E-Paper
Advertisement

Amrutham serial : ఒరేయ్ తెగ ఆయాస పడిపోకు చాలు , 90 స్ కిడ్స్ కి అసలైన గుడ్ న్యూస్

Amrutham serial : ఒరేయ్ తెగ ఆయాస పడిపోకు చాలు , 90 స్ కిడ్స్ కి అసలైన గుడ్ న్యూస్
Advertisement

Amrutham : జీవితం ఎంత ముందుకు వెళ్లిపోయిన కూడా కొన్ని జ్ఞాపకాలు అలా పదిలంగా మిగిలిపోతాయి.. చాలా సినిమాల్లో 90 కిడ్స్ కి సంబంధించిన కొన్ని సీన్స్ చూపిస్తే విపరీతంగా ఆనంద పడిపోతుంటాం. వాళ్లందరి జీవితాల్లో కూడా ఉన్న ఏకైక సీరియల్ అమృతం. అమృతం సీరియల్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఒక మధ్య తరగతి కుటుంబంలో ఆ సీరియల్ పోషించిన పాత్ర మామూలుది కాదు.

వాటిలోని పాత్రలు ఇప్పటికీ కూడా చాలామందిని తలుచుకుంటేనే నవ్వు పుట్టించేలా చేస్తాయి. ఆంజనేయులు పాత్రలో కనిపించిన గుండు హనుమంతరావు, అమృత రావు గా కనిపించిన నరేష్, శివాజీ రాజా, హర్షవర్ధన్. అప్పాజీ గా కనిపించిన శివన్నారాయణ. సర్వేశ్వరునిగా నటించిన వాసు ఇంటూరి. పాత్రలను అంత ఈజీగా మర్చిపోలేము. ప్రస్తుతం గుండు హనుమంతరావు మన మధ్య లేరు కానీ ఆ పాత్ర మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ముఖ్యంగా అందరూ అమృతం అంటే కామెడీ మాత్రమే అనుకుంటారు. కానీ కథను ముందుకు తీసుకెళ్లడానికి దానిని క్రియేట్ చేసిన వింత సీన్స్ కొన్ని బాగా వర్కౌట్ అవడమే అమృతానికి అంత రెస్పాన్స్ వచ్చింది.

ఒరేయ్ ఆంజినేయులు 

Advertisement

ఆంజినేయులు పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అందుకే ఈ పాటలో సిరివెన్నెల సీతారామశాస్త్రి కూడా ఒరేయ్ ఆంజనేయులు తెగ ఆయాస పడిపోకు చాలు, మనం ఈదుతున్నం ఒక చెంచాడు భవసాగరాలు అనే లైన్ లో ఆంజనేయులు పేరును కూడా యాడ్ చేశాడు.

ఇటువంటి సీరియల్ మళ్లీ వస్తే ఎంత బాగుంటుందో అని చాలామంది ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. అయితే అదే సీరియల్ ని ఇప్పుడు మరింత క్వాలిటీ పెంచి రోజుకు రెండు ఎపిసోడ్లు చొప్పున నవంబర్ 24వ తారీఖు నుంచి రిలీజ్ చేస్తున్నారు. ఇది 90 కిడ్స్ కి మరియు అమృతం సీరియల్ ఫ్యాన్స్ కి ఒక అద్భుతమైన గుడ్ న్యూస్ అని చెప్పాలి.

ఆకట్టుకున్న ప్రోమో 

Advertisement

దీనిని హెచ్డి క్వాలిటీలో రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగానే ప్రకటించారు. అంతేకాకుండా ఆ పాత్రలను మరోసారి గుర్తు చేస్తూ, ఫీల్ గుడ్ బ్యాక్ గ్రౌండ్ సాంగ్ తో ఆ ప్రోమో కూడా విడుదల చేశారు. ఆ ప్రోమో ఇప్పుడు చాలామందిని విపరీతంగా ఆకట్టుకుంటుంది. అమృతం ఫ్యాన్స్ అందరు కూడా ఫుల్ హ్యాపీ ఫీలవుతున్నారు.

ఏవేవో సినిమాలు రిలీస్ చేస్తున్నారు అసలైన రీ రిలీజ్ కంటెంట్ అంటే ఇది రా బాబు అమృతం అనేది చాలామందికి ఒక ఎమోషన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది అమృతం అంటే 90 కిడ్స్ కి నిజంగా అమృతమే అంటూ చెబుతున్నారు. ఇక ఈ సీరియల్ కు ఏ రేంజ్ రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

Also Read: Ustaad Bhagat Singh : ఉస్తాద్ సెట్స్ నుంచి వీడియో సాంగ్ లీక్, పవర్ స్టార్ ఎనర్జీ మామూలుగా లేదు

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×