E-Paper
Advertisement

Big tv Kissik Talks: శ్రీ వాణి బంగారం విలువ 20 కోట్లు.. ఆస్తులు విలువ ఎంతో తెలుసా?

Big tv Kissik Talks: శ్రీ వాణి బంగారం విలువ 20 కోట్లు.. ఆస్తులు విలువ ఎంతో తెలుసా?
Advertisement

Big tv Kissik Talks: బుల్లితెర సీరియల్ నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సీనియర్ నటి శ్రీవాణి(Sreevani) ఒకరు . ఇప్పటివరకు దాదాపు 27 టీవీ సీరియల్స్ లో నటించి బుల్లితెరపై ఎంతో మంచి సక్సెస్ అందుకున్న శ్రీ వాణి ప్రస్తుతం లక్ష్మీ రావే మా ఇంటికి నిన్ను కోరి వంటి సీరియల్స్ లో నటిస్తూ బిజీగా ఉన్నారు. తాజాగా శ్రీ వాణి బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈమెకు ఎన్నో రకాల ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ క్రమంలోనే తన ఆస్తుల గురించి తన బంగారం గురించి కూడా ప్రశ్నలు ఎదురవడంతో ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు.

అదంతా నిజమైన బంగారం కాదు..

శ్రీవాణిని చూస్తే చాలా రిచ్ లుక్ లో కనిపిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఆమె వద్ద సుమారు 20 కోట్ల రూపాయల విలువ చేసే బంగారం ఉందనే వార్త కూడా బాగా వైరల్ అయింది .ఈ వార్తలపై శ్రీవాణి స్పందించారు. తనకు మెడలో మాంగల్యం చైన్ రెండు గాజులు వంటివి తప్ప పెద్దగా బంగారం లేదని తెలిపారు. నేను సీరియల్స్ లో వేసుకునేవన్నీ కూడా నిజమైన గోల్డ్ కాదని, ఆర్టిఫిషియల్ జువెలరీ అంటూ క్లారిటీ ఇచ్చారు. శ్రీవాణి పెద్ద ఎత్తున కొత్త ఫ్లాట్స్ కొనుగోలు చేస్తూ తన యూట్యూబ్ ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ఈమె భారీ ఆస్తులను సంపాదించి ఉంటారనే వాదన కూడా వినపడుతూ ఉంటుంది.

300 గజాల స్థలం మాత్రమే..

Advertisement

ఈ విషయం గురించి శ్రీవాణి మాట్లాడుతూ తమకు ఎలాంటి ఆస్తులు లేవని క్లారిటీ ఇచ్చారు. మా మామయ్య గారు మా కూతురు నందిని పేరు మీద 300 గజాల స్థలం మాత్రమే రాసిచ్చారు. ఇప్పుడు అందులోనే ఇల్లు కట్టుకుంటున్నామని తెలిపారు. ఇక ఇప్పటివరకు కొనుగోలు చేసిన ఫ్లాట్స్ అవన్నీ కూడా యూట్యూబ్ ద్వారా వచ్చిన ఇన్కమ్ అలాగే లోన్ తీసుకుని కట్టుకున్నవేనని ఇప్పటికీ తాము ఈఎంఐ కడుతూనే ఉన్నామని శ్రీవాణి ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు.

Advertisement

ఇకపోతే గతంలో ఈమె ఆస్తులు గురించి కూడా తన వదినతో గొడవలు పడి వార్తలలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై కూడా శ్రీ వాణి ఈ స్పందించారు. ఇప్పటికీ ఆ కేసు కోర్టులో జరుగుతూనే ఉందని తెలిపారు. నేను ఏడు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మా అన్నయ్యకు పెళ్లి అయింది. నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్ లోనే కానీ మా వదిన నాపై తప్పుడు ఆరోపణలు చేసిందని, దానికి తోడు మీడియా కూడా ఈ వార్తలను తప్పుగా ప్రచారం చేసిందని క్లారిటీ ఇచ్చారు. ఈ సంఘటన తర్వాత తనకు మీడియాపై నమ్మకం పోయిందని తెలిపారు. ఇక ఈ కేసు ఎప్పటికీ పూర్తి అవుతుందో, శిక్ష ఎవరికి పడుతుందో తెలియాలి అంటూ తన ఫ్యామిలీలో జరుగుతున్న గొడవల గురించి అలాగే ఈమె సంపాదించిన ఆస్తులు బంగారం గురించి కూడా శ్రీ వాణి ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు.

Also Read: Big tv Kissik Talks:  సీరియల్ వాళ్ళు అందుకే సినిమాలు చెయ్యరు… కమిట్మెంట్ పై శ్రీ వాణి షాకింగ్ కామెంట్స్!

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×