E-Paper
Advertisement

Big tv Kissik Talks: రీతూ క్యారెక్టర్ ఇదే.. లైవ్ లో గుర్తు రట్టు చేసిన డెమోన్

Big tv Kissik Talks: రీతూ క్యారెక్టర్ ఇదే.. లైవ్ లో గుర్తు రట్టు చేసిన డెమోన్
Advertisement

Big tv Kissik Talks: రీతూ చౌదరి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు బుల్లితెర నటిగా పలు సీరియల్స్ లో నటించిన ఈమె ప్రస్తుతం బుల్లితెర సీరియల్స్ కు దూరంగా ఉన్నప్పటికీ బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్నారు. అలాగే ఇటీవల బిగ్ బాస్ కంటెస్టెంట్ గా కూడా పాల్గొని సందడి చేసిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ 9 రియాలిటీ షోలో ఈమె పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు 13 వారాలపాటు హౌస్ లో కొనసాగి అనంతరం ఎలిమినేట్ అయ్యారు. రీతు టాప్ ఫైవ్ కంటెస్టెంట్ గా ఉంటుందని అభిమానులు భావించిన ఈమె 13వ వారం ఎలిమినేట్ కావటం గమనార్హం.

బీబీ జోడీలో పవన్ రీతూ..

ఇక బిగ్ బాస్ హౌస్ లో రీతూ చౌదరి మరొక కంటెస్టెంట్ డెమోన్ పవన్(Demon Pawan) తో వీరిద్దరి మధ్య మంచి స్నేహబంధం ఉంది అయితే వీరిద్దరూ చనువుగా ఉన్న నేపథ్యంలో ఇద్దరు ప్రేమలో ఉన్నారు అంటూ వీరి గురించి బయట ఎన్నో రకాల వార్తలో హల్చల్ చేశాయి కానీ ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉందని తెలియజేశారు. ఇకపోతే రీతూ చౌదరి, పవన్ ప్రస్తుతం బీబీ జోడి కార్యక్రమంలో కూడా కంటెస్టెంట్ గా పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇలా వీరిద్దరూ బయట కూడా జంటగా కనిపిస్తున్న నేపథ్యంలో నిజంగానే ప్రేమలో ఉన్నారా అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

ఫేవరెట్ కంటెస్టెంట్ పవన్..

Advertisement

ఇదిలా ఉండగా తాజాగా రీతు చౌదరి బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా బిగ్ బాస్ కార్యక్రమం గురించి ఎన్నో రకాల ప్రశ్నలు ఎదురయ్యాయి. బిగ్ బాస్ హౌస్ ల తన ఫేవరెట్ కంటెస్టెంట్ పవన్ అని రీతు తెలిపారు. తాను టాప్ పై కంటెస్టెంట్ లో ఒకరిగా ఉంటానని భావించాను కాకపోతే 13వ వారమే బయటకు వచ్చానని తెలిపారు. అయితే విన్నర్ ఎవరో మీరు గెస్ట్ చేశారా అనే ప్రశ్న ఎదురవడంతో తాను ఇమ్మానుయేల్, డెమోన్ లేదా తనూజ విన్నర్ అవుతారని అనుకున్నాను అంటూ తన అభిప్రాయాన్ని తెలియజేశారు.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా వర్ష లైవ్ లోనే డెమోన్ పవన్ కి ఫోన్ కాల్ చేయించారు. తాను తణుకు వస్తున్నానని చెప్పడంతో పవన్ సైతం సరే ప్లాన్ చేద్దామంటూ మాట్లాడారు. వెంటనే వర్ష ఫోన్ తీసుకుని రీతు గురించి ఒక్క మాటలో చెప్పాలంటే మీరేం చెబుతారు అంటూ ప్రశ్న వేసింది. దీంతో జెన్యూన్ పర్సన్ అంటూ సమాధానం చెప్పారు మనం తనకు ఏదిస్తామో తిరిగి మనకు అదే ఇస్తుంది అంటూ ఒక్కమాటలో రీతు గురించి తెలియజేశారు. రీతు పట్ల మనం ప్రేమను చూపిస్తే మన పట్ల కూడా అంతే ప్రేమను చూపిస్తుందని లేదా ద్వేషిస్తే అంతే ద్వేషిస్తుందనే ఉద్దేశంతో పవన్ మాట్లాడారు. ఇలా రీతు గురించి మాట్లాడుతూ తన అసలు వ్యక్తిత్వాన్ని బయట పెట్టడంతో ఈ కామెంట్స్ కాస్త వైరల్ అవుతున్నాయి.

Advertisement

Also Read: Big tv Kissik Talks: అలాంటి వాడు మాత్రం భర్తగా వద్దు.. దండం పెట్టేసిన రీతూ..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×