E-Paper
Advertisement

Big Tv Kissik Talks: రీతూ క్యారెక్టర్ బ్యాడ్.. షాకింగ్ విషయాలను బయటపెట్టిన పవన్

Big Tv Kissik Talks: రీతూ క్యారెక్టర్ బ్యాడ్.. షాకింగ్ విషయాలను బయటపెట్టిన పవన్
Advertisement

Big Tv Kissik Talks: డెమోన్ పవన్ పరిచయం అవసరం లేని పేరు. కామన్ మ్యాన్ గా ఉన్న ఈయన బిగ్ బాస్ (Bigg Boss 9)అవకాశాన్ని అందుకొని సెలబ్రిటీ హోదా అనుభవిస్తున్నారు. తెనాలిలో పుట్టి పెరిగిన పవన్ సినిమాలపై ఆసక్తితో బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నారు. ఇలా తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 రియాలిటీ షోలో కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశాన్ని అందుకున్న పవన్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ టాప్ త్రీ కంటెంట్ గా హౌస్ నుంచి బయటకు వచ్చారు. ఇక ఈ కార్యక్రమం అనంతరం పలు బుల్లితెర కార్యక్రమాలలో కొనసాగుతూ కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు. ఇకపోతే హౌస్ లో ఉన్నప్పుడు పవన్ రీతు ఇద్దరు చాలా చనువుగా ఉండటంతో వీరిద్దరి మధ్య ఏదో ఉంది అంటూ వార్తలు వచ్చాయి కానీ వీరిద్దరూ మంచి స్నేహితులనే విషయాన్ని బయటపెట్టారు.

రీతు బ్యాడ్ అని చెప్పారు..

తాజాగా డెమోన్ పవన్ బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా రీతు గురించి అలాగే రీతుని నామినేట్ చేయడం గురించి కూడా ఈయన మాట్లాడారు. బిగ్ బాస్ హౌస్ లో రీతు(Ritu) తనుకు చాలా బెస్ట్ ఫ్రెండ్ అయిందని తెలిపారు. ఆమె చాలా జెన్యూన్ గా ఉందని అందుకే మేము బయటకు వచ్చిన మా మధ్య గొడవలు జరగలేదని తెలిపారు.. అయితే కొంతమంది ఫైర్ స్ట్రోమ్ కంటెస్టెంట్ హౌస్ లోకి వచ్చిన తర్వాత ఇద్దరు నా వద్దకు వచ్చి రీతు క్యారెక్టర్ మంచిది కాదు తనది బ్యాడ్ క్యారెక్టర్ తన నుంచి దూరంగా ఉండు అంటూ నాకు సలహాలు ఇచ్చారు.

ఆ క్షణం కన్నీళ్లాగలేదు..

Advertisement

వాళ్ళు చెప్పిన విధంగా రీతు నుంచి తాను దూరంగా ఉండకపోవడంతో నన్ను నామినేట్ కూడా చేశారని పవన్ తెలిపారు. అయితే రీతు గురించి వాళ్లు ఎందుకు అలా మాట్లాడుతున్నారనే విషయం నాకు అర్థం కాలేదు కానీ రీతూ మాత్రం నా దగ్గర చాలా నిజాయితీగానే ఉందని తెలిపారు. ఇక రీతుని నామినేట్ చేయడం గురించి కూడా ఈ సందర్భంగా ప్రశ్నలు ఎదురయ్యాయి. రీతూను తప్పనిసరి పరిస్థితులలో నామినేట్ చేయాల్సి వచ్చిందని పవన్ తెలిపారు. అలా నామినేట్ చేసే క్షణంలో నాకు కన్నీళ్లు ఆగలేదని తెలిపారు.

Advertisement

ఇక రీతూను నామినేట్ చేయడానికి కారణం లేకపోలేదు ఆమె హౌస్ లో నా పైన చాలా గట్టిగ అరుస్తుంది మేమిద్దరం ఫ్రెండ్స్ ఆ చనువుతో అరిచినా బాగుంటుంది కానీ బయటకు అది మరోలాగా వెళ్తుందని ఆ ఉద్దేశంతోనే తాను తనని నామినేట్ చేయాల్సి వచ్చిందని పవన్ రీతుని నామినేట్ చేయడానికి గల కారణాన్ని తెలిపారు . ఇక నామినేషన్ తర్వాత తనకి అర్థమయ్యే విధంగా చెప్పానని పవన్ తెలియజేశారు. ఇలా హౌస్ లో వీరిద్దరూ చాలా మంచి స్నేహితులుగా కొనసాగుతూనే బయటకు వచ్చిన తర్వాత కూడా అలాగే బంధాన్ని కొనసాగిస్తున్నారు. ఇక ప్రస్తుతం వీరిద్దరూ జంటగా బీబీ జోడి సీజన్ 2 కార్యక్రమంలో కంటెస్టెంట్లుగా కూడా పాల్గొని సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.

Also Read: Big Tv Kissik Talks:  డెమోన్ పేరు వెనుక స్టోరీ బయట పెట్టిన పవన్… అదే ఇన్స్పిరేషనా?

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×