E-Paper
Advertisement

Kissik Talks: కర్మ అనుభవించాల్సిందే.. చేసిన తప్పు ఊరికేపోదు – అర్జున్ కళ్యాణ్

Kissik Talks: కర్మ అనుభవించాల్సిందే.. చేసిన తప్పు ఊరికేపోదు – అర్జున్ కళ్యాణ్
Advertisement

Kissik Talks: అర్జున్ కళ్యాణ్.. అమ్మాయిల కలల రాకుమారుడుగా.. బుల్లితెర ఫేవరెట్ సెలబ్రిటీగా, లవర్ బాయ్గా తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నారు. రాజమండ్రి కొవ్వూరుకి చెందిన అర్జున్ కళ్యాణ్ తన అద్భుతమైన నటనతో ఊహించని ఇమేజ్ సొంతం చేసుకున్నారు. అయితే అనుకున్న స్థాయిలో స్టార్ స్టేటస్ మాత్రం లభించలేదు అని చెప్పాలి. ఇకపోతే సినిమాలు, వెబ్ సిరీస్లలో చేసిన అర్జున్ కళ్యాణ్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 లో కంటెస్టెంట్ గా పాల్గొని తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక ప్రస్తుతం నువ్వుంటే నా జతగా అనే సీరియల్ లో హీరో పాత్ర పోషిస్తున్నారు అర్జున్ కళ్యాణ్.

కర్మ అనుభవించాల్సిందే – అర్జున్ కళ్యాణ్

అలా బిజీ షెడ్యూల్లో కూడా తాజాగా బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్ గా నిర్వహించిన కిస్సిక్ టాక్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. పూర్తి ఎపిసోడ్ కు సంబంధించిన తాజా ప్రోమోని నిర్వాహకులు విడుదల చేయగా.. అందులో ఎన్నో తెలియని విషయాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. అందులో ఒకటి కర్మ. కచ్చితంగా కర్మ అనేది ఉంటుంది అని , తప్పకుండా అనుభవించి తీరుతామని, అందుకు ఉదాహరణ తానే అంటూ తాను తన జీవితంలో చేసిన తప్పులను, తాను ఎదుర్కొన్న ఇబ్బందులను అర్జున్ కళ్యాణ్ తెలిపారు.

నేను చేసిన తప్పుల వల్లే కర్మ అనుభవించాను – అర్జున్ కళ్యాణ్

Advertisement

కర్మ అనే విషయం పైన మాట్లాడుతూ.. “నేను చేసిన మిస్టేక్ వల్ల నేను కూడా చాలాసార్లు అనుభవించాను. అప్పుడే అనిపించింది. ఓహ్ .. ఆరోజు నేను ఆ తప్పు చేశాను కదా.. ఈ రోజు అనుభవిస్తున్నాను అని అనుకుంటాను. అంటూ తాను తన జీవితంలో చేసిన తప్పులకు తాను అనుభవించిన కర్మ గురించి అందరితో చెప్పి ఆశ్చర్యపరిచారు అర్జున్ కళ్యాణ్.

వైఫ్ అండ్ హస్బెండ్ బాండింగ్ అలాగే ఉండాలి – అర్జున్ కళ్యాణ్

అలాగే తన దృష్టిలో వైఫ్ అండ్ హస్బెండ్ అనే బాండింగ్ గురించి మాట్లాడుతూ.. “ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇష్టపడితే.. కచ్చితంగా వాళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడుకోవాలి, సినిమాలకు వెళ్లాలి, ట్రిప్పులకు వెళ్లాలి, అలా ఎంజాయ్ చేయాలని తెలిపారు.

మనిషికే వ్యాల్యూ ఇస్తాను – అర్జున్ కళ్యాణ్

Advertisement

అలాగే డబ్బుకు విలువ ఇస్తారా? మనిషికి విలువ ఇస్తారా? అని ప్రశ్నించగా డబ్బుకు కాదు మనిషికే విలువనిస్తాను. డబ్బు ఈ రోజు ఉంటుంది పోతుంది. మనం మన జీవితంలో వెనుక తిరిగి చూసుకుంటే ఆ జ్ఞాపకాలు మళ్లీ మనల్ని సంతోషపరచాలి. అందుకే నేను డబ్బు కంటే కూడా మనిషికే ఎక్కువ విలువనిస్తాను అంటూ అర్జున్ కళ్యాణ్ తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. మొత్తానికి అయితే అర్జున్ కళ్యాణ్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ALSO READ:Kissik Talks: ఆమే జీవితం అనుకున్నా.. చివరికి మిగిలింది కన్నీళ్లే.. లవ్ బ్రేకప్ పై అర్జున్ కళ్యాణ్ కామెంట్!

అర్జున్ కళ్యాణ్ కెరియర్..

అర్జున్ కళ్యాణ్ విషయానికొస్తే.. రాజమండ్రి కొవ్వూరు కు చెందిన ఈయన అమెరికాలో తన విద్యాభ్యాసం పూర్తి చేసి మోడల్గా కెరియర్ను ఆరంభించారు. చిన్న సినిమా అనే సినిమాతో కెరియర్ ఆరంభించిన అర్జున్ కళ్యాణ్ ఆ తర్వాత పలు సినిమాలు చేసి ఆకట్టుకున్నారు. ఇక స్టార్ గా ఎదగడానికి ప్రయత్నం చేస్తున్నానని తెలిపిన ఈయన.. తెలుగమ్మాయిని వివాహం చేసుకుంటానని స్పష్టం చేశారు.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×