E-Paper
Advertisement

చీటింగ్ కేసు వ్యవహారం… నిశ్చితార్థం చేసుకుని షాక్ ఇచ్చిన అషు రెడ్డి..ఫోటోలు వైరల్!

చీటింగ్ కేసు వ్యవహారం… నిశ్చితార్థం చేసుకుని షాక్ ఇచ్చిన అషు రెడ్డి..ఫోటోలు వైరల్!
Advertisement

Ashu Reddy Engagement:అషు రెడ్డి పరిచయం అవసరం లేని పేరు. నటిగా, బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న ఈమె ఇటీవల ఒక చీటింగ్ కేసులో వార్తలలో నిలిచారు. అషు రెడ్డి(Ashu Reddy) ఇటీవల ఎన్ఆర్ఐ ధర్మేంద్ర అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసిన సంగతి తెలిసిందే. దాదాపు రెండు సంవత్సరాల క్రితం ధర్మేంద్ర అనే వ్యక్తికి పరిచయమైన అషు రెడ్డి తనని పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో సుమారు 9.35 కోట్ల రూపాయలు డబ్బు తనకోసం ఖర్చు చేసినట్లు తెలిపారు. ఆమె పెళ్లికి ఒప్పుకోవడంతో తనకోసం బంగారంతో పాటు ఖరీదైన అపార్ట్మెంట్ కూడా కొని ఇచ్చానని ధర్మేంద్ర ఇటీవల ఈమె చేసిన మోసం గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అషు రెడ్డి నిశ్చితార్థం …

ఇలా ఈ కేసు విషయంలో అషు రెడ్డి నిత్యం వార్తలలో నిలుస్తున్నారు. ఈ చీటింగ్ కేసులో భాగంగా ఈమెపై పోలీస్ కేసు నమోదు అయినప్పటికీ అషు రెడ్డి మాత్రం ఈ విషయంపై పెద్దగా స్పందించలేదని చెప్పాలి. అయితే సోషల్ మీడియాలో తన గురించి వస్తున్న అసత్యపు వార్తలు ఖండిస్తూ ఈమె కోర్టును ఆశ్రయించడంతో కోర్టు కూడా ఈమెకు వ్యతిరేకంగా తీర్పును ఇచ్చింది. ఇలా ఈ వ్యవహారం నడుస్తున్న నేపథ్యంలో ఊహించని విధంగా అషు రెడ్డి నిశ్చితార్థం(Ashu Reddy Engagement) చేసుకుని అందుకు సంబంధించిన ఫోటోలను ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు.

పెళ్లి పీటలు ఎక్కబోతున్న అషు రెడ్డి..

Advertisement

ఈ ఫోటోలను ఈమె ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేయడంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోతున్నారు. అదేంటీ అషు రెడ్డి నిశ్చితార్థం చేసుకున్నారా? ఎలాంటి హడావిడి లేకుండా ఈమె సైలెంట్ గా నిశ్చితార్థం చేసుకోవడానికి గల కారణం ఏంటి అంటూ ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ ఎంగేజ్మెంట్ ఫోటోలను షేర్ చేసిన అశు రెడ్డి పెళ్లి కొడుకు ఎవరు అనే విషయాన్ని మాత్రం రివీల్ చేయలేదు. ఉంగరాలు మార్చుకున్నటువంటి ఫోటోలను మాత్రమే ఈమె ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు.

Advertisement

ఈ విధంగా పెళ్లికొడుకు ఫేస్ రివిల్ చేయకపోవడంతో ఈమె పెళ్లి చేసుకోబోయే అబ్బాయి ఎవరు? నిజంగానే ఈమె నిశ్చితార్థం జరుపుకున్నారా? లేదంటే ఏదైనా షూటింగ్లో భాగంగా ఇలాంటి ఫోటోషూట్ చేశారా అంటూ ఎన్నో సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఫోటోలను షేర్ చేసిన అషు రెడ్డి ఈ ఫోటోకి ఎలాంటి క్యాప్షన్ ఇవ్వకపోవడం గమనార్హం. మరి ఈమె ఈ ఎంగేజ్మెంట్ కు సంబంధించిన ఫోటోలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. అషు రెడ్డి నిశ్చితార్థం నిజమైతే ఆ అబ్బాయి ఎవరు ఏంటి అనే వివరాలు తెలియాల్సి ఉంది.ఈమె ఎంగేజ్మెంట్ ఫోటోలపై ధర్మేంద్ర స్పందన ఎలా ఉంటుందనేది తెలియాల్సి ఉంది.ఈమె ఇవ్వాల్సిన డబ్బులలో కోటిన్నర మే నెలలో ఇస్తానని మిగిలింది తాను జీవితంలో సెటిల్ అయిన తర్వాత ఇస్తానని చెప్పినటువంటి ఒక ఆడియో కూడా లీక్ అయిన సంగతి తెలిసిందే.

Also Read: మైక్రో ఫైనాన్స్ వ్యవహారం.. సింగర్ మంగ్లీకి కోర్టులో స్వల్ప ఊరట!

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×