E-Paper
Advertisement

Big tv Kissik Talks: జీవితంలో చేసిన పెద్ద తప్పు అదే… ఎవరూ చేయొద్దు జ్యోతి ఎమోషనల్!

Big tv Kissik Talks: జీవితంలో చేసిన పెద్ద తప్పు అదే… ఎవరూ చేయొద్దు జ్యోతి ఎమోషనల్!
Advertisement

Big tv Kissik Talks: సినీ ఇండస్ట్రీలో నటిగా పలు సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో జ్యోతి(Jyothi) ఒకరు. పెళ్ళాం ఊరెళ్తే సినిమాతో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈమె సుమారు 80 కి పైగా సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. అయితే ఇటీవల ఇండస్ట్రీకి కొంచెం దూరంగా ఉన్న జ్యోతి తాజాగా బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ (Big tv kissik talks)కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె తన కెరీర్ కి సంబంధించిన విషయాలతో పాటు తన వ్యక్తిగత విషయాల గురించి కూడా మాట్లాడుతూ కాస్త ఎమోషనల్ అయ్యారు. ముఖ్యంగా తన పెళ్లి గురించి మాట్లాడుతూ..

పెళ్లి విషయంలో తప్పుటడుగులు వేసా..

తాను తన జీవితంలో ఏదైనా పెద్ద తప్పు చేశాను అంటే అది పెళ్లి చేసుకోవడమే అని షాకింగ్ విషయాలను బయటపెట్టారు. పెళ్లికి ముందే ఒక అబ్బాయితో ప్రేమలో ఉన్నానని కానీ అతను మోసం చేయడంతో మోసం చేయటం వల్ల పంతంతో అదే సమయంలోనే మరొక అబ్బాయి నాకు ప్రపోజ్ చేయడంతో తనని పెళ్లి చేసుకున్నానని తెలిపారు. అలా పెళ్లి చేసుకోవడమే నేను చేసిన పెద్ద తప్పని తెలిపారు.. అయితే పెళ్లి తర్వాత నాకు ఏదైనా మెమరీ ఉంది అంటే అది తన కుమారుడే అని, తన కొడుకు కోసమే తాను బ్రతుకుతున్నానని తెలిపారు. పెళ్లి విషయంలో ఏ ఒక్కరు కూడా తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని ఈ సందర్భంగా జ్యోతి అమ్మాయిలకు సలహా ఇచ్చారు.

బ్రతుకుతున్నది తన కోసమే…

Advertisement

పెళ్లయిన వెంటనే బాబు పుట్టిన రెండు సంవత్సరాలకి తాను విడాకులు తీసుకుని విడిపోయానని ఆ విడాకుల సమయంలో తాను ఎంతో బాధను అనుభవించానని జ్యోతి తెలిపారు. బాబు కోసమే కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చానని.. తనే నా జీవితం అనుకుని తనకోసం బ్రతుకుతున్నానని తెలిపారు. జీవితం అంటే చాలా సింపుల్ అని ఆలోచించి నాకు పెళ్లయి బాబు పుట్టిన తర్వాత జీవితం అంటే ఏంటో తెలుసొచ్చింది. జీవితంలో ముందుకు సాగడం చాలా కష్టమని తెలిపారు.

Advertisement

ఇలా తన వ్యక్తిగత జీవితం గురించి ఎన్నో విషయాలను పంచుకున్న ఈమె ఇటీవల సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. అయితే ఏదైనా మంచి అవకాశాలు వస్తే తప్పకుండా నటిస్తానని కూడా తెలియజేశారు. ఇలా సినిమాలలో నటిస్తూనే మరోవైపు ఈమె బిగ్ బాస్ కార్యక్రమంలోకి కూడా అడుగుపెట్టి కంటెస్టెంట్ గా పాల్గొన్న సంగతి తెలిసిందే. జ్యోతి తెలుగు బిగ్ బాస్ సీజన్ 1 కంటెస్టెంట్ గా పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే ఈమె టాస్కులలో పెద్దగా పెర్ఫార్మెన్స్ ఇవ్వని నేపథ్యంలో హౌస్ లోకి అడుగుపెట్టిన రెండవ వారమే హౌస్ నుంచి బయటకు వచ్చారు. ఇలా బిగ్ బాస్ కార్యక్రమం నుంచి బయటకు వచ్చిన ఈమె పెద్దగా కెరియర్ పరంగా బిజీ కాలేదు కానీ పలు బుల్లితెర కార్యక్రమాలలో అలాగే టీవీ షో లలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×