E-Paper
Advertisement

Arjun Ambati: ఫస్ట్ టైం కూతురుని పరిచయం చేసిన అర్జున్ అంబటి…అచ్చం తన పోలికలే అంటూ!

Arjun Ambati: ఫస్ట్ టైం కూతురుని పరిచయం చేసిన అర్జున్ అంబటి…అచ్చం తన పోలికలే అంటూ!
Advertisement

Arjun Ambati: అర్జున్ అంబటి పరిచయం అవసరం లేని పేరు. బుల్లితెర నటుడిగా ఈయన ఎన్నో సీరియల్స్ లో నటిస్తూ ఎంతోమంది బుల్లితెర అభిమానులను సొంతం చేసుకున్నారు. బుల్లితెర నటుడిగా కొనసాగుతున్న అర్జున్ అంబటి మరోవైపు సినిమాలలో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. పలు సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తున్న ఈయన బుల్లితెర కార్యక్రమాల ద్వారా కూడా ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు. ఇక బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్ గా కూడా అర్జున్ అంబటి(Arjun Ambati) కొనసాగిన సంగతి తెలిసిందే.

అర్జున్ కుమార్తె అర్క..

ఇదిలా ఉండగా అర్జున్ సురేఖ(Surekha) అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కుమార్తె కూడా ఉంది. ఈ చిన్నారికి అర్క(Arkha) అని నామకరణం కూడా చేశారు ఇలా కూతురు పుట్టిందనే విషయాన్ని చెప్పినప్పటికీ ఇప్పటివరకు ఈయన తన కుమార్తెను అభిమానులకు చూపించలేదు తాజాగా అర్జున్ భార్య సురేఖ తన కూతురితో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు దీంతో ఈ ఫోటోలు కాస్త వైరల్ అవుతున్నాయి. అర్జున్ అంబటి సురేఖ దంపతుల ఏడవ వివాహ వార్షికోత్సవం కావడంతో ఈ సందర్భంగా ఈమె తన కుమార్తెను అభిమానులకు పరిచయం చేశారు. ఇలా తన భర్త కూతురుతో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.

7వ పెళ్లిరోజు సందర్భంగా..

Advertisement

ఇది తమకు ఏడవ వివాహ వార్షికోత్సవమని తెలియజేశారు ఏడు సంవత్సరాల క్రితం మేము ఒకరి చేయని ఒకరు పట్టుకొని జీవితాంతం ఇలాగే కలిసి ఉండాలని నిర్ణయం తీసుకున్నాము. కష్టసుఖాలలో ఒకరికి ఒకరు తోడుగా నిలిచి ముందుకు నడిచాము ఇక మా జీవితంలోకి మా కుమార్తె అర్క రావటం అత్యంత మధురమైన అధ్యాయం ఇద్దరిగా ఉన్న మేము ముగ్గురిగా మారిపోయామని, ఈ ప్రయాణం మాకెంతో ప్రత్యేకం అంటూ ఈమె తన కుమార్తె గురించి కూడా ఈ సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు.

Advertisement

నాకు భర్తగా నా కుమార్తెకు ప్రేమను పంచే తండ్రిగా ఉన్నందుకు థాంక్యూ.. మనం ఇలాగే జీవితాంతం కలిసి ఉండి మరెన్నో వివాహ వార్షికోత్సవాలు జరుపుకోవాలని కోరుకుంటున్నాను అంటూ ఈమె చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. ఇక ఈ పోస్ట్ చూసిన అభిమానులు కూడా ఈ దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా చిన్నారి అర్హ చాలా ముద్దుగా ఉందని అచ్చం తల్లి పోలికలే అంటూ కామెంట్ లు చేస్తున్నారు. ఇక అర్జున్ కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన బుల్లితెర కార్యక్రమాలలో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు అలాగే వెళ్లి తన సినిమాలలో కూడా నటిస్తున్నారు. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్లో రాబోతున్న పెద్ది సినిమాలో అర్జున్ నటించబోతున్న విషయం తెలిసిందే. ఈయన బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడే బుచ్చిబాబు తనకు పెద్ది సినిమాలో అవకాశం ఇస్తున్నానని తెలియజేశారు. ప్రస్తుతం ఈయన వృత్తిపరంగా అలాగే వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో బిజీగా సంతోషంగా గడుపుతున్నారు.

Also Read: Lavanya Tripathi: ప్రెగ్నెన్సీతోనే సతీ లీలావతి … భయపడుతూనే షూటింగ్ పూర్తి చేసానంటూ!

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×