E-Paper
Advertisement

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి సిద్ధమైన ఓజీ.. 28 ఏళ్ల తర్వాత అలాంటి రికార్డ్!

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి సిద్ధమైన ఓజీ.. 28 ఏళ్ల తర్వాత అలాంటి రికార్డ్!
Advertisement

OG Movie:పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రముఖ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో గత ఏడాది సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఓజీ. ముంబై మాఫియా గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి సంచలనం సృష్టించింది. అంతేకాదు పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ ప్రెజెన్స్ , తమన్ అందించిన హై వోల్టేజ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , సుజీత్ స్టైలిష్ టేకింగ్ కూడా ఈ సినిమాకు ఎంతగానో ప్లస్ గా నిలిచాయి. ఇక అలా థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమా.. థియేటర్ రన్ పూర్తి చేసుకొని ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. అయితే అక్కడ కూడా ఈ సినిమా సరికొత్త రికార్డులు తిరగరాసింది. అలా థియేటర్లలో ఇటు ఓటీటీ లలో సత్తా చాటిన ఈ సినిమా ఇప్పుడు టీవీలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యింది.

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి సిద్ధమైన ఓజీ..

సుమారుగా 10 నెలల తర్వాత ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి సిద్ధమవుతూ ఉండడం గమనార్హం. ఇకపోతే ఈ సినిమా శాటిలైట్ హక్కులను ప్రముఖ టెలివిజన్ నెట్వర్క్ ఈటీవీ ఫ్యాన్సీ ధరకు సొంతం చేసుకున్నట్లు సినీ వర్గాలలో ఒక ఆసక్తి చర్చ రేకెత్తిస్తోంది. అంతేకాదు తన సుదీర్ఘ చరిత్రలో ఈటీవీ సంస్థ ఒక భారీ పాన్ ఇండియా యాక్షన్ ఫిలిం రైట్స్ ను దక్కించుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. సుమారుగా 28 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈటీవీ నెట్వర్క్ దక్కించుకున్న పవన్ కళ్యాణ్ రెండవ సినిమా కావడం గమనార్హం. ఇకపోతే 1998లో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సుస్వాగతం సినిమా శాటిలైట్ హక్కులను ఈటీవీ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికీ ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది . అయితే ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఓజీ సినిమా శాటిలైట్ హక్కులను దక్కించుకుంది ఈటీవీ.

టీవీలో ప్రసారమయ్యేది అప్పుడే..

Advertisement

ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ చేయనున్నారు. అలాగే మరొకసారి ఆగస్టు 28న రాఖీ పౌర్ణమి సందర్భంగా రీ టెలికాస్ట్ చేయడానికి ఛానల్ యాజమాన్యం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ టీవీ ఛానల్ లో ఓజీ సినిమా ప్రోమో లను కూడా అధికారికంగా ప్రసారం చేస్తూ ఉండడం గమనార్హం . మొత్తానికైతే 28 ఏళ్ల తర్వాత మళ్లీ పవన్ కళ్యాణ్ కొత్త మూవీ ఈటీవీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యింది.

ALSO READ:బిగ్ బాస్ బ్యూటీ శుభశ్రీ తల్లి కాబోతోందా?

ఓజీ సినిమా విశేషాలు..

Advertisement

ఓజీ సినిమా విషయానికి వస్తే.. పవన్ కళ్యాణ్ హీరోగా, ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ఒక పవర్ఫుల్ విలన్ పాత్ర పోషించారు. ఇక ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మించారు.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×