E-Paper
Advertisement

Intinti Ramayanam : ‘ ఇంటింటి రామాయణం ‘ సీరియల్ కు శుభం కార్డు.. చివరిల్లో ఊహించని ట్విస్ట్..

Intinti Ramayanam : ‘ ఇంటింటి రామాయణం ‘ సీరియల్ కు శుభం కార్డు.. చివరిల్లో ఊహించని ట్విస్ట్..
Advertisement

Intinti Ramayanam : స్టార్ మా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న టాప్ సీరియల్స్లలో ఇంటింటి రామాయణం సీరియల్ కూడా ఒకటి.. ఈ సీరియల్ జనాలని ఎంతగా ఆకట్టుకుందో చెప్పనక్కర్లేదు.. టైటిల్ కు తగ్గట్లుగానే ఇంటింటి రామాయణం ఎలా ఉంటుందో ఈ సీరియల్ స్టోరీ అలా ఉంటుంది.. తన కుటుంబాన్ని కాపాడుకునే విధంగా అవని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. కానీ పల్లవి మాత్రం ఆ ఇంటిని ఎలాగైనా సరే ముక్కలు చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. మొత్తానికి ఈ సీరియల్ ప్రస్తుతం చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. శ్రియకి బిడ్డ పుట్టడంతో పల్లవి ఆస్తి దూరమవుతుంది అని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. శ్రీయ మాత్రం తన బిడ్డను కాపాడిన అవనీని దేవతగా కొలుస్తూ ఉంటుంది. అయితే ఈ సీరియల్ గురించి ఓ షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. త్వరలోనే సీరియల్ కి శుభం కార్డు పడబోతుంది అని ఓ వార్త ప్రచారంలో ఉంది. అందుకు కారణం ఏంటో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

ఇంటింటి రామాయణం సీరియల్ కు శుభం కార్డు..?

స్టార్ మా లో ప్రసారమవుతున్న టాప్ రేటింగ్ సీరియల్స్లలో మూడవ స్థానంలో ఉన్న సీరియల్ ఇంటింటి రామాయణం.. ప్రతిరోజు డిఫరెంట్ స్టోరీ తో వస్తున్న ఈ సీరియల్ జనాలని ఎంతగా ఆకట్టుకుంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఛానల్ లో ప్రసారమవుతున్న టాప్ రేటింగ్ సీరియల్స్లలో టాప్ ఫైవ్ లో ఈ సీరియల్ ఉంటుంది అంటే స్టోరీ ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. అలాంటి స్టోరీ కి ఎండు కార్డు పడబోతుంది అని ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా షికారు చేస్తుంది. అందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ఇది మాత్రం త్వరలోనే సీరియల్ కు శుభం కార్డు పడుతుందని టాక్.. అంతకు కారణం కూడా లేకపోలేదు శ్రీయ అవని ప్రాణం పోసింది. దాంతో శ్రీయ అవనీని దేవత లాగా భావిస్తుంది.

Advertisement

ఇక వీళ్ళిద్దరూ కలిసిపోవడం చూసిన పల్లవి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఒంటరిగా ఉంటున్న పల్లవికి మీనాక్షి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుంది. అలా పల్లవి కూడా మారిపోయే అవకాశాలు కూడా త్వరలోనే రాబోతున్నాయని స్టోరీ ని చూస్తే అర్థమవుతుంది. మరి వీలైనంత త్వరలో ఈ సీరియల్ గుడ్ బై చెప్పబోతుందని ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇందులో నిజం ఎంత ఉందో తెలియాలంటే ఇంటింటి రామాయణం టీం స్పందించేంత వరకు వెయిట్ చేయాల్సిందే…

సీరియల్ స్టోరీ విషయానికొస్తే…

పల్లవి మాట విని అవనిపై సీరియస్ అవుతుంది శ్రీయ.. తన బిడ్డని చంపాలనుకుంది అవని అని ఫిక్స్ అవుతుంది. పుట్టగానే ప్రాణాలతో పోరాడుతున్న ఆ బిడ్డకు అవని అవయవ దానం చేసి ప్రాణం పోసింది అన్న విషయం శ్రీయకి తెలిసిపోతుంది. దాంతో ఆమె అవని పై ఉన్న ద్వేషాన్ని పక్కన పడేసి తన కన్నీళ్ళతో అవని కాళ్లు కడుగుతుంది. అవని, శ్రియలు కలిసిపోవడం చూసి పల్లవి రగిలిపోతూ ఉంటుంది. ఇప్పుడు తనకి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవ్వరూ లేరు ఒక్క దెబ్బతో అవని దేవతగా మారింది అని తనలో తానే కోపంగా ఒంటరిగా ఉంటుంది.. తన కూతురు ఒంటరిగా బాధపడుతుంది అని మీనాక్షి ఆమెకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుంది.. మరి ఇంక ముందు ఎపిసోడ్లలో తల్లి కూతుర్లు కలిసిపోతారేమో చూడాలి..

Advertisement

Also Read : శనివారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×