E-Paper
Advertisement

అషురెడ్డికి హైకోర్టులో చుక్కెదురు.. బయటపడ్డ సాక్ష్యాలు!

అషురెడ్డికి హైకోర్టులో చుక్కెదురు.. బయటపడ్డ సాక్ష్యాలు!
Advertisement

Ashu Reddy:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో దిగ్గజ దర్శకులుగా గుర్తింపు తెచ్చుకున్న రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది అషు రెడ్డి. జూనియర్ సమంతగా తన పెర్ఫార్మెన్స్ తో అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈమె.. అటు బిగ్ బాస్ వంటి రియాల్టీ షోలలో కూడా సందడి చేసిన విషయం తెలిసిందే. పైగా వీడియో ఆల్బమ్ సాంగ్ లతో మెప్పించిన ఈమె ఈమధ్యకాలంలో సుధీర్ తో కలసి ఒక షోలో సందడి చేస్తోంది. అంతేకాదు ఇటీవల ఇంస్టాగ్రామ్ లో పెయిడ్ సబ్ స్క్రిప్షన్ పెట్టి అందరిని ఆశ్చర్యపరిచింది.

చీటింగ్ కేసు.. తల్లి కూతుర్లకు హైకోర్టు భారీ షాక్..

అంతలోపే ఒక ఎన్నారై తన దగ్గర పెళ్లి పేరుతో రూ. 9.5 కోట్లు తీసుకుందని.. అడిగితే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది అంటూ సదరు బాధితుడి తండ్రి హైదరాబాద్ సిసిఎస్ లో క్రిమినల్ కేసు ఫైల్ చేయించారు. ఈ ఒక్క ఘటనతో ఈమె మళ్లీ వార్తల్లో నిలిచింది . అయితే ఈ కేస్ కి వ్యతిరేకంగా.. తన ప్రతిష్టకు భంగం కలిగించేలా మాట్లాడారని, పైగా పోలీసులు ఏకపక్షపాతంగా ప్రవర్తించారని , ఇరు వర్గాల వాదనలు వినకుండానే తనపై కేసు ఫైల్ చేశారని, ఆ కేసును కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. పైగా ఈ విషయం కోర్టులో విచారణ జరుగుతుండగా.. తాజాగా కోర్టు అషు రెడ్డి తో పాటు ఆమె తల్లికి షాక్ ఇచ్చింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

కోర్టులో విచారణ.. బయటపడ్డ ఆధారాలు..

Advertisement

పెళ్లి పేరుతో ఎన్నారై వ్యాపారవేత్తను మోసం చేసినట్లు నమోదైన క్రిమినల్ కేసులో ఇప్పుడు తల్లీకూతుర్లకు హైకోర్టులో చుక్కెదురైంది. రూ.10.5 కోట్ల నగదు బదిలీ ఆన్లైన్ ద్వారా జరిగింది అని, అందుకే దర్యాప్తు కొనసాగాల్సి ఉందని ప్రాసిక్యూషన్ తెలపడంతో దర్యాప్తును నిలిపివేయడానికి న్యాయస్థానం నిరాకరించింది. కఠిన చర్యల నుంచి మినహాయింపు ఇవ్వాలనే అభ్యర్థనను కూడా తోసిపుచ్చుతూ.. తదుపరి విచారణను జూన్ 9వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు. మొత్తానికైతే ఆధారాలు ఉన్నాయని తేలడంతోనే ఇప్పుడు ఈ విచారణను ఆపివేయడానికి కోర్టు అనుమతించలేదు. మరి ఈ విషయంలో అషు రెడ్డితో పాటు ఆమె తల్లి యశోద రెడ్డి ఏ విధంగా సమాధానం చెబుతారో చూడాలి. ఇక ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

also read:రూ.25లక్షలు ఇస్తా.. ఫామ్ హౌస్ కి రా.. లైంగిక వేధింపులపై బిగ్ బాస్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్!

ప్రేమ పేరుతో కోట్లు మోసం.. అడిగితే బెదిరింపులు..

Advertisement

అసలేం జరిగింది అనే విషయానికొస్తే.. లండన్ లో ధర్మేంద్ర అనే ఎన్ఆర్ఐ ఐటి ఉద్యోగం చేస్తూ కెరీయర్ని కొనసాగిస్తున్నారు. అయితే 2018లో హాలిడేస్ నిమిత్తం తన తల్లిదండ్రులను కలవడానికి హైదరాబాద్ వచ్చారు. ఆ సమయంలో అషు రెడ్డి తనకు తానుగా ధర్మేంద్ర తో పరిచయం పెట్టుకుంది. తాను కూడా అమెరికాలో చదువుకున్నానని, ఉద్యోగం చేశానని , కాకపోతే సినిమాల మీద ఆసక్తితో ఇండియాకి వచ్చానని తెలిపింది. అలా మొదలైన పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారి పెళ్లి చేసుకుంటానని ఈమె నమ్మబలికిందట. అంతేకాదు ధర్మేంద్ర నుండి రూ.9.5 కోట్ల మేర డబ్బు వసూలు చేసింది. ఆ డబ్బుతో ఐదు కిలోల బంగారం , ఖరీదైన ఫ్లాట్లు, బంగ్లాలు, కారు కొనుగోలు చేసి, వాటిని తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించింది. అంతేకాదు పెళ్లి అంటూ అషు రెడ్డి తల్లిదండ్రులు కూడా పండితులను తీసుకొచ్చి హడావిడి చేశారట. ఇక పెళ్లికి ముహూర్తం పెట్టాలని అడిగితే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిందట అషురెడ్డి. ఈ విషయాలన్నింటినీ ధర్మేంద్ర తండ్రి యెనుముల సత్యనారాయణ ఈమెపై హైదరాబాద్ సిసిఎస్ లో కేస్ ఫైల్ చేసినప్పుడు ఎఫ్ఐఆర్లో తెలిపారు. ఇక ఈ విషయం కాస్త వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత దీనిపై అషురెడ్డి స్పందిస్తూ తనపై ఎవరైనా తప్పుడు కథనాలు ప్రచురిస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటానని హెచ్చరించింది. ఆ తర్వాత అషురెడ్డి, ధర్మేంద్రలకు సంబంధించిన ఆడియో కాల్ అంటూ ఒక ఆడియో కూడా సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు వీరికి హైకోర్టులో చుక్కెదురయింది. ఇక తదుపరి విచారణలో ఎలాంటి నిజాలు బయటపడతాయో చూడాలి.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×