E-Paper
Advertisement

Big tv kissi Talks: ఆ బంధం దేవుడు ఇచ్చినదే.. సుధీర్ విషయంలో ఇంద్రజ ఎమోషనల్!

Big tv kissi Talks: ఆ బంధం దేవుడు ఇచ్చినదే.. సుధీర్ విషయంలో ఇంద్రజ ఎమోషనల్!
Advertisement

Big tv kissik Talks: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకొని వెండితెరపై ఓ వెలుగు వెలిగిన వారిలో సీనియర్ నటి ఇంద్రజ(Indraja) ఒకరు. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో కలిసి సూపర్ హిట్ సినిమాలలో నటించిన ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్ కూడా ప్రారంభించి ఎంతో బిజీగా ఉన్నారు. ఇంద్రజ ప్రస్తుతం కొన్ని సినిమాలలో నటిస్తూనే మరోవైపు బుల్లితెర కార్యక్రమాలలో కూడా పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు ఈమె జబర్దస్త్ కార్యక్రమంతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాలకు జడ్జిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

జబర్దస్త్ జడ్జిగా ఇంద్రజ..

ఇంద్రజ శ్రీదేవి డ్రామా కంపెనీ జబర్దస్త్ కార్యక్రమాలలో జడ్జిగా వ్యవహరిస్తూ జబర్దస్త్ కమెడియన్స్ తో ఎంతో మంచి అనుబంధాన్ని ఏర్పరచుకున్నారు. ముఖ్యంగా సుడిగాలి సుదీర్(Sudigali Sudheer) ఇంద్రజ బాండింగ్ వేరే లెవల్ అని చెప్పాలి. ఇంద్రజ బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సుధీర్ గురించి ఈమె మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. సుధీర్ శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి యాంకర్ గా ఉన్న సమయంలో ఇంద్రజను అమ్మ అంటూ పిలిచేవారు. ఇలా వీరిద్దరి మధ్య తల్లి కొడుకుల అనుబంధం ఏర్పడింది.

Advertisement

తల్లి కొడుకుల అనుబంధం..

ఇక ప్రస్తుతం సుధీర్ ఈటీవీకి పూర్తిగా దూరంగా ఉంటూ సినిమాలపై ఫోకస్ చేశారు. అలాగే ఇతర ఛానల్లో ప్రసారమవుతున్న కార్యక్రమాలకు యాంకర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సుదీర్ ప్రస్తావన రావడంతో ఇంద్రజ కాస్త ఎమోషనల్ అయ్యారు. సుధీర్ నన్ను ఎంతో ఆప్యాయంగా అమ్మ అని పిలిచేవాడని, మా ఇద్దరి మధ్య తల్లి కొడుకుల అనుబంధం అలా నిలిచిపోయిందని తెలిపారు. బహుశా ఈ బంధం ఆ దేవుడు ఇచ్చిందేమో అంటూ ఇంద్రజ ఎమోషనల్ అయ్యారు. ఇక సుధీర్ గురించి ఏదైనా ఒక విషయం చెప్పాలి అంటే మీరేం చెబుతారు అంటూ వర్ష ప్రశ్న వేశారు .

Advertisement

ఈ సందర్భంగా ఇంద్రజ మాట్లాడుతూ సుదీర్ తన కెరియర్ పరంగా ఉండాల్సిన పొజిషన్ చేరుకోలేకపోయారేమో అంటూ ఈ ప్రోమోలో తెలియజేశారు. మరి పూర్తి ఎపిసోడ్లో భాగంగా సుధీర్ గురించి ఈమె ఎలాంటి విషయాలను తెలియచేశారు అనేది తెలియనుంది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా జబర్దస్త్ కమెడియన్స్ గురించి అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం గురించి మాట్లాడారు. ఇక ఇటీవల సెలబ్రిటీల వస్త్ర ధారణ పై పై వస్తున్న విమర్శలు గురించి కూడా ఇంద్రజ చర్చించారు. అయితే ఈ విషయాలు గురించి ఇంద్రజ ఏం మాట్లాడారనేది తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు మనం ఎదురు చూడాల్సిందే. ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్ పెద్ద శనివారం రాత్రి 7 గంటలకు బిగ్ టీవీలో ప్రసారం కానుంది.

Also Read: Allu Arjun -Sri tej: శ్రీతేజ్‌కు అల్లు అర్జున్ ఇప్పటి వరకు ఎన్ని కోట్లు ఇచ్చారో తెలుసా?

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×