E-Paper
Advertisement

Big tv kissik Talks: ఇంద్రజ ఫస్ట్ రెమ్యూనరేషన్.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Big tv kissik Talks: ఇంద్రజ ఫస్ట్ రెమ్యూనరేషన్.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?
Advertisement

Big tv kissik Talks: యమలీల సినిమా ద్వారా హీరోయిన్ గా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు నటి ఇంద్రజ. మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె అనంతరం పలు సినిమాలలో హీరోయిన్ గా స్టార్ హీరోల సరసన నటిస్తూ మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఈమె వివాహం తర్వాత పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. పెళ్లయిన వెంటనే పాపకు జన్మనిచ్చిన తర్వాత ఇండస్ట్రీలోకి రావాలనుకున్న సమయంలో తన తల్లి మరణించడంతో కొంతకాలం పాటు ఇండస్ట్రీకి గ్యాప్ వచ్చిందని తెలిపారు. ఇంకా శతమానం భవతి సినిమా ద్వారా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంద్రజ ప్రస్తుతం వరుస సినిమాలతో పాటు బుల్లితెర కార్యక్రమాలలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు.

యమలీల మొదటి సినిమా కాదు..

తాజాగా ఇంద్రజ కిస్సిక్ టాక్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె రెమ్యూనరేషన్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ సందర్భంగా ఇంద్రజ మాట్లాడుతూ అందరూ యమలీల సినిమా తన ఫస్ట్ సినిమా అని అనుకుంటారు. నిజానికి యమలీల ఫస్ట్ సినిమా కాదని జంతర్ మంతర్ తన మొదటి సినిమా అని తెలిపారు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన తర్వాత కొన్ని కారణాలవల్ల కొద్ది రోజులు ఆగిపోయిందని ఆ తర్వాత ఎన్నో కష్టాలు పడి సినిమాని విడుదల చేసామని తెలిపారు. ఈ సినిమా విడుదలైనా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిందని తెలిపారు.

మొదటి రెమ్యూనరేషన్ రూ.65 వేలు..

Advertisement

ఈ విధంగా జంతర్ మంతర్ సినిమాకు తాను మొదటిసారి హీరోయిన్ గా ఎంపిక అయిన తాను యమలీల సినిమా ద్వారా మొదటిసారి ప్రేక్షకుల ముందుకు వచ్చానని తెలిపారు.. ఈ సినిమా కోసం తాను మొదటిసారి తీసుకున్న రెమ్యూనరేషన్ 65 వేల రూపాయలని వెల్లడించారు. ఇప్పుడు ఎంత అని అడగడంతో ఇప్పుడు రెమ్యూనరేషన్ ఇంత అని క్యాలిక్యులేషన్స్ లేవని కొన్నిసార్లు కొంతమందిని దృష్టిలో పెట్టుకొని రెమ్యూనరేషన్ లేకుండా కూడా నటించాల్సి వస్తుందని తెలిపారు. ఇక ఇంద్రజ ఆస్తులు గురించి కూడా ఈ సందర్భంగా ప్రశ్నలు ఎదురయ్యాయి.

Advertisement

ఇంద్రజ గారు భారీగా ఆస్తులు సంపాదించారు అంటూ మనం వార్తలు వింటూ ఉంటాం మరి మీ ఆస్తులు ఎంత అంటూ వర్ష అడగడంతో ఆస్తులు బానే ఉన్నాయని చెప్పారే తప్ప ఎంత ఉన్నాయని మాత్రం తెలియచేయలేదు. తమకు పొలాలు ఉన్నాయని ఇంద్రజ తెలిపారు. మేము సంపాదించే దాంట్లో ఎక్కువగా భూముల మీదనే పెట్టుబడిగా పెడతామని ఇంద్రజ తెలిపారు. తద్వారా ఆస్తులు బానే ఉన్నాయి అంటూ ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు కానీ ఎంత విలువ చేస్తుందనేది మాత్రం తెలియచేయలేదు. ఇక ప్రస్తుతం ప్రాజెక్టుల గురించి కూడా ఇంద్రజ తెలిపారు. తాను నాలుగు సినిమాలకు కమిట్ అయ్యానని ఈ నాలుగు సినిమాలు కూడా షూటింగ్ జరుగుతున్నాయని తెలియజేశారు.

Also Read: Big tv kissik Talks:హైపర్ ఆది పై ఇంద్రజ కామెంట్స్.. అమ్మాయిల మీద పడి ఏడుస్తుంటాడంటూ..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×