E-Paper
Advertisement

Anchor Ravi: పెట్రోల్ సమస్యపై యాంకర్ రవి ఆగ్రహం.. ప్రభుత్వం చెప్పలేదంటూ..

Anchor Ravi: పెట్రోల్ సమస్యపై యాంకర్ రవి ఆగ్రహం.. ప్రభుత్వం చెప్పలేదంటూ..
Advertisement

Anchor Ravi: అమెరికా, ఇజ్రాయిల్ వంటి దేశాల మధ్య పెద్ద ఎత్తున యుద్ధ వాతావరణ పరిస్థితులు నెలకొనడంతో ఈ ప్రభావం ప్రపంచ దేశాలన్నింటిపై పడుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ యుద్ధం ప్రభావం మనదేశంలో కూడా గ్యాస్ పై తీవ్రమైన ప్రభావాన్ని చూపింది . ఇప్పటికీ మన దేశంలో గ్యాస్ కొరతతో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయితే యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో పెట్రోల్ నిల్వలు కూడా అయిపోయాయని, పెట్రోల్ కొరత ఏర్పడబోతోంది అంటూ వార్తలు బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరూ పెట్రోల్ బంక్ వద్దకు చేరుకొని పెట్రోల్ కోసం పడిగాపులు కాస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ వంటి మహానగరంలో ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

గవర్నమెంట్ పెట్రోల్ కొరత ఉందని చెప్పిందా?

పెట్రోల్ సమస్య ఉంది అంటూ పుకారు పుట్టించిన నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు అవసరానికి మించిన పెట్రోల్ కొనుగోలు చేస్తూ ఉన్నారు.. ఇలా పెట్రోల్ సమస్య గురించి తాజాగా యాంకర్ రవి (Anchor Ravi)ఒక వీడియోని షేర్ చేస్తూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక పెట్రోల్ బంక్ వద్ద వాహనాలు బారులు తీరిన ఒక వీడియోని షేర్ చేస్తూ ఇంతమంది పెట్రోల్ కోసం ఎదురుచూస్తున్నారు మీకెవరైనా చెప్పినారా పెట్రోల్ ఉండదని, తొందరగా ట్యాంక్ ఫుల్ చేసుకోమని ఎవరైనా చెప్పారా? అంటూ ప్రశ్నించారు.

అవసరమైన వాళ్లకు పెట్రోల్ దొరకలేదు..

Advertisement

మన గవర్నమెంట్ నుంచి పెట్రోల్ కొరత ఉంది అంటూ అధికారికంగా ఎవరైనా నోటిఫికేషన్ విడుదల చేశారా? ఇప్పుడు నా కారులో చూడండి కేవలం రెండు పాయింట్లు మాత్రమే పెట్రోల్ ఉన్నట్టు చూపిస్తుంది. అయినప్పటికీ నేను పెట్రోల్ కొట్టించుకోవడం లేదు. ఇలా ఎవడో ఒకడు పెట్రోల్ ఉండదు అంటూ పుకారు , పుట్టిస్తే అది నిజమని భావించి ఇలా పెట్రోల్ బంక్ వద్దకు వెళ్లి బారులు తీరి, అవసరం కంటే ఎక్కువగా పెట్రోలు కొనుగోలు చేయడం వల్ల అవసరమైన వారికి దొరక్కుండా పోతుందని రవి తెలిపారు. అంతేకాకుండా పెట్రోల్ కోసం రోడ్డుమీదకు రావడంతో ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుందని రవి మండిపడ్డారు.

Advertisement

పెట్రోల్ అయిపోతుందని ఇప్పటివరకు ఏ గవర్నమెంట్ కూడా చెప్పలేదు అలాగే మన దగ్గర చాలా పెట్రోల్ ఉందని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి అలాగే ఈ విషయం అందరికీ అర్థమయ్యేలా,తెలిసేలా షేర్ చేయండి అంటూ ఈయన ఒక వీడియోని విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇలా ఒక పుకారు కారణంగా హైదరాబాద్ లో పెట్రోల్ బంకులు మొత్తం కిటికీటలాడటమే కాకుండా ట్రాఫిక్ జామ్ కారణంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలా రవి షేర్ చేసిన ఈ వీడియో వైరల్ గా మారడంతో ఈ వీడియో పై పలువురు స్పందిస్తూ చాలా బాగా చెప్పారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇలా ఉన్నఫలంగా జనాలు మొత్తం పెట్రోల్ బంకు వద్దకు వెళ్లడంతో పెట్రోల్ బంక్ లో కూడా ఫ్యూయల్ ఖాళీ అవుతున్నాయి . ఇలా అవసరానికి మించి పెట్రోల్ పట్టించుకోవడంతో అవసరమైన వారు ఇబ్బందులు పడక తప్పదని చెప్పాలి.

Also Read: V.V.Vinayak:100 ఎకరాలు.. కోట్లలో ఆస్తులు.. వి.వి వినాయక్ ఆస్తులు మామూలుగా లేవే?

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×