E-Paper
Advertisement

టీవీ ప్రియులకు శుభవార్త.. అఖండ 2 ఆరోజే ప్రసారం.. ఏ ఛానల్ లో చూడొచ్చంటే?

టీవీ ప్రియులకు శుభవార్త.. అఖండ 2 ఆరోజే ప్రసారం.. ఏ ఛానల్ లో చూడొచ్చంటే?
Advertisement

Akhanda 2:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు బాలకృష్ణ.. ఆరు పదుల వయసు దాటినా వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిపోయారు. ముఖ్యంగా యాక్షన్ మాస్ ఓరియెంటెడ్ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న బాలయ్య.. అఖండ సినిమా చేసి ఊహించని విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇక ఈ సినిమాకి కొనసాగింపుగా అఖండ 2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అయ్యింది.

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా అఖండ 2..

ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..ఈ నెల 26వ తేదీ సాయంత్రం 5:30 గంటలకు జీ తెలుగులో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారం కానుంది. మొత్తానికి అయితే ఆదివారం రోజు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించడానికి సిద్ధమయ్యింది. ఇప్పటికే ఓటీటీలో, థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా ఇటు సాటిలైట్ స్ట్రీమింగ్ లో ఎటువంటి వ్యూస్ సొంతం చేసుకుంటుందో చూడాలి.

అఖండ 2 సినిమా స్టోరీ..

Advertisement

అఖండ 2 సినిమా విషయానికి వస్తే.. బాల మురళీకృష్ణ (బాలకృష్ణ) కుమార్తె జనని (హర్షాలి మల్హోత్రా) ఒక సైంటిస్ట్.. శత్రు దేశాలకు సంబంధించిన వ్యక్తులు ఇండియాపై దాడులు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు . ఆ సమయంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల క్రమంలో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా చోటు చేసుకున్న ఒక అనుకోని ఘటన కలకలం రేపుతుంది. పైగా ఆ ఘటన ప్రజలలో దేవుడిపై నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తుంది. దీంతో దుండగులపై అఖండ ఏ విధంగా విరుచుకుపడ్డారు? ప్రజల ప్రాణాలను ఎలా కాపాడాడు? దేశాన్ని ఏ విధంగా రక్షించాడు? అఖండ తల్లి కోరిక తీరిందా ?అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలి అంటే జీ తెలుగు వేదికగా ప్రసారమయ్యే అఖండ 2 సినిమా చూడాల్సిందే. ఇకపోతే బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

ALSO READ:కోట్ల ఆస్తులపై క్లారిటీ ఇచ్చిన టాలీవుడ్ నటి.. ఏమన్నారంటే?

బాలకృష్ణ తదుపరి సినిమాలు..

Advertisement

బాలకృష్ణ విషయానికి వస్తే.. ప్రస్తుతం బాలకృష్ణ వరుస పెట్టి సినిమాలు చేస్తూ అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రముఖ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చారిత్రక యాక్షన్ సినిమా రూపొందిస్తున్నారు.. ఎన్బికె 111 అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మొదట ఇందులో నయనతారను హీరోయిన్ గా ఎంపిక చేసుకోగా.. ఆమె కాల్ షీట్స్ కారణంగా సినిమా నుండి తప్పుకుందని.. రంగంలోకి కాజల్ అగర్వాల్ ని తీసుకున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రానుంది. అలాగే వివేక్ ఆత్రేయతో కలిసి ఒక సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×