E-Paper
Advertisement

Anchor Rashmi:నెటిజన్ కి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన రష్మీ.. ప్రూఫ్స్ కావాలంటూ కౌంటర్!

Anchor Rashmi:నెటిజన్ కి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన రష్మీ.. ప్రూఫ్స్ కావాలంటూ కౌంటర్!
Advertisement

Anchor Rashmi:సాధారణంగా సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత సెలబ్రిటీలు ఎవరో ఒకరితో క్లోజ్ గా కనిపిస్తే చాలు.. లేనిపోని నిందలు క్రియేట్ చేస్తూ ఉంటారు. మరికొంతమంది వారితో కనిపించకపోయినా సరే ఏదో ఎఫైర్ ఉందనే విధంగా రూమర్స్ స్ప్రెడ్ చేస్తూ సెలబ్రిటీలను మానసిక వేదనకు గురి చేస్తున్నారనే చెప్పాలి. అయితే ఇలాంటి మాటలను కొంతమంది చూసి చూడనట్టు వదిలేస్తే.. ఇంకొంతమంది తట్టుకోలేక భారీ కౌంటర్ ఇస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకునే యాంకర్ రష్మీ (Rashmi) తాజాగా ఒక నెటిజన్ పై మండిపడ్డ తీరు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముఖ్యంగా నీ దగ్గర ఏదైనా ప్రూఫ్స్ ఉంటే చూపించు అంటూ కౌంటర్ ఇచ్చింది మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

రష్మీ వ్యక్తిత్వంపై నెటిజన్ ఘాటు కామెంట్..

గత కొన్ని రోజులుగా ఇరాన్ – ఇజ్రాయిల్ మధ్య యుద్ధం పెద్ద ఎత్తున జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిని ఉద్దేశించి రష్మీ ఆసక్తికర ట్వీట్ చేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా తన క్యారెక్టర్ ను టార్గెట్ చేస్తూ ఒక నెటిజన్ చేసిన పోస్ట్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా తన పర్సనల్ లైఫ్ గురించి ప్రూఫ్స్ ఉంటే బయట పెట్టాలని, తనకు రిలేషన్స్ ఉన్నా లేకపోయినా తనను వేధించే హక్కు మీకు ఎవరికీ లేదు అంటూ మండిపడింది. ముఖ్యంగా తాను పెళ్లి చేసుకునే వరకు ఎంతో మందితో తిరిగిన అది మీ సమస్య కాదు అంటూ తనదైన స్టైల్ లో కౌంటర్ వచ్చింది ఈ ముద్దుగుమ్మ.

ఆ హక్కు మీకు ఎవరికీ లేదు అంటూ మండిపడ్డ రష్మి..

Advertisement

దీనిపై రష్మిక మాట్లాడుతూ..”నీ దగ్గర ఏదైనా ప్రూఫ్స్ ఉంటే చూపించు. ఇక నాకు ఎంతమందితో ఎన్ని సంబంధాలు ఉన్నా లేకపోయినా నాపై వేధింపులకు పాల్పడే హక్కు ఎవరికీ లేదు. నేను నిన్ను కానీ , మీ తండ్రిని కానీ, లేదా మీ కొడుకును కాని వివాహం చేసుకునే వరకు నేను ఎంతమందితో తిరిగినా అది మీ సమస్య కాదు. అలాగే నాకు ఎవరి ఎవరితో లింకు ఉందో దయచేసి వాళ్ళ పేర్లు కూడా నాకు చెప్పండి. మీరు ఎవరికి వ్యక్తిత్వాన్ని అయినా హత్య చేయాలనుకుంటే ఇద్దరి పేర్లు బయట పెట్టండి. అది న్యాయం” అంటూ సదరు నెటిజన్ కు గట్టి కౌంటర్ ఇచ్చింది మొత్తానికి అయితే ఇతరులతో అనవసరమైన సంబంధాలు అంటగడుతున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది ఈ ముద్దుగుమ్మ .ఇక ప్రస్తుతం ఈమె చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ALSO READ:Bellamkonda Srinivas: ఘనంగా హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్థం.. ప్రేయసితో ఏడడుగులకు సిద్ధం!

రష్మీ కెరియర్..

Advertisement

రష్మీ విషయానికి వస్తే ..సినిమాల ద్వారానే మొదట తన కెరీర్ మొదలుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. అయితే అక్కడ హీరోయిన్గా అవకాశాలు తలుపు తట్టకపోయేసరికి బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది. అక్కడ జబర్దస్త్ కార్యక్రమంతో ఊహించని ఇమేజ్ సొంతం చేసుకుంది. గత కొన్ని సంవత్సరాలుగా శ్రీదేవి డ్రామా కంపెనీ , జబర్దస్త్ షోలకు యాంకర్ గా వ్యవహరిస్తూ బిజీగా మారిపోయింది. ఇక ఇలాంటి సమయంలోనే ఈమెపై తప్పుడు వ్యాఖ్యలు చేసినందుకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది రష్మీ

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×