E-Paper
Advertisement

Bigtv Kissik Talks: బ్రేకప్ అవడం వల్లే ఈ స్థాయిలో ఉన్నాను.. నా కన్నీళ్లు దిండుకు మాత్రమే తెలుసు: దివి

Bigtv Kissik Talks: బ్రేకప్ అవడం వల్లే ఈ స్థాయిలో ఉన్నాను.. నా కన్నీళ్లు దిండుకు మాత్రమే తెలుసు: దివి
Advertisement

Bigtv Kissik Talks: సినిమాలపై ఎంతో ఆసక్తితో ఎంతోమంది ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు . మరి కొంతమంది ఇంకా సక్సెస్ కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇలా సినిమాలపై ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి మోడలింగ్ రంగంలో సక్సెస్ అందుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన వారిలో బిగ్ బాస్ దివి(Bigg Boss Divi) ఒకరు. మోడల్ గా తన కేరియర్ ప్రారంభించిన ఈమె అనంతరం షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక మహేష్ బాబు హీరోగా నటించిన మహర్షి సినిమా ద్వారా మొదటిసారి వెండి తెరపై సందడి చేశారు. మహర్షి సినిమా తరువాత దివి పలు సినిమాలలో నటించి అవకాశాలను అందుకున్నారు కానీ అవన్నీ కేవలం చిన్న చిన్న పాత్రలు కావటం గమనార్హం.

బ్రేకప్ వల్ల ఇండస్ట్రీ లోకి వచ్చాను..

ఇలా సినిమాలలో నటిస్తున్న ఈమె బిగ్ బాస్ అవకాశాన్ని కూడా అందుకున్నారు. ఇక బిగ్ బాస్ (Bigg Boss)తర్వాత కూడా పలు సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్న దివి తాజాగా బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె తన కెరియర్ గురించి అలాగే తన వ్యక్తిగత విషయాలు గురించి కూడా అభిమానులతో పంచుకున్నారు . ఇక ఈ కార్యక్రమంలో భాగంగా దివి తన బ్రేకప్ గురించి కూడా మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.. తన బ్రేకప్ గురించి మాట్లాడుతూ అబ్బాయి వాళ్ళ ఇంట్లో కొన్ని కారణాల వల్ల బ్రేకప్ చెప్పుకోవాల్సి వచ్చిందని ఈమె తెలియజేశారు.

డిప్రెషన్ లోకి వెళ్లిన దివి…

Advertisement

ఒకవేళ నాకు లవ్ బ్రేకప్ కనుక జరిగి ఉండకపోతే నేడు నేను నటిగా ఇండస్ట్రీలో ఉండే దాన్ని కాదు ఒక హౌస్ వైఫ్ గా ఓ ముగ్గురు నలుగురు పిల్లలకు తల్లి అయి ఇంట్లోనే ఉండేదాన్ని అంటూ ఈమె తెలియజేశారు. దివి ఇలా చెప్పడంతో ఈమె ఇండస్ట్రీలో కొనసాగడం అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఇష్టం లేకనే బ్రేకప్ చెప్పుకున్నారని స్పష్టం అవుతుంది. ఇక బ్రేకప్ తర్వాత అందరిలాగే తాను కూడా డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని, చాలా బాగా ఏడ్చానని, నా ఏడుపు ఇంట్లో వారికి వినపడకుండా దిండులో మొఖం దాచుకొని ఏడ్చేదాన్ని, నా కన్నీళ్లు మొత్తం దిండుకు మాత్రమే తెలుసు అంటూ ఈ సందర్భంగా తన బాధను మొత్తం బయటపెట్టారు.

Advertisement

లవ్ అనేది ఒక రెండు మూడు సంవత్సరాలు జరిగే ప్రాసెస్ అలాంటిది క్షణాల్లో మర్చిపోవాలి అంటే సాధ్యం కాదు చాలా పెయిన్ ఉంటుందంటూ ఈమె తన బాధను మొత్తం బయటపెట్టారు. ఇక కొంతకాలం తర్వాత తాను ఈ విషయం నుంచి బయటపడి కెరియర్ పై ఫోకస్ పెట్టానని దివి ఈ సందర్భంగా తెలియజేశారు. బ్రేకప్ అయిన తర్వాత అక్కడే ఆగిపోకూడదని మూవ్ అవ్వాలని సలహా ఇచ్చారు. ఇక తన ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ.. నాన్నది వైజాగ్ ,అమ్మది హైదరాబాద్ అని తెలిపారు. ఇక తన అమ్మ, అన్నయ్య ఇద్దరు పీహెచ్డీ పూర్తి చేసే ప్రొఫెసర్ గా పని చేస్తున్నారని, తన తండ్రి మెడికల్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారని వీరంతా కూడా సెంట్రల్ ఎంప్లాయిస్ అంటూ తెలియచేశారు. ఇలా తన ఫ్యామిలీ విషయాలతో పాటు తన లవ్ బ్రేకప్ గురించి ఈ కార్యక్రమంలో దివి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Also Read: Big tv Kissik Talks : బిగ్ బాస్ దివికి పేరు పెట్టింది ఆ స్టార్ హీరోనా…అసలు స్టోరీ చెప్పిన దివి!

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×