E-Paper
Advertisement

టాలీవుడ్ ప్రొడ్యూసర్ చీటింగ్ … కోట్ల రూపాయలు మోసపోయానన్న సంజన,!

టాలీవుడ్ ప్రొడ్యూసర్ చీటింగ్ … కోట్ల రూపాయలు మోసపోయానన్న సంజన,!
Advertisement

Big Tv Kissik Talks: బిగ్ టీవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలలో కిస్సిక్ టాక్స్ కార్యక్రమం ఒకటి. ఈ కార్యక్రమం ద్వారా ఎంతమంది సెలబ్రిటీలు హాజరవుతూ వారికి సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఈ కార్యక్రమంలో సినీ నటి, బిగ్ బాస్ కంటెస్టెంట్ సంజన గల్రానీ(Sanjana Galrani) పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె బిగ్ బాస్ జర్నీ గురించి డ్రగ్స్ వ్యవహారం గురించి అదే విధంగా ఇండస్ట్రీలో అమ్మాయిలు ఎదుర్కొనే ఇబ్బందుల గురించి మాట్లాడారు. అలాగే ఇండస్ట్రీలో ఒక బడా ప్రొడ్యూసర్ ను నమ్మి మోసపోయిన విషయాల గురించి కూడా ఈ సందర్భంగా తెలియజేశారు.

మిడిల్ క్లాస్ మెంటాలిటీ..

తాను తన జీవితంలో మనుషులకు ప్రాధాన్యత ఇస్తాను కానీ డబ్బుకు చాలా గౌరవం ఇస్తానని సంజన తెలిపారు. తాను కావాలంటే ఏదైనా కొనుక్కోవచ్చు కానీ తాను ఎప్పుడు మిడిల్ క్లాస్ మెంటాలిటీతోనే బ్రతుకుతానని తెలిపారు. ఏదైనా ఒక మంచి వస్తువు కొనుక్కోవాలి అంటే ఆ ఫోటో చాట్ జిపిటి లో పెట్టి చీప్ గా ఎక్కడ దొరుకుతుందో సెర్చ్ చేసి మరి కొంటాను.₹100 వస్తువును 50 రూపాయలకు ఎలా కొనాలని ఆలోచిస్తానని ఈమె తెలిపారు. డబ్బు ఉంది కదా అని ఖర్చు చేస్తూ వెళ్తే రేపు నా పిల్లలకు నేనేమీ ఇవ్వలేనని సంజన తెలియజేశారు.

రూ. 2 కోట్ల రూపాయల మోసం..

Advertisement

ఇలా డబ్బు విషయంలో ఎంతో కచ్చితంగా ఉండే ఈమె కెరియర్ మొదట్లో డబ్బు సంపాదించడం కోసం షూటింగ్ కి వెళ్ళాలి అంటే నడిచి వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయని తెలిపారు. ఇలా సినిమాలలో ఎంతో కష్టపడుతూ తాను సంపాదించి రూపాయి రూపాయి పోగు చేసి ఒక టాలీవుడ్ ప్రొడ్యూసర్ చేతిలో పెట్టాను. అతను బాగా నమ్మిన వ్యక్తి అందరం కలిసి ఒకే ప్లేట్లో భోజనం చేసే అంత చనువుంది. ఇలా ఎంతో నమ్మకంగా ఉన్న ఆ వ్యక్తికి రెండు కోట్ల రూపాయలు ఇచ్చానని, డబ్బు తీసుకొని తిరిగి ఇవ్వకుండా మోసం చేశారు అంటూ సంజన ఈ సందర్భంగా టాలీవుడ్ ప్రొడ్యూసర్ తనని మోసం చేయడం గురించి మాట్లాడారు.

Advertisement

మరి ఈమె డబ్బు ఏ ప్రొడ్యూసర్ చేతికి ఇచ్చింది ఎవరు తనని మోసం చేశారనే విషయాలను మాత్రం ఎక్కడా వెల్లడించలేదు. ఇక జీవితంలో మనకు ఏదైనా కష్టాలు ఎదురైతే సూసైడ్ ఆలోచన రాకూడదు అంటూ సలహాలు కూడా ఇచ్చారు. మనం ఏదైనా ఒక విషయం గురించి ఎక్కువగా ఆలోచించి ఒత్తిడి తీసుకుంటే 80 సంవత్సరాలకు చనిపోవాల్సిన మనం 50 సంవత్సరాలకే సచ్చిపోతామని తెలిపారు. మనకి ఏదైనా జరిగితే మనకు అండగా నిలవడానికి మన ఫ్యామిలీ ఉంటుంది అందుకే ఏ విషయమైనా ముందు తల్లిదండ్రులు లేదా స్నేహితులతో షేర్ చేసుకోవాలి తప్ప సూసైడ్ అనే ఆలోచనలు రాకూడదని సూసైడ్ చేసుకుంటున్నవారికి ఈ సందర్భంగా సలహాలు కూడా ఇచ్చారు. తాను కూడా ఒకప్పుడు సూసైడ్ చేసుకోవాలనుకున్నాను కానీ తాను చనిపోతే తనపై పడిన మచ్చ తొలగిపోదన్న ఉద్దేశంతోనే బ్రతికానని ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Also Read: నమ్మిన వాళ్ళేముంచేశారు…డ్రగ్స్ కేసు పై సంజన ఎమోషనల్!

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×