E-Paper
Advertisement

మళ్లీ జన్మంటూ ఉంటే అలాగే పుట్టాలి.. ఈ బ్రతుకు వద్దు ఫైమా ఎమోషనల్!

మళ్లీ జన్మంటూ ఉంటే అలాగే పుట్టాలి.. ఈ బ్రతుకు వద్దు ఫైమా ఎమోషనల్!
Advertisement

Big Tv Kissik Talks: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఫైమా తాజాగా బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్(Big tv Kissik Talks) కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఈమె కెరియర్ కు సంబంధించిన విషయాలు అలాగే వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతూ కాస్త ఎమోషనల్ అయ్యారు. జబర్దస్త్ పైమా(Jabardasth Faima) ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి. కనీసం ఉండటానికి కూడా సొంత ఇల్లు లేదు ఎన్నో ఇబ్బందులు పడుతూ జీవనోపాధి కోసమే పటాస్ అనే కార్యక్రమం ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు .

కొత్త డ్రస్సు వేసుకునే అదృష్టం లేదు..

పటాస్ కార్యక్రమం ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఫైమా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా కెరియర్ పరంగా మంచి సక్సెస్ అందుకున్న ఈమె తన వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నట్టు తెలిపారు.. ఈ నేపథ్యంలోనే కిస్సిక్ టాక్స్ కార్యక్రమంలో భాగంగా వర్ష మాట్లాడుతూ మళ్ళీ నీ జీవితంలో ఇలాంటి రోజులు రాకూడదు అనే రోజులు ఏవైనా ఉన్నాయా అంటూ వర్ష అడగడంతో ఫైమా మాట్లాడుతూ.. మా ఇంటి పరిస్థితులు ఒకానొక సమయంలో చాలా ఘోరంగా ఉండేవి. ఆ సమయంలో మా అక్క వాళ్ళు కొత్త డ్రస్సు వేసుకున్న నేను ఏడ్చేదాన్ని తెలిపారు.

ఆడపిల్లగా పుట్టినందుకు సంతోషం లేదు..

Advertisement

కుటుంబ పరిస్థితులు బాగా లేకపోవడంతో నేను ఎప్పుడైనా అమ్మ డ్రెస్ అని అడిగితే అక్క డ్రస్సు ఉంది వేసుకో అంటూ చెప్పే వాళ్ళు కానీ నాకు మాత్రం కొత్త డ్రెస్ ఎప్పుడు ఉండేది కాదు. మా ఇంట్లో నలుగురు అమ్మాయిల నేను చిన్నదాన్ని కావడంతో వారి పాత డ్రెస్సులు అన్ని నేను వేసుకోవాల్సి వచ్చేది, నాకంటూ కొత్త బట్టలు ఉండేవి కాదని తెలిపారు. మళ్లీ ఇలాంటి పరిస్థితులు నాకు రాకూడదని ఫైమా తెలిపారు. ఇక ఆడపిల్లగా పుట్టినందుకు నువ్వు హ్యాపీగా ఉన్నావా? అంటూ వర్ష మరో ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకు ఫైమా ఎమోషనల్ అయ్యారు.

Advertisement

ఈ సందర్భంగా పైమా మాట్లాడుతూ ఆడపిల్లగా పుట్టినందుకు తాను ఏ మాత్రం సంతోషంగా లేనని తెలిపారు. నాకు మళ్ళీ జన్మంటూ ఉంటే అమ్మాయిలా పుట్టాలని లేదు. ఖచ్చితంగా అబ్బాయిగా పుట్టాలని కోరుకుంటున్నాను అంటూ ఫైమా తెలిపారు. అమ్మాయిలా బ్రతకడం మనం అనుకున్నంత ఈజీ కాదు. అందుకే నాకు మళ్ళీ జన్మంటూ ఉంటే అమ్మాయిగా పుట్టాలని అసలు కోరుకోనూ అంటూ ఫైమా చేసిన ఈ ఎమోషనల్ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఒకానొక సమయంలో తన ఇంట్లో సరిగా భోజనం చేయడానికి కూడా రైస్ ఉండేది కాదని, ఇలా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఇప్పుడిప్పుడే కాస్త సంతోషంగా ఉన్నామని ఈమె తెలియజేశారు.

Also Read: ఫైమాకు తప్పని కమిట్మెంట్ తిప్పలు… అలాంటి వారిని వదిలిపెట్టకూడదంటూ!

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×