇలాంటి దుస్తులలో కనిపిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఇంద్రజ ప్రేమించుకున్న వారు బ్రేకప్స్ చెప్పుకోవడం గురించి సూసైడ్ చేసుకోవడం వంటి అంశాల గురించి కూడా మాట్లాడారు. మనం ప్రేమ కోసమే పుట్టలేదని జీవితంలో ఏదైనా సాధించడం కోసమే పుట్టామని సూసైడ్ ఆలోచన అనేది పిచ్చి పని అంటూ చెప్పుకు వచ్చారు. ఇక సోషల్ మీడియా విమర్శల పట్ల కూడా ఇంద్రజ ఈ సందర్భంగా మాట్లాడారు. ఇక ఇంద్రజ  ప్రస్తుత కెరియర్ విషయానికి వస్తే పలు సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. అదే విధంగా జబర్దస్త్ కార్యక్రమంతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో కూడా జడ్జిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

Also Read: MSVPG Film చిరు శశిరేఖ సాంగ్… లిరిక్సే కాదు.. స్టెప్స్ కూడా కాపీనేనా?

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×