E-Paper
Advertisement

Karthika Deepam : డాక్టర్ బాబు ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్ .. సీరియల్స్ కు గుడ్ బై..

Karthika Deepam : డాక్టర్ బాబు ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్ .. సీరియల్స్ కు గుడ్ బై..
Advertisement

Karthika Deepam : స్టార్ మా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ వస్తున్న సీరియల్స్ లో కార్తీకదీపం సీరియల్ ఒకటి. గతంలో వచ్చిన ఈ సీరియల్ ప్రేక్షకులను ఎంతగా అలరించిందో చెప్పనక్కర్లేదు. అప్పటివరకు టాప్ రేటింగ్ తో దూసుకుపోయిన ప్రతి సీరియల్ కూడా ఈ సీరియల్ ముందు నిలవలేకపోయాయి. డిఫరెంట్ స్టోరీ తోచిన ఈ సీరియల్ జనాలని ఒక ఉత్కంఠ గా ముందుకు తీసుకెళ్లింది. ఆ సీరియల్ కి సీక్వల్ గా వచ్చిన మరో సీరియల్ కార్తీకదీపం 2. దీప వంటలక్క ఒకే చోట ఉన్నా సరే వాళ్ళిద్దరిని విడగొట్టడానికి అమ్మాయి ప్రయత్నిస్తుంది. మరి ఆ అమ్మాయికి డాక్టర్ బాబు ఎలా బుద్ధి చెప్పాడు అన్నది తెలియాలంటే ఈ సీరియల్ మిస్ అవ్వకుండా చూడాలి.. తాజాగా కార్తీకదీపం 2 సీరియల్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చేసింది. ఈ సీరియల్ కి డాక్టర్ బాబు గుడ్ బై చెప్పబోతున్నాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. అతని ఎందుకు సడన్ గా ఈ నిర్ణయం తీసుకున్నాడు అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది. మరి డాక్టర్ బాబు నిజంగానే ఈ సీరియల్ కి గుడ్ బై చెప్తున్నాడా? లేదంటే ఇంకేదైనా కారణాలు ఉన్నాయా అన్నది కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..

కార్తీక దీపం నుంచి డాక్టర్ బాబు అవుట్..

తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో నచ్చిన సీరియల్స్లలో స్టార్ మా లో ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ఒకటి. ఇందులో హీరో పాత్రలో నటించిన డాక్టర్ బాబు ఇప్పుడు సీరియల్కి దూరమబోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త సంచలనంగా మారింది. నిజానికి డాక్టర్ బాబు అలియాస్ నిరూపం ప్రస్తుతం సీరియల్స్ ని నిర్మించే పనులు బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో సీరియల్స్ లో నటించే అవకాశం లేకపోవడంతో ఆయన ఈ సీరియల్ నుంచి తప్పుకోబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఇదైతే ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. డాక్టర్ బాబు క్లారిటీ ఇచ్చేంతవరకు దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఏది ఏమైనా కూడా డాక్టర్ బాబు ఈ సీరియల్ నుంచి తప్పకుండా చాలామంది ఫాన్స్ కి షాక్ అనే చెప్పాలి. మరి సీరియల్ లోకి మరో కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి..

నిర్మాతగా బిజీగా నిరూపమ్..

Advertisement

ఒకప్పుడు సీరియల్స్లలో హీరోలుగా నటించిన చాలామంది ఇప్పుడు వాటిని నిర్మించే ఎత్తుకు ఎదిగారు. సీరియల్స్లలో వచ్చిన డబ్బులను చాలామంది వ్యాపారాలలో పెట్టుబడులుగా పెడుతుంటారు. కానీ మన డాక్టర్ బాబు మాత్రం సొంతంగా నిర్మాణ సంస్థని స్టార్ట్ చేసి పలు సీరియల్స్ లను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈయన బ్యానర్ పై వచ్చిన సీరియల్స్ జనాలని బాగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం పొదరిల్లు సీరియల్ ను ఈయన తన సొంత బ్యానర్ లో నిర్మిస్తున్నారు. సీరియల్ ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే మంచి టాక్ ని సొంతం చేసుకోవడంతో నిర్మాతగా మరోసారి డాక్టర్ బాబు సక్సెస్ అయ్యాడు. ఇకముందు ఎలాంటి స్టోరీలతో ప్రేక్షకులను పలకరిస్తాడో చూడాలి…

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×