E-Paper
Advertisement

యాంకరమ్మకి రూ.20 కోట్ల విల్లా.. ఎలా వచ్చిందంటే?

యాంకరమ్మకి రూ.20 కోట్ల విల్లా.. ఎలా వచ్చిందంటే?
Advertisement

Tollywood: సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత ఉన్నదీ..లేనిది సృష్టించి సెలబ్రిటీలపై రుద్దుతూ నానా రాద్ధాంతం చేస్తున్నారు కొంతమంది ఆకతాయిలు. ఈ నేపథ్యంలోనే ఇలాంటి రూమర్స్ కి సెలబ్రిటీలు ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు. కొంతమందిపై ఎఫైర్ రూమర్స్ సృష్టిస్తే మరికొంతమందికి ఆస్తుల విషయంలో రూమర్లు క్రియేట్ చేస్తూ వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అయితే సమయం సందర్భం వచ్చినప్పుడు ఆ సెలబ్రిటీలే ఆ రూమర్స్ పై స్పందిస్తే తప్ప వాటికి పుల్ స్టాప్ పడదు అనడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే గత కొన్ని రోజులుగా ఒక స్టార్ యాంకరమ్మకి రూ.20 కోట్ల విలువ చేసే బంగ్లా ఉంది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆ వార్తలకు ఇటీవల స్వయంగా ఆ యాంకర్ స్పందించి క్లారిటీ ఇచ్చింది. మరి ఆమె ఎవరు ? ఏంటా 20 కోట్ల బంగ్లా కథ ? అనే విషయం ఇప్పుడు చూద్దాం.

స్టార్ యాంకర్ కి రూ.20 కోట్ల బంగ్లా..

ఆమె ఎవరో కాదు బుల్లితెర యాంకర్ , బిగ్ బాస్ ఫేమ్ స్రవంతి చొక్కారపు. తన అద్భుతమైన వాక్చాతుర్యంతో సినిమా ఈవెంట్లకు హోస్ట్ గా వ్యవహరిస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ కి హైదరాబాదులో రూ.20 కోట్ల విలువైన లగ్జరీ విల్లా ఉందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే .అయితే తాజాగా దీనిపై ఆమె క్లారిటీ ఇచ్చింది. ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హోస్ట్ గా చేస్తున్న స్రవంతి చొక్కారపు వద్ద ఈ విషయాన్ని ప్రస్తావించగా.. ఆమె మాట్లాడుతూ..” నాకు రూ.20 కోట్ల బంగ్లా ఉందని వార్తలు వచ్చాయి. అలాంటిదేం లేదు రూ.20 కోట్లు కాదు కదా కనీసం రెండు కోట్ల విలువ చేసే విల్లా కూడా లేదు” అంటూ నవ్వుతూ క్లారిటీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.

సొంతింటి కలను బయటపెట్టిన స్రవంతి..

Advertisement

ఇదే ఈవెంట్ లో ఆమె ధరించిన నెక్లెస్ గురించి అడగగా.. ఇది ఒరిజినల్ కాకపోతే బ్రాండ్ ఎండార్స్మెంట్ ఎలా అవుతుంది? అంటూ స్ట్రైట్ గా సమాధానం ఇచ్చింది. అలా మొత్తానికైతే తనపై వచ్చిన రూమర్స్ కి ఒక్క మాటతో క్లారిటీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఇదే ఈవెంట్లో ఆమె మాట్లాడుతూ.. “భవిష్యత్తులో మంచి ఇల్లు కొనాలని అందరికీ ఉంటుంది. అలాగే నాకు కూడా ఉంది కానీ త్వరలోనే ఆ ఇంటి కలను నెరవేర్చుకుంటాను” అంటూ తన కోరికను బయటపెట్టింది స్రవంతి చొక్కారపు

also read:Jetlee Movie Review: జెట్‌ లీ మూవీ రివ్యూ.. హీరోగా గర్జించిన సత్య.. కానీ?

నటిగా అవకాశం..

Advertisement

అనంతపురం జిల్లా కదిరి నుంచి హైదరాబాద్ కి వచ్చి చిన్న పాత్రలతో కెరియర్ ప్రారంభించిన స్రవంతి.. ఇప్పుడు యాంకర్ గా , నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. నిజానికి దశాబ్ద కాలానికి పైగా నటిగా అవకాశం దక్కించుకోవడానికి కష్టపడ్డానని కానీ సుహాస్, శివాని నాగారం జంటగా వచ్చిన హే బల్వంత్ సినిమా ద్వారా ఆ కల నెరవేరిందని తెలిపింది. ఇందులో తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకుంది ఈ యాంకరమ్మ.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×