E-Paper
Advertisement

Big tv Kissik Talks : బిగ్ బాస్ దివికి పేరు పెట్టింది ఆ స్టార్ హీరోనా…అసలు స్టోరీ చెప్పిన దివి!

Big tv Kissik Talks : బిగ్ బాస్ దివికి పేరు పెట్టింది ఆ స్టార్ హీరోనా…అసలు స్టోరీ చెప్పిన దివి!
Advertisement

Big tv kissik talks: బిగ్ టీవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలలో కిస్సిక్ టాక్స్ (Kissik Talks)కార్యక్రమం ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ప్రతి వారం సెలబ్రిటీలు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ వారికి సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఇకపోతే తాజాగా ఈ కార్యక్రమానికి బిగ్ బాస్ దివి (Divi)హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే తనకు దివి అనే పేరు పెట్టింది కింగ్ నాగార్జున (Nagarjuna)అంటూ షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. అసలు దివికి నాగార్జున పేరు పెట్టడం ఏంటి ?ఈమె అసలు పేరు ఇది కాదా? మరి దివి అసలు పేరు ఏంటి అనే విషయానికి వస్తే..

నాగార్జున పేరు పెట్టారు..

దివి అసలు పేరు దివ్య(Divya) అంటూ ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె బయట పెట్టారు. తన స్కూల్లో 100 మందిలో నలుగురి పేరు దివ్య అని ఉండేదని నన్ను అందరూ పొడవు దివ్య అంటూ పిలిచేవారని తెలియచేశారు. అయితే నాకు ఈ దివ్య అనే పేరు నచ్చకపోవడంతో తనకెంతో ఇష్టమైన దివి అనే పేరును పెట్టుకోవాలనుకున్నాను. అయితే ఈ పేరును మాత్రం నాగార్జున గారు అఫీషియల్ గా ప్రకటించారని అందుకే ఈ పేరు నాగార్జున గారే నాకు పెట్టారని భావిస్తుంటాను అంటూ ఈ సందర్భంగా తెలిపారు. తాను మోడల్ గా ఉన్న సమయంలోనే తనకు బిగ్ బాస్(Bigg Boss) అవకాశం వచ్చిందని తెలిపారు. అయితే ఈ కార్యక్రమం ద్వారా నేను అందరికీ పరిచయం కాబోతున్నాను అందుకే తన పేరు దివ్య అని కాకుండా దివి అని ఉండాలని కోరుకున్నాను. ఇదే విషయం నాగార్జున గారితో చెబితే ఆయన నన్ను వేదికపై పిలిచేటప్పుడు దివి అని పిలుస్తూ తన పేరును అఫీషియల్ గా ప్రకటించారని దివి ఈ సందర్భంగా తెలియజేశారు.

Advertisement

ఇలా నాగార్జున గారి చేత దివి పేరు పెట్టించుకున్నారనే విషయం తెలిసిన అభిమానులు షాక్ అవుతున్నారు. ఇక మోడల్ గా ఈమె తన కెరియర్ ప్రారంభించారు. అనంతరం షార్ట్ ఫిలిమ్స్ చేసుకుంటున్న దివి మహర్షి సినిమాలో మొదటిసారి వెండితెర పైకి ఎంట్రీ ఇచ్చారు ఇక మోడలింగ్ రంగంలో తనకు మంచి సక్సెస్ వచ్చిన నేపథ్యంలోనే బిగ్ బాస్ అవకాశం వచ్చిందని, తన కెరియర్ కు బిగ్ బాస్ ప్లస్ అయిందంటూ దివి ఈ సందర్భంగా తెలియజేశారు . ఇక బిగ్ బాస్ తరువాత తనుకు బోలెడు సినిమా ఛాన్స్ లు వచ్చాయి కానీ అవన్నీ కూడా చిన్న చిన్న పాత్రలే అని , మంచి పాత్రల కోసం తాను కూడా ఎదురుచూస్తున్నానంటూ ఈ సందర్భంగా దివి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. చిన్న పాత్రలైనా పాన్ ఇండియా సినిమాలు కావడంతో తాను నటిస్తున్నానని తెలియజేశారు ఇక ఇటీవల పుష్ప సినిమాలో రిపోర్టర్ పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే.

Advertisement

Also Read: The Paradise release Date: జూన్ నెలలోనే ది ప్యారడైజ్…రిలీజ్ డేట్ కన్ఫర్మ్?

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×