E-Paper
Advertisement

Anchor Suma: నా జీవితంలో ఆ షో ఎప్పటికీ ప్రత్యేకమే..సుమ మనసును గెలిచిన షో..

Anchor Suma: నా జీవితంలో ఆ షో ఎప్పటికీ ప్రత్యేకమే..సుమ మనసును గెలిచిన షో..
Advertisement

Anchor Suma: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో యాంకర్ అంటే అందరికీ సుమ(Suma) పేరే ముందుగా గుర్తుకొస్తుంది. ప్రస్తుతం యాంకర్ గా ఇండస్ట్రీలో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న సుమ తాజాగా బిగ్ టీవీతో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా సుమ తన కెరియర్ గురించి వ్యక్తిగత విషయాల గురించి అభిమానులతో పంచుకున్నారు. ముఖ్యంగా సుమ యాంకర్ గా వ్యవహరించిన బుల్లితెర కార్యక్రమాల గురించి ప్రస్తావనకు వచ్చింది. సుమ యాంకర్ గా గతంలో ప్రతి ఒక్క టీవీ ఛానల్ లోనూ ఏదో ఒక కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేవారు. సుమా యాంకర్ గా వ్యవహరించిన వాటిలో స్టార్ మహిళ ,సుమ అడ్డా, క్యాష్ వంటి కార్యక్రమాలు ఎంతో మంచి ఆదరణను సొంతం చేసుకున్నాయి.

లింకా బుక్ ఆఫ్ రికార్డ్..

ఈ నేపథ్యంలోనే సుమ ఈ కార్యక్రమంలో భాగంగా తన జీవితంలో స్టార్ మహిళ కార్యక్రమం ఎంతో ప్రత్యేకమైనదో తెలిపారు. ఈ కార్యక్రమం సుమారు 12 సంవత్సరాలపాటు కొనసాగిందని ఈ కార్యక్రమం ద్వారా తాను ఎంతోమంది అభిమానాన్ని సొంతం చేసుకున్నానని సుమ తెలియజేశారు. ఇలా తన కెరియర్లో స్టార్ మహిళ కార్యక్రమానికి ప్రత్యేకమైన అనుబంధం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని 12 సంవత్సరాలపాటు విజయవంతంగా ముందుకు తీసుకెళ్లడంతో లింకా బుక్ ఆఫ్ రికార్డులో కూడా చోటు దక్కిందని సుమా తెలియచేశారు.

సినిమా ఈవెంట్లతో బిజీగా..

Advertisement

ప్రస్తుతం సినిమా ఈవెంట్లతోనే సుమ బిజీగా గడుపుతున్నారు .ఈ నేపథ్యంలోనే బుల్లితెర కార్యక్రమాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. కేవలం ఈటీవీలో సుమా అడ్డ అనే కార్యక్రమం మాత్రమే ప్రసారమవుతుంది. గతంలో క్యాష్ అనే కార్యక్రమాన్ని ఇప్పుడు సుమ అడ్డగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఈ ఒక్క షో మినహా మిగిలిన ఎలాంటి కార్యక్రమాలను సుమా చేయటం లేదు అయితే సినిమా ఈవెంట్లతో క్షణం తీరిక లేకుండా ఎంతో బిజీగా ఉంటున్నారు. ఏదైనా ఒక సినిమా ఈవెంట్ ఉంది అంటే కచ్చితంగా ఆ కార్యక్రమంలో సుమ ఉండాల్సిందే. సుమ లేకపోతే కొంతమంది దర్శక నిర్మాతలు ఈవెంట్ కూడా క్యాన్సిల్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి.

Advertisement

ఈమె యాంకర్ గా వ్యవహరిస్తున్నారు అంటే అక్కడ ఎలాంటి పరిస్థితులు తలెత్తిన ఎంతో చక్కగా హ్యాండిల్ చేస్తూ ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉంటారు. అందుకే ఎక్కువగా సుమ యాంకర్ గా ఉండాలని చాలామంది భావిస్తుంటారు. ఇలా స్టార్ హీరోల సినిమా నుంచి మొదలుకొని చిన్న హీరోల సినిమాలకు కూడా ఈమె యాంకర్ గా కొనసాగుతూ ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఎంటర్టైన్స్ చేస్తూ సినిమాకు కావలసినంత బజ్ క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇక సుమా కెరియర్ మొదట్లో నటిగా పలు సీరియల్స్ లో నటించారు అలాగే సినిమాలలో కూడా నటించారు. ఇటీవల ప్రేమంటే అనే సినిమాలో కూడా ఒక చిన్న పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

Also Read: Anasuya Bhardwaj Hospitalized due to illness shares emotional post on Instagram 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×