E-Paper
Advertisement

Anchor Ravi: ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా విజయ్ దేవరకొండకు ఫరక్ పడదు

Anchor Ravi: ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా విజయ్ దేవరకొండకు ఫరక్ పడదు
Advertisement

Anchor Ravi: విజయ్ దేవరకొండకు తన బలం ఏంటో తెలుసు.. బలహీనత ఏంటో కూడా తెలుసు. ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా.. ఆయనకు ఫరక్ పడదని అన్నారు యాంకర్ రవి. బిగ్ టీవీ ‘కిస్సిక్ టాక్స్ విత్ వర్ష’ కార్యక్రమంలో ఆయన విజయ్ దేవరకొండపై ప్రశంసల వర్షం కురిపించారు. తను నటించిన ‘అలలే ఎగసి’ సాంగ్‌ని విడుదల చేసిన విజయ్‌కి రవి థ్యాంక్స్ చెప్పారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ గురించి రవి చెబుతూ..

మెగాస్టార్ చిరంజీవి స్థాయికి చేరుకోవాలి

‘‘విజయ్ దేవరకొండ ఒక బంగారు కొండ. డే 1 నుంచి మాపై సాప్ట్ కార్నర్ ఉంది. ఎంతో ప్రేమగా ఉంటారు. ఆయన కలిసినప్పుడు ఆ వైబ్ తెలిసిపోతుంది. నేను ఎప్పుడు, ఏది అడిగినా, ఎప్పుడూ నో అని చెప్పలేదు. నేను కూడా విజయ్ అన్న కోసం ఎప్పుడూ నిలబడతాను. ఆయన ప్రతి సినిమా నేను థియేటర్‌లోనే చూస్తాను. ఆయన సినిమాలు ఆడినా, ఆడకపోయినా ఎప్పుడూ నిండైన హృదయంతో నిజాయితీగా ఉంటాడు. ఒక పాత్‌ని నమ్ముకున్నాడు. ఆయనకి ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా, ఫరక్ పడదు. ఆయనకు ఏం కావాలో తెలుసు. సినిమా అంటే ఒక్క పర్సన్ కాదు. డిఫరెంట్ డిఫరెంట్ థింక్స్ ఉంటాయి. ఆయన బలం ఏంటో, బలహీనత ఏంటో ఆయనకు కరెక్ట్‌గా తెలుసు. ఫెంటాస్టిక్ హ్యుమన్ బీయింగ్. గ్రేట్ గ్రేట్ హార్ట్. ఇంకా చెప్పాలంటే ఒక ట్రూ ఆర్టిస్ట్. అందుకే.. విజయ్ దేవరకొండ ఈజ్ మై బంగారు కొండ. ఆయనకు మంచి సక్సెస్ రావాలని, మంచి ప్రశంసలు అందుకోవాలని, అంచెలంచెలుగా ఎదుగుతూ మెగాస్టార్ చిరంజీవి స్థాయికి చేరుకోవాలని, సూపర్ స్టార్ అవ్వాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే, ఆయనకు అన్నీ క్వాలిటీస్ ఉన్నాయి. గ్రేట్ లుక్స్, గ్రేట్ బాడీ, గ్రేట్ యాక్టింగ్ స్కిల్స్ అన్నీ బాగున్నాయి. టైమ్ ఒక్కటే కలిసి రావడం లేదు. గ్రహాలన్నీ సెట్టై.. అది కూడా కలిసి వస్తే ఆయనకిక తిరుగుండదు..’’ అని అన్నారు.

Advertisement

Also Read- Shiva jyothi: బేబీ జెండర్ రివీల్ చేసిన శివజ్యోతి… వీడియో వైరల్!

ఆవగింజంత లక్ కూడా ఉండాలి

లక్‌ని నమ్ముతావా? టాలెంట్‌ని నమ్ముతావా? అంటే.. ఆల్వేస్ టాలెంట్ అనే అంటాను. కానీ ఎంత టాలెంట్ ఉన్నా, ఆవగింజంత లక్ కూడా ఉండాలి. కాకపోతే లక్‌ని నమ్మవద్దు. నీ కష్టాన్ని నమ్ముకుని నీ వర్క్ నువ్వు చేసుకోవడమే. అర్హత ఉన్నోడికి అదృష్టం వస్తుంది. ఆ అర్హత సంపాదించుకోవాలి. అర్హత ఉన్నోడికి ఎక్కడ లేని అదృష్టం అలా వస్తుంది. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఆడుతుంటే ఛాన్సెస్ వస్తాయి. ఆ అర్హత సంపాదించాడు కాబట్టే ఛాన్సెస్ వస్తాయి. ఎన్నోసార్లు అవుటవ్వకుండా ఉండగలిగాడు. అప్పుడు యూనివర్సే హెల్ప్ చేయడానికి వస్తుంది. హార్డ్ వర్క్‌ని నమ్ముకుంటే అన్నీ వాటంతట అవే వస్తాయి. చిరంజీవి నుంచి నాని వరకు టాలీవుడ్‌లో హీరోలెందరో ఈ విషయాన్ని చెప్పారు. హార్డ్ వర్క్‌ని నమ్ముకున్నోడు ఓడిపోయినట్టు చరిత్రలో లేదు.. ఉండదు.. అని రవి చెప్పుకొచ్చారు.

Advertisement

Also Read- Nagabandham: ‘నాగబంధం’లో ‘బైరాగి’ పాత్రలో ఎవరంటే? భయంకరంగా ఫస్ట్ లుక్!

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×