E-Paper
Advertisement

Big tv Kissik Talks: ఇండస్ట్రీలో ఉండే పెద్ద సమస్య అదే.. అందుకే ఈ గ్యాప్!

Big tv Kissik Talks: ఇండస్ట్రీలో ఉండే పెద్ద సమస్య అదే.. అందుకే ఈ గ్యాప్!
Advertisement

Big tv kissik Talks: సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లుగా కొనసాగే సెలబ్రిటీలు అవకాశాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఒకసారి ఏదైనా ఒక పాత్రలో నటించి మంచి సక్సెస్ వచ్చింది అంటే వారికి అదే తరహా పాత్రలలో నటించే అవకాశాలు వస్తుంటాయి. ఇలా ఒకే తరహా పాత్రలలో నటించడానికి సెలబ్రిటీలు కూడా ఏమాత్రం ఇష్టపడరు. ఓకే తరహా పాత్రలలో నటించే అవకాశాలు వస్తే సెలబ్రిటీలు సినిమాల నుంచి కూడా తప్పుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే నటి జ్యోతి కూడా సినిమాలకు దూరం అవడానికి ఇదే కారణం అని తెలిపారు.

జ్యోతి అంటే గ్లామర్ పాత్రలేనా?

తనకు నిత్యం ఒకే తరహా పాత్రలలో అవకాశాలు వస్తున్న నేపథ్యంలోనే సినిమాలకు దూరంగా ఉన్నానని వెల్లడించారు. ఏదైనా విభిన్నంగా నటించే అవకాశం వస్తే తిరిగి కచ్చితంగా సినిమాలలో నటిస్తానని తెలిపారు . జ్యోతి అంటే అందరికీ గ్లామర్ రోల్ చేయడం, ఐటెం సాంగ్ చేయడం వంటి ఆలోచన మాత్రమే ఉంటుందని, ఇలాంటి ఆలోచన నుంచి బయటపడటం కోసం తాను కొంత విరామం తీసుకున్నానని తెలిపారు. ఇండస్ట్రీలో తాను ఎన్నో పాత్రలలో నటించే అవకాశాలను కూడా మిస్ చేసుకున్నానని తెలిపారు.

దర్శక నిర్మాతల ఆలోచన మారాలి..

Advertisement

చాలామంది దర్శకులు గ్లామర్ షో చేయాలని చెప్పారు, స్విమ్ సూట్ వంటి సన్నివేశాలలో నటించాలని కోరినప్పుడు నేను నిర్మొహమాటంగా రిజెక్ట్ చేసానని కూడా తెలిపారు. ఒక హీరో లేదా హీరోయిన్ కు ఒక పాత్రలో చేసి మంచి గుర్తింపు వస్తే అదే తరహా పాత్రలు ఇవ్వటమే మన ఇండస్ట్రీలో ఉన్న పెద్ద సమస్య అని తెలిపారు. దర్శక నిర్మాతలు ఈ ఆలోచన నుంచి బయటపడాలని తెలిపారు. ప్రతి ఒక్కరు నటిగా ఎన్నో విభిన్నమైన పాత్రలలో నటించాలని కోరుకుంటారే తప్ప ఓకే మూస ధోరణిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి ఇష్ట పడరని తెలిపారు. ఇక మీ కెరియర్ లో ఛాలెంజింగ్ అనిపించిన పాత్ర ఏదైనా ఉందా అంటూ ప్రశ్న వేయడంతో మహాత్మ సినిమాలో నటించడం నాకు చాలా చాలెంజింగ్ అనిపించిందని తెలిపారు.

Advertisement

అప్పటివరకు ఒకే జానర్ సినిమాలు చేస్తున్న నాకు మహాత్మా సినిమాలో నెగిటివ్ పాత్రలో నటించే అవకాశం వచ్చింది. ఈ పాత్రను చాలెంజింగ్ గా తీసుకొని నటించాను. ఇక ఈ సినిమా తరువాత తదుపరి సినిమాలలో అవకాశాలు వచ్చిన నేను బాబు కోసమే ఇండస్ట్రీకి దూరం కావాల్సి వచ్చిందని తెలిపారు. ఇక తనకు ఇష్టమైన హీరో చిరంజీవి అని చిరంజీవి గారి డాన్స్ చూసి నేను కూడా డాన్స్ నేర్చుకొని ఇండస్ట్రీలోకి వచ్చానని తెలిపారు. చిరంజీవి గారితో కలిసి అందరివాడు సినిమాలో నటించే అవకాశం వచ్చింది అయితే చిరంజీవి గారి సినిమా అంటేనే ఏం ఆలోచించకుండా ఓకే చెప్పాను తీరా చూస్తే చిరంజీవిని పెళ్లి చేసుకోకుండా రిజెక్ట్ చేసే సీన్ అంటూ ఈ సందర్భంగా జ్యోతి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Also Read: Big tv Kissik Talks: పుష్ప అనసూయ పాత్ర పై జ్యోతి కామెంట్స్…నా ఫీలింగ్ అదే అంటూ!

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×