E-Paper
Advertisement

Big tv kissik talks: పెళ్లిపై హైపర్ ఆది కామెంట్స్..  వాళ్లు మాత్రమే పెళ్లి చేసుకోండి.. క్లారిటీతో ఉన్నాడుగా!

Big tv kissik talks: పెళ్లిపై హైపర్ ఆది కామెంట్స్..  వాళ్లు మాత్రమే పెళ్లి చేసుకోండి.. క్లారిటీతో ఉన్నాడుగా!
Advertisement

Big tv kissik talks: హైపర్ ఆది పరిచయం అవసరం లేని పేరు. బుల్లితెర కమెడియన్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న హైపర్ ఆది ప్రస్తుతం వెండి తెరపై కూడా తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నారు. జబర్దస్త్ షో ద్వారా కమెడియన్ గా పరిచయమైన ఆది అతి తక్కువ సమయంలోనే ఈ కార్యక్రమంలో టీం లీడర్ గా మారి తన పంచ్ డైలాగులతో ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ఇప్పుడు కూడా ఏదైనా ఒక కార్యక్రమంలో ఆది ఉన్నారు అంటే ప్రేక్షకులకు కావాల్సినంత వినోదం దొరుకుతుందని చెప్పాలి.

పెళ్లి బాధ్యతతో కూడుకున్నది..

ఇలా జబర్దస్త్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఆది శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ కార్యక్రమాలతో బుల్లితెరపై సందడి చేస్తున్నారు. ఇక వెండి తెరపై కూడా వరుస సినిమాలలో నటిస్తూ కమెడియన్ గా బిజీగా ఉన్నారు. తాజాగా హైపర్ ఆది బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్నో విషయాలు గురించి ఆది ప్రస్తావించారు అయితే పెళ్లి గురించి కూడా ప్రస్తావనకు రావడంతో ఆది చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇటీవల కాలంలో చాలామంది పెళ్లిళ్లు చేసుకొని వెంటనే విడాకులు తీసుకుని విడిపోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హైపర్ ఆది పెళ్లి గురించి మాట్లాడుతూ పలు విషయాలు తెలియచేశారు.

కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి..

Advertisement

వర్ష ఆది పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నారు అంటూ ప్రశ్న వేయడంతో ఆది సమాధానం చెబుతూ ఇటీవల కాలంలో పెళ్లి చేసుకోవాలి అంటే ఎంతో బాధ్యతతో ఉండాల్సి ఉందని తెలిపారు. పెళ్లి చేసుకోవాలి అంటే వాడిలో ఈ లక్షణాలు ఉండాలి అంటూ ఈయన లిస్ట్ మొత్తం బయట పెట్టారు. పెళ్లి చేసుకోవాలనుకునే వారు ముందు కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి అలాగే బయట టెన్షన్ లన్ని తీసుకువచ్చి ఇంట్లో భార్యపై రుద్దకుండా ఉండాలి. ఇక ఏదైనా డబ్బు విషయంలో సమస్య వస్తే భార్య అమ్మానాన్నల వైపు చూడకుండా తన సమస్యను తానే పరిష్కరించుకునే వాడు మాత్రమే పెళ్లి చేసుకోవాలి.

Advertisement

నువ్వు నీ అమ్మానాన్నలని ఎంత ప్రేమగా అయితే చూసుకున్నావో తను పెంచిన అమ్మానాన్నలను వదిలి, నిన్ను నమ్మి నీ దగ్గరకు వచ్చిన భార్యను కూడా అంతే ప్రేమను పంచాలి. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడే పెళ్లి చేసుకోవాలని ఆది పెళ్లి గురించి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై అభిమానులు కూడా స్పందిస్తూ ఆది పెళ్లి విషయంలో చాలా క్లారిటీతో ఉన్నారని, ఈయన చెప్పింది అక్షర సత్యం అంటూ కామెంట్లు చేస్తున్నారు. పెళ్లికి, సంప్రదాయాలకు అప్పట్లో విలువ ఉండేది కానీ ఇప్పుడు లేదు. అబ్బాయిలు తాళి కడితే భార్య చెప్పినట్టు పడి ఉంటుందనే భావనలో ఉన్నారు. అమ్మాయిలు కూడా నా స్వేచ్ఛను భగ్నం చేస్తే వాడు మగాడైనా, మొగుడైన  నేను ఊరుకోను అనే భావనలో ఉన్నారు. అప్పట్లో ఎన్ని గొడవలు పడిన ఒకటయ్యే వారు కానీ ఇప్పుడు చిన్న గొడవకి విడిపోతున్నారు. ఇలాంటి ఆలోచన మారాలని ఆది తెలిపారు. అందుకే పెద్దవాళ్లు అప్పట్లో భార్య మాట భర్త వినాలి, భర్త మాట భార్య వినాలి కానీ ఇద్దరి మాట బయట వాళ్ళు వినకూడదని చెప్పేవారు కానీ ఇప్పుడు భార్య భర్తల మాటలు బయట వాళ్ళు వినడం వల్లే సమస్యలు వస్తున్నాయని తెలియజేశారు.

Also Read: The Raja Saab: రాజా సాబ్ నాన్నమ్మగా జరీనా వాహబ్ ఫస్ట్ ఛాయిస్ కాదా.. ప్రభాస్ అలా అన్నారా?

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×