E-Paper
Advertisement

Amardeep Home tour: అమర్దీప్ హోమ్ టూర్.. ఆధ్యాత్మికత ఉట్టిపడుతూ!

Amardeep Home tour: అమర్దీప్ హోమ్ టూర్.. ఆధ్యాత్మికత ఉట్టిపడుతూ!
Advertisement

Amardeep Home tour: సిరిసిరి మువ్వలు, జానకి కలగనలేదు వంటి సీరియల్స్ తో తనకంటూ ఒక మంచి ఇమేజ్ సొంతం చేసుకున్న అమర్దీప్ (Amardeep ) బిగ్ బాస్(Bigg Boss) నుంచి వచ్చిన తర్వాత ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా తన సినిమాలు, సీరియల్స్ కంటే కూడా రవితేజ అభిమానిగా మరింత క్రేజ్ దక్కించుకున్నారు అనడంలో సందేహం లేదు. అలాంటి ఈయన ఇటీవల ‘సుమతీ శతకం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అమర్దీప్ చౌదరి హీరోగా, శైలీ చౌదరి హీరోయిన్గా వచ్చిన ఈ చిత్రానికి ఎమ్.ఎమ్ నాయుడు దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 6న విడుదలైన ఈ చిత్రాన్ని సాయి సుధాకర్ కొమ్మలపాటి నిర్మించగా .. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ విడుదల చేసింది. ” పెళ్లి కోసం తాపత్రయపడే ఒక యువకుడికి అనుకోని అవాంతరాలు ఎదురైతే.. ఎలా వాటిని పరిష్కరించుకొని ముందుకు సాగాడు” అనే ఒక ఆసక్తికరమైన అంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది.

అమర్దీప్ హోమ్ టూర్ వీడియో వైరల్..

ఇదిలా ఉండగా తాజాగా అమర్దీప్ చౌదరి కి సంబంధించిన హోమ్ టూర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలకు సంబంధించిన హోమ్ టూర్ వీడియోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. అందులో భాగంగానే అమర్దీప్ చౌదరికి సంబంధించిన హోమ్ టూర్ వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఆ హోమ్ టూర్ విషయానికి వస్తే.. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఆయన, ఆయన భార్య తేజు అలంకరించుకున్న ఆ ఇల్లు చూసేవారికి ప్రశాంతంగా అనిపిస్తోంది. విషయంలోకి వెళ్తే ఇంటి మొదట్లోనే అటు మనీ ప్లాంట్ తో పాటు ఇటు తులసి మొక్కతో చాలా అందంగా ఇంటి బయట అలంకరించుకున్నారు.

ఆధ్యాత్మికత ఉట్టిపడుతూ..

Advertisement

హౌస్ లోకి అడుగుపెట్టగానే.. ఎదురుగా అద్భుతమైన లైటింగ్ తో శ్రీ వెంకటేశ్వర స్వామి ఫోటో దర్శనమిస్తుంది. అటు పక్కనే సాయిబాబా కళ్ళను మాత్రమే ప్రత్యేకంగా ఫోటో రూపంలో బంధించి అలంకరించారు. బయట తులసి మొక్క, ఇంట్లోకి ప్రవేశించగానే సాయిబాబా, వెంకటేశ్వర స్వామి ఫోటోలు భక్తిని మనసులో ప్రేరేపిస్తాయి. ఇక ఆ తర్వాత ఆయన సీరియల్స్ ద్వారా సంపాదించుకున్న అవార్డ్స్ ను చూపించారు. అందులో టీవీ అవార్డ్స్ 2021లో బెస్ట్ హీరో క్యాటగిరీలో అమర్దీప్ చౌదరి అవార్డును అందుకున్నారు. జానకి కలగనలేదు సీరియల్ కి గానూ బెస్ట్ యాక్టర్ విభాగంలో స్టార్ మా అవార్డు అందుకున్నారు.

ALSO READ:Amardeep: అమర్దీప్ కి రవితేజ స్పెషల్ గిఫ్ట్.. ఏంటంటే?

స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన లివింగ్ రూమ్..

Advertisement

ఇక నెగిటివ్ ఎనర్జీ ని బయటకు పారద్రోలే డ్రీమ్ క్యాచర్ ను ఏర్పాటు చేశారు. పైగా స్టార్ మా అవార్డు అందుకున్న సమయంలో అమర్దీప్ తీసుకున్న ఒక అద్భుతమైన స్మైలీ ఫోటోని ఒక ఫోటో ఫ్రేమ్ రూపంలో లివింగ్ ఏరియాలో చాలా చక్కగా అలంకరించారు. ఇక టీవీ సెల్ఫ్ లో అమర్దీప్ తో సీరియల్స్ నటీనటులు కలిసి నటించిన వారందరూ కలిసి ఒక ఫోటో ఫ్రేమ్ చేయించి ఆయనకు బహుమతిగా అందించారు. అలాగే అమర్దీప్ చౌదరి భార్య తేజు ఫోటోలన్నింటినీ కలిపి ఒక ఫోటో డిజైన్ చేశారు. అలాగే రవితేజ ఫోటో పైన సైన్ చేసి ఇచ్చిన అమర్దీప్ ఫోటోని కూడా అలంకరించారు. అంతేకాదు స్టార్ మా నుండి అమర్దీప్ అందుకున్న ఎన్నో అవార్డ్స్ ను ఆ లివింగ్ ఏరియాలో డిజైన్ చేశారు. ఇలా మొత్తానికైతే అమర్దీప్ హోమ్ టూర్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×