E-Paper
Advertisement

హైపర్ ఆదితో విభేదాలు.. ఒక్క మాటతో క్లారిటీ ఇచ్చిన అదిరే అభి!

హైపర్ ఆదితో విభేదాలు.. ఒక్క మాటతో క్లారిటీ ఇచ్చిన అదిరే అభి!
Advertisement

Adhire Abhi: జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న అదిరే అభి ఇప్పుడు దర్శకుడిగా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. ఆయన దర్శకత్వం వహించిన ‘కర్మాఖ్య’ సినిమా త్వరలోనే విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న అభి.. తనపై, హైపర్ ఆదిపై వస్తున్న గొడవల రూమర్లపై క్లారిటీ ఇచ్చారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, ఆది తనకు ఎప్పుడూ ఫుల్ సపోర్ట్‌గా ఉంటాడని చెబుతూ ఆ వార్తలకు చెక్ పెట్టారు. ఆ వివరాలు చూద్దాం..

జబర్దస్త్ కమెడియన్ నుంచి డైరెక్టర్‌గా..

అదిరే అభి(Adhire Abhi)కి ఇండస్ట్రీతో చాలా ఏళ్ల అనుబంధం ఉంది. నటుడిగా, కమెడియన్‌గా అలరించిన ఆయన జబర్దస్త్ షో ద్వారా టీమ్ లీడర్‌గా ఎదిగి పాపులారిటీ సాధించారు. మల్టీ టాలెంటెడ్ అయిన అభి.. రాజమౌళి వంటి దిగ్గజ దర్శకుల దగ్గర అసిస్టెంట్‌గా కూడా పనిచేశారు. ఇక రాజ్ తరుణ్‌తో ‘చిరంజీవ’ సినిమా తీసిన అభి, ఇప్పుడు ‘కర్మాఖ్య’ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

Advertisement

ALSO READ:‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ మూవీ రివ్యూ!

ఆది రాకపోవడంపై యూట్యూబ్ థంబ్‌నైల్స్:

సినిమా ప్రమోషన్ల సమయంలో హైపర్ ఆదితో ఉన్న సంబంధాలపై అభికి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. తన సినిమా ఈవెంట్‌కు ఆదిని పిలిస్తే రానన్నాడని సోషల్ మీడియాలో థంబ్‌నైల్స్ వేసి రూమర్స్ సృష్టించారని అభి ఆవేదన వ్యక్తం చేశారు. ఇక అసలు అలాంటి చర్చ లేదా కాంటెక్స్ట్ ఎప్పుడూ తమ మధ్య రాలేదని, తాను జబర్దస్త్ టీమ్‌లోని ఎవరినీ ప్రత్యేకంగా ఈవెంట్‌కు పిలవలేదని స్పష్టం చేశారు.

ఈవెంట్‌కి పిలవకపోవడానికి అసలు కారణం:

Advertisement

జర్నలిస్టులు, ప్రెస్ మీట్ కోసం కేటాయించిన చిన్న స్పేస్‌లో ఈవెంట్ జరిగిందని అభి తెలిపారు. ఒకవేళ జబర్దస్త్ మిత్రులను పిలిస్తే, అంత బిజీలో వాళ్లకు సరిగ్గా టైమ్ ఇవ్వలేనని, పైగా అందరి ఫోకస్ ట్రైలర్ మీద కాకుండా వాళ్లపైకి మళ్లుతుందని భావించే ఎవరినీ ఇన్వైట్ చేయలేదని చెప్పారు. అంతే తప్ప అక్కడ ఎలాంటి గొడవలు లేదా విభేదాలు లేవని క్లారిటీ ఇచ్చారు.

నా వెనక ఆది సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది:

హైపర్ ఆది తనకు ఎప్పుడూ అండగా ఉంటాడని అభి చెప్పుకొచ్చారు. తనకు బెస్ట్ డైరెక్టర్ అవార్డు వచ్చినప్పుడు నాగబాబు గారితో పాటు జబర్దస్త్ బ్యాచ్ అందరితో ఓట్లు వేయించింది ఆది నేనని గుర్తు చేసుకున్నారు. ఇక టీజర్, ట్రైలర్ ఏది వచ్చినా ఇమ్మీడియట్‌గా ఆది ట్వీట్ చేస్తాడని.. సుధీర్, గెటప్ శ్రీను, అవినాష్, ఇమ్ము, ఇంద్రజ గారు అందరూ తన ప్రాజెక్టులను ప్రమోట్ చేస్తూ సపోర్ట్ చేస్తారని తెలిపారు.

స్టేజ్ మీది స్కిట్లు నిజం అనుకుంటే ఎలా?:

షోలలో తమ మధ్య జరిగే సరదా సంభాషణలను, స్కిట్లలో వేసే పంచ్‌లను జనాలు నిజం అనుకుంటుంటారని అభి అన్నారు. అదంతా కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ కోసమే చేస్తామని, పర్సనల్‌గా తమ మధ్య చాలా మంచి బాండింగ్ ఉందని చెప్పారు. ఇక ఈ వివరణతో అదిరే అభి, హైపర్ ఆదిల మధ్య ఎలాంటి గొడవలు లేవని తేలిపోయింది.

జబర్దస్త్ వేదికపై నుంచి వచ్చిన వారందరూ బయట ఎంతో ఆప్యాయంగా ఉంటారని, ఒకరి ఎదుగుదలకు మరొకరు సపోర్ట్ చేసుకుంటారని అదిరే అభి మాటలతో మరోసారి స్పష్టమైంది. ఇక సోషల్ మీడియాలో వచ్చే అనవసరపు రూమర్లకు చెక్ పెడుతూ, తన సరికొత్త చిత్రం ‘కర్మాఖ్య’తో దర్శకుడిగా విజయం సాధించాలని అభిమానులు ఆయనకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×