E-Paper
Advertisement

వామ్మో శ్రీముఖి తెరపై కనపడాలంటే లక్షలు ఇవ్వాల్సిందేనా.. భారీగా సంపాదిస్తున్న రాములమ్మ?

వామ్మో శ్రీముఖి తెరపై కనపడాలంటే లక్షలు ఇవ్వాల్సిందేనా.. భారీగా సంపాదిస్తున్న రాములమ్మ?
Advertisement

Anchor Sreemukhi: బుల్లితెరపై ఎంతోమంది యాంకర్లుగా స్థిరపడి మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ఇలా బుల్లితెరమ్ యాంకర్లుగా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో శ్రీముఖి(Sreemukhi)ఒకరు. ప్రస్తుతం శ్రీముఖి వరుస బుల్లితెర కార్యక్రమాలకు యాంకర్ గా కొనసాగుతూ తీరిక లేకుండా ఎంతో బిజీగా గడుపుతున్నారు. అదుర్స్ షో ద్వారా బుల్లితెరకు యాంకర్ గా పరిచయమైన ఈమె పటాస్ కార్యక్రమంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. బుల్లితెరపై వివిధ ఛానల్లలో ఎన్నో కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ తన ఎనర్జీతో ప్రేక్షకులను కూడా అదే విధంగా ఎంటర్టైన్ చేస్తూ వచ్చారు.

యాంకర్ గా బిజీబిజీగా శ్రీముఖి..

ఇక ఈమె ప్రస్తుతం స్టార్ మా లో ఆదివారం విత్ స్టార్ మా పరివార్ కార్యక్రమంతో పాటు మరిన్ని కార్యక్రమాలకు యాంకర్ గా కొనసాగుతున్నారు. మరోవైపు ప్రీ రిలీజ్ ఈవెంట్లలో కూడా శ్రీముఖి సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలా బుల్లితెరపై తన మాట తీరుతో, ఎంతో ఎనర్జిటిక్ గా అందరిని నవ్విస్తూ ఎంటర్టైన్ చేస్తున్న ఈమె ఈ యాంకర్ గా బాగా సంపాదిస్తున్నారనే చెప్పాలి. శ్రీముఖి తెరపై కనిపించడం కోసం భారీ స్థాయిలోనే రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్టు తెలుస్తుంది.

సోషల్ మీడియా ద్వారా ఆదాయం..

Advertisement

ప్రస్తుతం ఒక కార్యక్రమానికి శ్రీముఖి యాంకర్ గా చేయాలి అంటే సుమారు 2 నుంచి3 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈమె యాంకర్ గా చేయాలి అంటే 2.5 లక్షల రెమ్యూనరేషన్ అందుకోబోతున్నారు. ఇలా బుల్లితెర యాంకర్ గా శ్రీముఖి భారీ స్థాయిలోనే సంపాదిస్తున్నారని చెప్పాలి. ఈ కార్యక్రమాలు మాత్రమే కాకుండా ఈమె ప్రత్యేక ఈవెంట్లలో కూడా సందడి చేస్తున్నారు. అలాగే ఇంస్టాగ్రామ్ యూట్యూబ్, పలు ఎండార్స్మెంట్ ద్వారా కూడా ఆదాయం అందుకుంటున్నారు. బుల్లితెర రాములమ్మగా మాత్రమే కాకుండా వెండి తెరపై కూడా పలు సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

వెండితెరపై సందడి చేసిన శ్రీముఖి..

Advertisement

శ్రీముఖి జులాయి సినిమాలో అల్లు అర్జున్ సోదరిగా నటించారు అలాగే నేను శైలజ సినిమాలో రామ్ పోతినేని చెల్లెలుగా కూడా నటించారు ఈ సినిమాలు కాకుండా ప్రేమ ఇష్క్ కాదల్ అనే సినిమాలో హీరోయిన్గా నటించారు .ఇటీవల చిరంజీవి హీరోగా నటించిన భోళా శంకర్ సినిమాలో కూడా ఈమె సందడి చేశారు. ఇక త్వరలోనే సమంత ప్రధాన పాత్రలో నటించిన మా ఇంటి బంగారం అనే సినిమాలో కూడా శ్రీముఖి కీలకపాత్రలో నటించారు. ఇలా వెండి తెరపై నటిగా పలు సినిమాలలో నటిస్తూనే బుల్లితెర యాంకర్ గా కూడా బిజీగా ఉంటూ భారీ స్థాయిలో సంపాదన అందుకుంటున్నారని చెప్పాలి.

Also Read: అఖిల్ లెనిన్ నుంచి సెకండ్ సింగిల్ ఎట్టాఎట్టా  రిలీజ్…రెండు కళ్ళు సరిపోలేదే అంటూ!

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×