E-Paper
Advertisement

మాధురి సినిమాలలో నటించాలంటే దువ్వాడ కండిషన్లు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే ?

మాధురి సినిమాలలో నటించాలంటే దువ్వాడ కండిషన్లు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే ?
Advertisement

Big Tv Kissik Talks: దివ్వెల మాధురి ఒకప్పుడు రాజకీయ నాయకురాలుగా గుర్తింపు పొందిన ప్రస్తుతం మాత్రం ఈమె సెలబ్రెటీ హోదా అనుభవిస్తున్నారు. మాధురి(Madhuri) ప్రముఖ రాజకీయ నాయకుడు దువ్వాడ శ్రీనివాస్(Duvvada Srinivas) ను పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే అయితే వీరిద్దరికీ ఇది రెండో వివాహం కావడంతో వీరి వైవాహిక జీవితం పట్ల ఎన్నో రకాల విమర్శలు కూడా వచ్చాయి. అయితే ప్రస్తుతం వీరిద్దరూ ఒకవైపు రాజకీయ వ్యవహారాలలోనూ మరోవైపు బిజినెస్ రంగంలోనూ దూసుకుపోతున్నారు. ఇక దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం కారణంగా మాధురి కూడా వార్తల్లో నిలిచారు ఈ నేపథ్యంలోనే ఈమెకు బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశం లభించింది.

ఆయన చెబితే సినిమాలు మానేస్తా..

ఇక ఈ కార్యక్రమంలో మూడు వారాలపాటు హౌస్ లో కొనసాగిన మాధురి అనంతరం బయటకు వచ్చారు అప్పటినుంచి ఈమెకు పలు సినిమాలలో అవకాశాలు కూడా వస్తున్నాయని చెప్పారు. ఇప్పటికే ఓ సినిమా షూటింగ్ పూర్తి అయిందని త్వరలోనే విడుదల కూడా కాబోతుందని తాజాగా మాధురి కిస్సిక్ టాక్స్ కార్యక్రమంలో భాగంగా తెలిపారు. అలాగే మరికొన్ని సినిమాలలో కూడా తాను నటిస్తున్నానని ఈమె తెలియజేశారు. ఒకవేళ శ్రీనివాస్ గారు మీరు సినిమాలలో నటించకూడదు అని చెబితే మానేస్తారా అంటూ ప్రశ్న ఎదురవడంతో ఖచ్చితంగా మానేస్తానని ఆయనకు ఇష్టం లేని పని నేను ఏమి చేయను అంటూ మాధురి తెలిపారు.

బిగ్ బాస్ రెమ్యూనరేషన్ మొత్తం విరాళం ఇచ్చిన మాధురి..

Advertisement

బిగ్ బాస్ కార్యక్రమంలో తను మొదట్లోనే హౌస్ లోకి వెళ్లాల్సి ఉంది అప్పటికి నన్ను హౌస్ లోకి పంపించడానికి శ్రీనివాస్ గారికి ఇష్టం లేదు తర్వాత నేను చెప్పడంతో వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి వెళ్లిపోయానని తెలిపారు. ఇక బిగ్ బాస్ కార్యక్రమంలో తనకు రెమ్యూనరేషన్ కూడా అవసరం లేదని శ్రీనివాస్ గారు చెప్పారు. అయితే బిగ్ బాస్ రెమ్యూనరేషన్ మొత్తం ఒక క్యాన్సర్ పేషంట్ కి విరాళంగా ఇచ్చేసామని మాధురి ఈ సందర్భంగా తెలిపారు. ఇక సినిమాల గురించి మాట్లాడుతూ నాకు ఎవరైనా ఒక సినిమా కథ చెప్పారు అంటే శ్రీనివాస్ గారు కూడా ఉంటారని ఆయనకు కథ నచ్చితేనే నాకు సినిమా ఓకే అవుతుందని తెలిపారు.

Advertisement

ఇదివరకు నేను 5 సినిమాలు రిజెక్ట్ చేశానని మాధురి ఈ సందర్భంగా తెలిపారు. నేను రిజెక్ట్ చేసిన సినిమాలలో వేరే వ్యక్తికి వైఫ్ క్యారెక్టర్ చేయాల్సి ఉండడంతో శ్రీనివాస్ గారికి నచ్చక రిజెక్ట్ చేశారని, ముందు ఆయనకు కథ నచ్చితేనే నేను సినిమాలలో నటిస్తానని మాధురి తెలిపారు. నేను చేసే క్యారెక్టర్ కూడా ఆయనకు నచ్చాలని మాధురి ఈ సందర్భంగా తెలిపారు. ఈమె సినిమాలలో నటించాలి అంటే ముందు శ్రీనివాస్ గారి కండిషన్లకు చిత్ర నిర్మాతలు ఒప్పుకోవాలని, ఆయనకు కథ నచ్చాలని ఈ సందర్భంగా మాధురి చెప్పకనే చెప్పేశారు. శ్రీనివాస్ గారికి నచ్చకపోతే నేను ఏ పని చేయను నేను ఆయనతో చాలా సంతోషంగా గడపాలని అనుకుంటున్నాను. ఎన్నో కాంట్రవర్సీలు, విమర్శలను ఎదుర్కొని ఇక్కడి వరకు వచ్చానని అందుకే ప్రశాంతంగా తన జీవితాన్ని గడపాలనుకుంటున్నాను అంటూ మాధురి ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Also Read: తిరుమల కేక్ వివాదంపై మాధురి క్లారిటీ.. నేనెవరికీ క్షమాపణ చెప్పలేదు.. చెప్పనంటూ..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×