E-Paper
Advertisement

Anasuya: ఆంటీ కాదు దేవత.. అనసూయ కోసం ప్రత్యేకంగా గుడి.. ఎక్కడ కడుతున్నారో తెలుసా?

Anasuya: ఆంటీ కాదు దేవత.. అనసూయ కోసం ప్రత్యేకంగా గుడి.. ఎక్కడ కడుతున్నారో తెలుసా?
Advertisement

Anasuya:ప్రముఖ యాంకర్ అనసూయ)Anasuya ) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ‘జబర్దస్త్’ ద్వారా యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ఈమె ..తన అద్భుతమైన వాక్చాతుర్యంతో మరింత ఇమేజ్ అందుకుంది. ఒకవైపు యాంకర్ గా వ్యవహరిస్తూనే.. మరొకవైపు సినిమాలలో కూడా నటించిన ఈమె.. ఆ పాత్రలతో ఊహించని క్రేజ్ సొంతం చేసుకుంది. ఇకపోతే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా మరొకవైపు కాంట్రవర్సీ మాటలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

త్వరలో అనసూయకి గుడి కడతాం – అభిమాని మురళీ శర్మ

ఇదిలా ఉండగా.. గత కొంతకాలం క్రితం కొంతమంది ఈమెపై ఆంటీ అంటూ ట్రోల్స్ కూడా చేసిన విషయం తెలిసిందే. అయితే అనసూయ ఆంటీ కాదు దేవత అంటూ ఆమెకు ఏకంగా గుడి కడుతున్నాం అంటూ ఒక అభిమాని చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అనసూయ అభిమానిగా చెప్పుకునే మురళీ శర్మ (Murali Sharma) అనే వ్యక్తి తాజాగా అనసూయకి గుడి కట్టబోతున్నామని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. అనసూయ అభిమాన సంఘం అధ్యక్షుడిని అంటూ ఈమధ్య చాలా మీడియాలలో ఆయన హైలెట్ అవుతున్నారు. ఇప్పుడు ఆయనే గుడి కడతానని ప్రకటన చేయడంతో అనసూయకు గుడి కడుతున్నారా? అంటూ అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం.

Advertisement

ALSO READ:Daali Dhananjay: శుభవార్త చెప్పిన పుష్ప జాలిరెడ్డి.. జీవితంలో మరో కొత్త అధ్యాయం మొదలు!

ప్రేమతో ఒక గులాబీ పువ్వు పెట్టినా చాలు – మురళీ శర్మ

తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మురళీ శర్మ మాట్లాడుతూ..” నేను అనసూయ అభిమానిని.. ఖుష్బూ, సమంతకు గుడి ఉన్నట్లుగానే అనసూయకి కూడా గుడి కడతాము. అభిమానులందరం ఏకమై.. ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఆ గుడి ఎక్కడ కట్టాలనే దానిపైన నిర్ణయం తీసుకుంటాము. ముఖ్యంగా ఈ గుడి కట్టడానికి ప్రభుత్వం కూడా సహాయం చేయాలి” అంటూ మురళీ శర్మ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు. ఇకపోతే ఈ గుడిలో పూజారిగా మీరే ఉంటారా? అని యాంకర్ ప్రశ్నించగా.. పూజారులే ఉండాల్సిన అవసరం లేదు.. ప్రేమతో ఒక గులాబీ పెట్టినా సరిపోతుంది అంటూ తనదైన శైలిలో కామెంట్లు చేశారు మురళీ శర్మ. ఇకపోతే మురళీ శర్మ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

అనసూయ కెరియర్..

Advertisement

ఇక అనసూయ విషయానికి వస్తే అనసూయ.. ఒకవైపు కామెడీ షో లలో హోస్ట్ గా పనిచేస్తూనే.. మరొకవైపు 2016లో నాగార్జున హీరోగా నటించిన ‘సోగ్గాడే చిన్నినాయన’ చిత్రంలో నటించింది. అదే ఏడాది క్షణం సినిమాలో నటించిన ఈమె ఇందులో విలన్ పాత్ర పోషించి.. మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది. ఎప్పుడైతే సుకుమార్, రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్ర పోషించిందో.. అప్పటి నుంచి ఈమె సినీ కెరియర్ పరంగా వెనుతిరిగి చూడలేదు. ఆ తర్వాత పలు పాన్ ఇండియా చిత్రాలలో కూడా అవకాశం అందుకొని మరింత బిజీగా మారిపోయింది అనసూయ. ఏది ఏమైనా ఒకవైపు క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలతో మరోవైపు విలన్ పాత్రలతో ఇటు వెండితెర ఆడియన్స్ ను అటు పలు షోలతో బుల్లితెర ఆడియన్స్ ను విపరీతంగా మెప్పిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇక ఈమెకు గుడి కడతామని అభిమానులు చెప్పడంతో ఆ గుడి ఎక్కడ కడతారు ? ఎప్పుడు కడతారు అనే విషయంపై నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×