E-Paper
Advertisement

Kissik Talks: మిస్ ఇండియా అవ్వాల్సిన ఆనందం రేఖ.. నటిగా మారడం వెనుక అంత కథ ఉందా?

Kissik Talks: మిస్ ఇండియా అవ్వాల్సిన ఆనందం రేఖ.. నటిగా మారడం వెనుక అంత కథ ఉందా?
Advertisement

Kissik Talks:సినిమా, బుల్లితెర ఆడియన్స్ ను ఎంతగానో అలరిస్తున్న బిగ్ టీవీ.. గత కొంతకాలంగా కిస్సిక్ టాక్స్ షో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు ఈ షో ద్వారా మళ్లీ తమ ఉనికిని చాటుకుంటున్నారు. ప్రముఖ లేడీ కమెడియన్ జబర్దస్త్ వర్ష హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమం కొన్ని ఎపిసోడ్లను పూర్తి చేసుకోగా.. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రెటీలు ఈ షో ద్వారా అభిమానులకు చేరువవుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా చాలా ఏళ్ల తర్వాత మళ్లీ ప్రేక్షకులను అలరించడానికి ముందుకొచ్చింది ఆనందం మూవీ రేఖ. అందం , అభినయంతో ఆకట్టుకొని.. కుర్రకారు హృదయాలను దోచుకున్న ఈ చిన్నది చాలా కాలం తర్వాత మళ్ళీ కిస్సిక్ టాక్స్ కార్యక్రమంలో కనిపించడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు.

మిస్ ఇండియా అవుదాం అనుకున్నా – రేఖ

తాజాగా ఈ టాక్ షోలో పాల్గొన్న రేఖ ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంది. ముఖ్యంగా మిస్ ఇండియా అవ్వాలనుకున్న రేఖ నటిగా ఎంట్రీ ఇవ్వడం వెనుక అసలు కారణాలు చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ కిస్సిక్ టాక్స్ లో భాగంగా రేఖ మాట్లాడుతూ..” నేను పెద్దగా చదువుకోలేదు. కానీ చదువుకుంటున్న సమయంలోనే నన్ను చూసి నా ఫ్రెండ్స్ అంతా మోడల్ అవ్వమని సలహా ఇచ్చారు. ఇక దాంతో నేను మోడల్ గా మారి మిస్ ఇండియా అవ్వాలని ఎన్నో కలలు కన్నాను.

కష్టం లేకుండానే నటిగా అవకాశం..

Advertisement

ఇకపోతే మోడల్ గా చేస్తున్న సమయంలో వెస్ట్రన్ దుస్తులు వేసుకొని ఒక యాడ్ కోసం పని చేశాను. అయితే సదరు షాప్ వాళ్ళు నేను వెస్ట్రన్ డ్రెస్ వేసుకున్న ఫోటోని ప్రమోషన్ కోసం తమ షో రూమ్ లో ఉంచారు. అయితే ఆ పోస్టర్ని చూసిన కన్నడ దర్శకుడు.. తేజ తెలుగులో చేసిన చిత్రం రీమేక్ మూవీకి నన్ను ఎంపిక చేసి, ఈ సినిమా ద్వారా నన్ను నటిగా ఇండస్ట్రీకి పరిచయం చేశారు.. ఆ సమయంలో నాకు నటించాలని ఇష్టం లేదు. నేనేదో మోడలింగ్ చేసి మిస్ ఇండియా అవ్వాలని చాలా పెద్ద కోరిక ఉండేది. అదే సమయంలో రెండు సినిమాల నుంచి ఆఫర్లు వచ్చాయి.

also read:OG యూనివర్స్ ఎక్స్‌పాండ్.. మేకర్స్ నుండీ మరో సర్‌ప్రైజ్!

కోరిక నెరవేరలేదు..

Advertisement

ఒకటి తెలుగు చిత్రం రీమేక్.. మరొకటి విక్రమ్ తమిళంలో నటించిన సేతు మూవీ రీమేక్.ఈ రెండు చిత్రాలలో నాకు అవకాశం లభించడంతో నేను మిస్ ఇండియా అవ్వాలనే నా కలను పక్కనపెట్టి , నటిగా నా కెరియర్ను ప్రారంభించాను. నిజం చెప్పాలి అంటే.. ఎలాంటి కష్టం లేకుండా.. ముందస్తు ఆలోచన లేకుండా నాకు ఈ సినిమాలలో అవకాశం లభించింది. ఇక చిత్రం మూవీ రీమేక్ చూసిన తర్వాత నాకు మళ్ళీ ఆనందం సినిమాలో అవకాశం లభించింది” అంటూ అసలు విషయాన్ని పంచుకుంది రేఖ. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×