E-Paper
Advertisement

ఆసియాతో పెళ్లి అప్పుడే.. నూకరాజు క్లారిటీ!

ఆసియాతో పెళ్లి అప్పుడే.. నూకరాజు క్లారిటీ!
Advertisement

Kissik Talks on Nookaraju: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత సినిమాల నుండి స్మాల్ స్క్రీన్ వరకు ఎంతోమంది సెలబ్రిటీ హోదాను సొంతం చేసుకుంటున్నారు. ముఖ్యంగా యూట్యూబ్, డబ్ స్మాష్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్స్ ద్వారా తమకంటూ ఒక ఉనికిని చాటుకున్న ఎంతోమంది.. ఇప్పుడు టీవీ ఛానల్స్ లో ప్రసారమయ్యే కామెడీ షోలలో సందడి చేస్తూ మెప్పిస్తున్నారు. అంతేకాదు తమకంటూ ఒక కెరియర్ కి పునాదులు వేసుకుంటున్నారు. అలా ఒక హోదా వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో వాళ్ళని లేదా తమకు నచ్చిన వారిని ఇష్టపడి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇక అలాంటి జంటలలో నూకరాజు (Nookaraju), ఆసియా ఏంజెల్(Asiya Angel) కూడా ఒకరు. సోషల్ మీడియా ద్వారా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈ జంట. శ్రీదేవి డ్రామా కంపెనీ , జబర్దస్త్ వంటి షోలలో సందడి చేసి మెప్పించారు. అలా ఆన్ స్క్రీన్ పై సందడి చేసిన ఈ జంట ఇప్పుడు ఆఫ్ స్క్రీన్ లో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.

మా పెళ్లి అప్పుడే – నూకరాజు

గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఉమ్మడిగా సందడి చేస్తూ పలు ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న వీరు.. ఇప్పుడు పెళ్లికి సిద్ధమవుతున్నారు.ఈ విషయాన్ని ప్రముఖ కమెడియన్ నూకరాజు బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్ గా నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్ (Kissik Talks) కార్యక్రమానికి గెస్ట్ గా వచ్చి, తన పెళ్లి విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఇంటర్వ్యూలో హోస్ట్ వ్యవహరిస్తున్న వర్ష మాట్లాడుతూ..”ఆసియాతో మీ పెళ్ళెప్పుడు?” అని ప్రశ్నించింది. నూకరాజు మాట్లాడుతూ..”పెళ్లి దగ్గర్లోనే ఉంది. నిజానికి ఈ రెండు మూడు నెలల్లోనే మా పెళ్లి జరగాల్సి ఉంది. కానీ దేవుడేమో చిన్నగా పరీక్షలు పెడుతున్నాడు. ఆసియా వాళ్ళ ఇల్లు ఒకటి కంప్లీట్ కాలేదు. ఇక ఆ ఇల్లు కట్టడం పూర్తయితే ఇక పెళ్లి” అంటూ క్లారిటీ ఇచ్చారు.

పెళ్లికి సిద్ధం ఆ తర్వాత యుద్ధం..

Advertisement

పెళ్లికి సిద్ధమా? అని వర్ష అడగగా.. “పెళ్లికి సిద్ధం.. ఆ తర్వాత యుద్ధం అంటూ నూకరాజు బదులిచ్చారు. “పెళ్లంటే ఎక్కడో భయపడుతున్నట్టు అనిపిస్తోంది ఏంటి? “అని వర్ష ప్రశ్నించగా.. నూకరాజు మాట్లాడుతూ.. “పెళ్లంటే భయం లేదు.. పెళ్లి తర్వాత వచ్చే వాటి గురించి భయం వేస్తుంది. పెళ్లి తర్వాత ఒక రెస్పాన్సిబిలిటీ వస్తుంది. పిల్లలు. ఇక వాటి గురించి ఆలోచించాల్సి వస్తుంది” అంటూ కామెంట్లు చేశారు.

also read:బిగ్ బాస్ లోకి నూకరాజు – ఆసియా జంట?

పుష్కరాలకు ముందే మా పెళ్లి – నూకరాజు

Advertisement

” ఎంత కష్టం ఉన్నా పుష్కరాలకు ముందే మేము పెళ్లి చేసేసుకోవాలి. ఒకవేళ పుష్కరాల తర్వాత అంటే 6 నెలలు ముహూర్తం ఉండదు. ఒక్కొక్కసారి మూడు సంవత్సరాల పాటు ముహూర్తం ఉండదట. అప్పటికి మనం ముదిరిపోయిన బెండకాయలమైపోతాం.. ఇక మూడేళ్ల తర్వాత ఒక కొడుకును కనేస్తే.. కొడుకు కానీ కూతుర్ని కానీ” అంటూ ఫ్యూచర్ ప్లానింగ్ పై కూడా క్లారిటీ ఇచ్చారు నూకరాజు.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×