E-Paper
Advertisement

జబర్దస్త్ నుండి బయటకు వచ్చేసా.. నిజాలు చెప్పకపోవడమే మంచిది -సౌమ్యరావు

జబర్దస్త్ నుండి బయటకు వచ్చేసా.. నిజాలు చెప్పకపోవడమే మంచిది -సౌమ్యరావు
Advertisement

Sowmya Rao:ప్రముఖ నటి సౌమ్యారావు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఒకప్పుడు సీరియల్స్ లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ కన్నడ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత జబర్దస్త్ లో కొంతకాలం యాంకర్ గా రాణించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా జబర్దస్త్ నుండి యాంకర్ అనసూయ తప్పుకోవడంతో సౌమ్యను యాంకర్ గా తీసుకొచ్చారు. వచ్చీరాని తెలుగుతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. కానీ అనూహ్యంగా ఆమెను షో నుంచి తీసేశారు. అంతేకాదు జబర్దస్త్ కార్యక్రమం, ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమాలను కలిపి ఇప్పుడు ఒకే షో గా ప్రసారం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తన నటనతో, అందంతో, వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకున్న సౌమ్యరావును సడన్గా జబర్దస్త్ నుంచి తీసేయడం వెనుక అసలు కారణం ఏమిటి అనే విషయం వైరల్ కాగా.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సౌమ్యరావు ఆ విషయాలు చెప్పకపోవడమే మంచిది అంటూ ఆశ్చర్యపరిచింది.

అందరూ సపోర్ట్ చేశారు.. కానీ -సౌమ్య రావు

జబర్దస్త్ లో నాకు ప్రియాంక సింగ్, సత్య శ్రీ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేశారు. అలాగే నూకరాజు, బుల్లెట్ భాస్కర్, శాంతి ఇలా ప్రతి ఒక్కరు జబర్దస్త్ లో ఎంటర్టైన్ చేసే వారందరూ కూడా నాతో చాలా బాగా ఉంటారు. నేను ఏ ఒకరితో కూడా గొడవలు పెట్టుకోలేదు. ఎవరూ కూడా నన్ను ఇబ్బంది పెట్టలేదు. నాకు తెలుగు సరిగ్గా రాకపోయినా నాకు తెలుగు నేర్పించి మరీ నన్ను ఎంకరేజ్ చేశారు. నేను వెళ్లిపోయిన తర్వాత వాళ్లు నన్ను చాలా మిస్ అవుతున్నామని చాలాసార్లు ఫోన్ చేసి మరీ చెప్పారు. ఏ ఒక్క రోజు కూడా నన్ను వాళ్ళు హర్ట్ చేయలేదు. అంటూ తెలిపింది సౌమ్యరావు.

ఆ నిజాలు చెప్పకపోవడమే మంచిది -సౌమ్యరావు

Advertisement

ఇక జబర్దస్త్ నుండి తీసేసి ప్రొడక్షన్ హౌస్ మిమ్మల్ని హర్ట్ చేసింది కదా అని యాంకర్ ప్రశ్నించగా.. ఆమె మాట్లాడుతూ “వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో నచ్చలేదేమో.. బిజినెస్ మైండ్ కదా.. వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయో మనకు తెలియదు కదా.. నిజం చెప్పాలంటే కొన్ని కొన్ని సత్యాలు ఉంటాయి. అవన్నీ చెప్పకపోవడమే మంచిది. ఒకవేళ మనం చెబితే అయ్యో పాపం అంటారు తప్పా.. ఆ తర్వాత ఏమి ఉండదు. అందుకే ఆ నిజాలను మనం బయట పెట్టకపోవడం మంచిది అంటూ సౌమ్యరావు తెలిపింది. ఈమె మాటలను బట్టి వింటే ప్రొడక్షన్ టీం తో ఏదో ఇబ్బంది ఎదురైందని.. అందుకే ఆమె ఇలా నిజాలు బయట పెట్టడానికి వెనుకడుగు వేస్తోందనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.

ALSO READ:Vaazha 2 Telugu Review: మలయాళం లో రూ.210 కోట్లు.. తెలుగులో దుమ్ములేపుతుందా?

యాంకర్ అనసూయ ఎవరు నాకు తెలియదు..

Advertisement

అనసూయ వల్లే మీరు జబర్దస్త్ లోకి అడుగుపెట్టారని కామెంట్లు వ్యక్తమయ్యాయి నిజమేనా? అని అడిగితే.. అసలు అనసూయ ఎవరో నాకు తెలియదు. అయితే నేను యాంకర్ గా చేసిన మరో షోలో ఆమె జడ్జిగా వ్యవహరించారు. చాలా బాగా చూసుకున్నారు. చాలా మంచివారు కూడా.. నన్ను ఎంకరేజ్ చేశారు అంటూ అనసూయ గురించి చెప్పుకొచ్చింది సౌమ్యరావు. ప్రస్తుతం సౌమ్య చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×