E-Paper
Advertisement

Arjun Kalyan: బిబి జోడి 2 పై అర్జున్ కళ్యాణ్  కామెంట్స్..అంత వాళ్ళు చెప్పినట్టే నడుస్తుందా?

Arjun Kalyan: బిబి జోడి 2 పై అర్జున్ కళ్యాణ్  కామెంట్స్..అంత వాళ్ళు చెప్పినట్టే నడుస్తుందా?
Advertisement

Arjun Kalyan: అర్జున్ కళ్యాణ్ పరిచయం అవసరం లేని పేరు ఈయన నటుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అర్జున్ కళ్యాణ్ ఇప్పటికే పలు వెబ్ సిరీస్ లలో నటించారు. అలాగే బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేశారు. స్టార్ మా లో ఈయన నువ్వుంటే నా జతగా అనే సీరియల్ లో కూడా నటించి ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ఇటీవల అర్జున్ కళ్యాణ్ బిబి జోడి సీజన్ 2(BBJodi 2) కార్యక్రమంలో సత్యతో కలిసి పార్టిసిపేట్ చేసిన సంగతి తెలిసిందే.

బిబి జోడి2 ఫేవరెటిజం..

ఈయన బిగ్ బాస్ కంటెస్టెంట్ కావడంతో బిబి జోడి సీజన్ వన్ లో కూడా పర్ఫామెన్స్ చేస్తూ ఫైనల్ దాకా వెళ్లారు. అప్పుడు వాసంతితో జోడిగా సందడి చేసిన అర్జున్ కళ్యాణ్ సీజన్ 2 లో మాత్రం సత్యతో జతకట్టారు. ఇక ఈ కార్యక్రమం చివరి దశకు చేరుకుంది అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అర్జున్ కళ్యాణ్ బిబి జోడి 2 గురించి మాట్లాడుతూ పలు విషయాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫేవరెటిజం(favoritism) ఉందని విన్నాను నిజమేనా అంటూ ప్రశ్న ఎదురైంది ఈ ప్రశ్నకు అర్జున్ కళ్యాణ్ సమాధానం చెబుతూ.. నాకు కూడా అలా కొన్ని సందర్భాలలో అనిపించింది అంటూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

జడ్జెస్ చెప్పిన విధంగానే చేయాలి..

Advertisement

ఈ కార్యక్రమంలో భాగంగా మనం జడ్జెస్ చెప్పిన దాని ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుందని ఈయన చెప్పకనే చెప్పేశారు. జడ్జెస్ ఇచ్చిన జడ్జిమెంట్ ఆధారంగానే మనం కూడా ఇవ్వాల్సి ఉంటుంది అలా కాకుండా మనం కంటెస్టెంట్ ల పెర్ఫార్మెన్స్ ఆధారంగా మార్క్స్ ఇస్తే జడ్జెస్ దగ్గర మనకు మార్కులు పోతాయని ఈయన తెలిపారు. అందుకే పర్ఫామెన్స్ ఎలా ఉన్నా మంచిగనే చేస్తున్నారంటూ సమాధానాలు చెప్పాల్సి వస్తుందని అర్జున్ తెలిపారు. ముఖ్యంగా జడ్జెస్ కు ఇష్టమైన కంటెస్టెంట్ ల గురించి అసలు మాట్లాడకూడదని చెప్పకనే చెప్పేశారు. ఇక ఈ విషయం గురించి సత్యా (Sri Satya)ఎన్నోసార్లు గొడవకు కూడా సిద్ధపడిందని, మనం గొడవ పెట్టుకోవడం వల్ల మనకే ఇబ్బంది అంటూ తనని నేను ఎప్పటికప్పుడు ఆపుతూ వచ్చానని అర్జున్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్న వారు మాత్రమే పెర్ఫార్మన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే.

సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు..

Advertisement

ఇక ఈ కార్యక్రమానికి శేఖర్ మాస్టర్ తో పాటు హీరోయిన్స్ శ్రీదేవి, సదా జడ్జెస్ గా వ్యవహరిస్తున్నారు. ప్రదీప్ మాచిరాజు యాంకర్ గా కొనసాగుతున్నారు. స్టార్ మాలో ఈ కార్యక్రమం ప్రతి శని ఆదివారాలలో ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. ఇక అర్జున్ కెరియర్ విషయానికి వస్తే ఈయన పలు సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఇప్పటివరకు అనుకున్న విధంగా సినిమాలలో అవకాశాలు రాలేదని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే బుల్లితెరపై వచ్చిన అవకాశాలన్నింటినీ సద్వినియోగం చేసుకుంటూ సినిమాలు వెబ్ సిరీస్ లలో అవకాశాల కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×