E-Paper
Advertisement

అషురెడ్డి వివాదం.. విస్తుపోయే నిజాలు బయటపెట్టిన తండ్రి!

అషురెడ్డి వివాదం.. విస్తుపోయే నిజాలు బయటపెట్టిన తండ్రి!
Advertisement

Ashu Reddy:బిగ్ బాస్ ఫేమ్ అషురెడ్డి (Ashu Reddy)గురించి ఒక వార్త సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. లండన్ కి చెందిన ఐటీ ఉద్యోగి ధర్మేంద్ర అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి సుమారుగా రూ.9.35 కోట్ల వరకు తీసుకొని ఆ డబ్బుతో ఇల్లు,బంగ్లాలు, కార్లు, ఇతర ఫ్లాట్లు కొనుగోలు చేసిందని.. పైగా వాటిని తన పేరు మీద రిజిస్టర్ చేయించుకుందని.. పెళ్లి చేసుకోమని అడిగితే ముఖం చాటేస్తోందని బాధితుడి తండ్రి సత్యనారాయణ హైదరాబాద్ సీసీఎస్ లో ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది.

ఈ విషయంపై అటు అషు రెడ్డి కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించింది. తన అనుమతి లేకుండా అసత్యాలను ప్రచారం చేస్తే లీగల్ చర్యలు తీసుకుంటానని హెచ్చరించింది . ఇప్పుడు ఈమె తండ్రి వెంకటకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఊహించని విస్తుపోయే నిజాలను బయటపెట్టి అందరిని ఆశ్చర్యపరిచారు.

విస్తుపోయే నిజాలు బయటపెట్టిన అషురెడ్డి తండ్రి..

Advertisement

అషురెడ్డి తండ్రి వెంకటకృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. “2021లో నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. కాకినాడ నుంచి సత్యనారాయణ అని తనను తాను అతను పరిచయం చేసుకున్నాడు. మీ అమ్మాయి పెళ్లి సంబంధం కోసం ఫోన్ చేశాను అన్నారు. మా అమ్మాయి మీకు ఎలా తెలుసు అని అడిగితే.. మా అమ్మాయి వాళ్ళ అబ్బాయి కలిసి ఉద్యోగం చేశారని , అలా పరిచయమని నాతో చెప్పారు. ఒకసారి కాకినాడకు వచ్చి వెళ్ళండి అని అన్నారు. అయితే నేను కాకినాడ వెళ్ళలేదు. కానీ తెలిసిన వాళ్లతో ధర్మేంద్ర కుటుంబం గురించి తెలుసుకోమన్నాను. అప్పటికే అతడికి పెళ్లయి విడాకుల కేసు నడుస్తోందని.. సత్యనారాయణ నడుపుతున్న ఫైనాన్స్ కంపెనీ పై కాల్ మనీ కేస్ ఉన్నట్లు తెలిసింది. దీంతో సంబంధం వద్దని నేరుగా చెప్పలేక తర్వాత చెబుతామని నాన్చుతూ వచ్చాము. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే ఆయన గురించి నేను వినడం, నేను వైజాగ్ లో ఉంటాను.

మా అమ్మాయి అమాయకురాలు.. అన్నీ ఆరోపణలే..

మా అమ్మాయి తన తల్లితో కలిసి హైదరాబాద్లో ఉంటుంది.. మొదటినుంచి మా అమ్మాయి ఇండస్ట్రీకి వెళ్లడం నాకు ఇష్టం లేదు. నా కూతురికి ఏం తెలియదు. తల్లి ప్రోత్సాహంతోనే సినిమాల్లోకి వెళ్ళింది. అటు ధర్మేంద్రతో ఆర్థిక వ్యవహారాల గురించి నాకు తెలియదు. కానీ మాపై చేసినవన్నీ ఆరోపణలు మాత్రమే.. సాక్షాలు ఉంటే నిరూపించాలి. ప్రస్తుతం మా అమ్మాయి వేరేచోట ఉంది. సోమవారం ప్రెస్ మీట్ పెట్టి అసలేం జరిగిందో చెబుతుంది. ఈ విషయాన్ని నాతో ఫోన్ మాట్లాడినప్పుడు మా అమ్మాయి చెప్పింది. నేను కూడా హైదరాబాదు వస్తున్నాను” అంటూ ఆయన చెప్పుకొచ్చారు.. ఇక ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Advertisement

ALSO READ:నా కొడుకుకి త్వరలో క్రైమ్ పార్ట్నర్ రాబోతున్నారు.. క్యూట్ వీడియో షేర్ చేసిన అమలాపాల్!

వేణుస్వామితో జాతకాలు చూపించారు – ధర్మేంద్ర తండ్రి

ఇకపోతే ఈ సమయంలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి పేరు కూడా తెరపై వినిపిస్తూ ఉండడం గమనార్హం. పెళ్లి విషయంలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి తో ఇరు కుటుంబాలు కలిసి జాతకాలు కూడా చూపించుకున్నాయని, అన్నీ కుదిరాయని నమ్మించి ధర్మేంద్ర ను బుట్టలో వేసుకున్నారని బాధితుడి తండ్రి ఆరోపించారు. ఇక మరి ఈ కేసు పై వేణుస్వామి స్పందిస్తే అసలు నిజం తెలుస్తుందని అషురెడ్డి అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×