E-Paper
Advertisement

Big Tv Kissik Talks: సినిమా టికెట్ల రేట్ల పై దివి కామెంట్స్.. థియేటర్ ఎక్స్పీరియన్స్ మిస్ అవుతున్నారంటూ!

Big Tv Kissik Talks: సినిమా టికెట్ల రేట్ల పై దివి కామెంట్స్.. థియేటర్ ఎక్స్పీరియన్స్ మిస్ అవుతున్నారంటూ!
Advertisement

Big Tv Kissik Talks: ఇటీవల కాలంలో ఒక సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది అంటే కచ్చితంగా సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాలలో టికెట్ ధరలు పెంచుతున్న సంగతి తెలిసిందే. ప్రీమియర్లకు వందల రూపాయలు ధరలు పెంచగా, సినిమా విడుదలైన అనంతరం మల్టీప్లెక్స్ లలో ఒక రేటు, సింగిల్ స్క్రీన్ ధియేటర్లలో మరొక రేటును ఫిక్స్ చేస్తూ ప్రభుత్వాలు అనుమతి తెలుపుతున్నాయి. అయితే ఇలా సినిమాలకు టికెట్ ధరలు పెరగడంతో ఎంతోమంది ప్రేక్షకులు సినిమాని థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయలేకపోతున్నారనే వాదన కూడా వినపడుతుంది. గత కొంతకాలంగా సినిమా ఇండస్ట్రీలో ఈ టికెట్ల రేట్ల పెంపుదల అంశం గురించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి.

భారీగా పెరుగుతున్న టికెట్ ధరలు..

ఒకానొక సమయంలో అత్యంత తక్కువ బడ్జెట్ కే సినిమాలు చేసి ప్రేక్షకులకు అనుగుణంగానే టికెట్ ధరలను అందుబాటులో ఉంచేవారు కానీ ఇప్పుడు మాత్రం ఒక ఫ్యామిలీ కలిసి థియేటర్ కు వెళ్లి సినిమా చూడాలి అంటే కనీసం 3000 నుంచి 4000 ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే టికెట్ ధరలు పెంపుదల విషయంపై ఇప్పటికే ఎంతోమంది వారి అభిప్రాయాలను తెలియజేశారు. తాజాగా బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్(Big Tv Kissik Talks) కార్యక్రమంలో భాగంగా బిగ్ బాస్ దివి పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె సినిమాలకు సంబంధించిన పలు విషయాలను అభిమానులతో పంచుకున్నారు.

థియేటర్ ఎక్స్పీరియన్స్ మిస్ అవుతున్నారు..

Advertisement

ఈ నేపథ్యంలోనే దివికి సినిమా టికెట్ల రేట్లు పెంచుతున్న అంశం గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.. ఈ ప్రశ్నకు ఈమె సమాధానం చెబుతూ.. ఒకానొక సమయంలో సినిమా విడుదలవుతుంది అంటే ఫ్యామిలీ మొత్తం థియేటర్ వెళ్లి సినిమా చూసేవారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవని తెలిపారు. ఒక వ్యక్తి సినిమా చూడటానికి వెళ్లాలి అంటే వెయ్యి రూపాయల వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. ఇలాంటి పరిస్థితులలో చాలామంది ప్రేక్షకులు థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయలేకపోతున్నారని ఈమె తన అభిప్రాయాన్ని తెలిపారు.

సినిమా టికెట్ ధరలు అందరికీ అందుబాటులో ఉన్నప్పుడే ప్రేక్షకులు కూడా సినిమా చూడటం కోసం తరలివస్తారని దివి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక ఈ వ్యాఖ్యలపై పలువురు స్పందిస్తూ ఈమె చెప్పింది కూడా నిజమే కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు అయితే ఇప్పటికే ఎంతో మంది సెలెబ్రెటీలు సినిమా టికెట్ల ధరలు పెంచడానికి పూర్తిగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. సినిమాలను కూడా ఎక్కువ బడ్జెట్ లేకుండా నిర్ణీత బడ్జెట్ లో పూర్తి చేస్తే అధిక బడ్జెట్ కాదని తద్వారా టికెట్ ధరలు పెంచకపోయినా మంచి లాభాలు ఉంటాయని వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఒక పాన్ ఇండియా సినిమా విడుదల అవుతుంది అంటే కేవలం ప్రీమియర్లకే వెయ్యి రూపాయలు చొప్పున టికెట్ ధరలు నిర్ణయిస్తున్న పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఇలా టికెట్ ధరలు ప్రేక్షకులకు భారంగా మారుతుందని చెప్పాలి.

Also Read: Big Tv Kissik Talks: బిగ్ బాస్ తరువాత సక్సెస్ రావాలంటే ఆ పని చెయ్యాల్సిందే: దివి

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×