E-Paper
Advertisement

నెపోటిజం పై అర్జున్ కళ్యాణ్ కామెంట్స్.. రెకమండేషన్స్ ఉంటేనే ఛాన్సులు?

నెపోటిజం పై అర్జున్ కళ్యాణ్ కామెంట్స్.. రెకమండేషన్స్ ఉంటేనే ఛాన్సులు?
Advertisement

Big Tv Kissik Talks: అర్జున్ కళ్యాణ్ పరిచయం అవసరం లేని పేరు. బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అర్జున్ కళ్యాణ్ (Arjun Kalyan)ప్రస్తుతం ఇండస్ట్రీలో కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుత ఈయన బుల్లితెర సీరియల్స్ తో పాటు, పలు బుల్లితెర కార్యక్రమాలలోనూ వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ కెరియర్ పట్ల ఎంతో బిజీగా ఉన్నారు. ఇకపోతే తాజాగా అర్జున్ కళ్యాణ్ బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ (Big tv kissik Talks)కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా కెరియర్ కి సంబంధించిన విషయాలతో పాటు తన వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకున్నారు.

టాలెంట్ చూసి అవకాశాలు ఇవ్వరు..

సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావడం అంటే ఎంతో కష్టతరమైన విషయమని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ఇండస్ట్రీలో అవకాశాలు అందుకోవడం గురించి అర్జున్ కళ్యాణ్(Arjun Kalyan) మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సినిమా ఇండస్ట్రీలో అవకాశం ఉండాలి అంటే టాలెంట్ ఉంటే సరిపోదని తెలిపారు. మనలో ఉన్న టాలెంట్ చూసి అవకాశాలు ఇచ్చే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అదృష్టవశాత్తు నాకు అలాంటివారు ఒక ఇద్దరు ముగ్గురు తగిలారని అందుకే నేను ఈ స్థాయిలో ఉన్నానని అర్జున్ కళ్యాణ్ తెలిపారు. ఇండస్ట్రీలో అవకాశాలు రావాలి అంటే రెకమండేషన్స్ ఉండాలని ఈయన తెలిపారు.

స్టార్ కిడ్స్ కు మాత్రమే అవకాశాలు..

Advertisement

రెకమండేషన్స్ లేకపోతే అవకాశాలు రావని ఒకవేళ వచ్చిన, కొంత భాగం షూటింగ్ అయిపోయిన రికమండేషన్స్ కారణంగా మనల్ని ప్రాజెక్టు నుంచి తప్పిస్తారని తెలిపారు. తాను రెండు మూడు సందర్భాలలో ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్నానని అర్జున్ కళ్యాణ్ తెలియచేశారు. ఇండస్ట్రీలో మంచి అవకాశాలు అందుకోవాలి అంటే ఒకటి రికమండేషన్స్ ఉండాలి రెండు స్టార్ కిడ్స్ అయితే చాలు అవకాశాలు వస్తాయని తెలిపారు.  మరి ఎప్పుడైనా నేను కూడా ఒక స్టార్ హీరో కొడుకు అయి ఉంటే బాగుండు అనే భావన కలిగిందా అంటూ వర్ష ప్రశ్న వేశారు.

Advertisement

ఈ ప్రశ్నకు అర్జున్ కళ్యాణ్ సమాధానం చెబుతూ ఒకటి రెండు సందర్భాలలో నా ఫ్యామిలీకి కూడా మంచి సినీ బ్యాక్ గ్రౌండ్ ఉండి ఉంటే బాగుండేది ,ఒక స్టార్ హీరో కొడుకు అయి ఉంటే బాగుండేది అనిపించిందని సమాధానం ఇచ్చారు. ఇలా సినీ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చినవారికి అలాగే రికమండేషన్స్ ఉన్నవారికి మాత్రమే అవకాశాలు వస్తాయి తప్ప టాలెంట్ ఉంటే ఏమాత్రం సెట్ అవ్వదని ఇండస్ట్రీలో అవకాశాలను అందుకోవడం గురించి అర్జున్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయిలకు అవకాశాలు రావడం చాలా కష్టమని, అమ్మాయిలకు కూడా ఎన్నో ఇబ్బందులు ఉంటాయి కానీ వారితో పోలిస్తే అబ్బాయిలు అవకాశాలు అందుకోవడం కష్టమంటూ ఈ సందర్భంగా అర్జున్ కళ్యాణ్ తెలియచేశారు.

Also Read: తరుణ్ భాస్కర్ ‘గాయపడ్డ సింహం’ ట్రైలర్ రిలీజ్.. ట్రంప్ మీదే రివేంజా?

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×