E-Paper
Advertisement

Tollywood: సీరియల్లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్.. అసలు కారణం తెలిస్తే షాక్!

Tollywood: సీరియల్లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్.. అసలు కారణం తెలిస్తే షాక్!
Advertisement

Tollywood: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకి లైఫ్ టైం అనేది చాలా తక్కువ. అందుకే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తమకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకోవడమే కాకుండా ఆదాయాన్ని కూడా పెంపొందించుకుంటూ ఉంటారు. ఇక హీరోయిన్ గా కెరియర్ ముగిసింది అంటే కొంతకాలం ఇండస్ట్రీకి గ్యాప్ ఇవ్వడం లేదా సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. అలా ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా ప్రేక్షకులను అలరించిన వారు సెకండ్ ఇన్నింగ్స్ లో అక్క, అత్త, వదిన, తల్లి ఇలాంటి పాత్రలతో సరిపెట్టుకుంటూ ఉంటారు.అలాంటి ఒక హీరోయిన్ ఇప్పుడు సినిమాలలో అవకాశాలు లేక బుల్లితెరపై సీరియల్స్ లోకి ఎంట్రీ ఇస్తోంది. ఒకప్పుడు కన్నడ భాషలో వెలుగు వెలిగిన ఈమె.. ఇప్పుడు సీరియల్స్ లోకి ఎంట్రీ ఇస్తుండడంతో అభిమానులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఎవరో కాదు ప్రముఖ నటి సంజన గల్రానీ..

పాన్ ఇండియా భాషల్లో అవకాశాలు.. అయినా రాని గుర్తింపు..

సింధీ కుటుంబంలో బెంగళూరులో జన్మించిన ఈమె మొదట మోడల్ గా తన కెరీర్ ను మొదలుపెట్టి..2005లో రవిబాబు దర్శకత్వంలో వచ్చిన ‘సోగ్గాడు’ అనే సినిమాలో చిన్న పాత్ర చేసి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ప్రభాస్ బుజ్జిగాడు సినిమాలో హీరోయిన్ కి చెల్లిగా నటించిన ఈమెకు మంచి గుర్తింపే లభించింది. ఆ తర్వాత పోలీస్ పోలీస్, సత్యమేవ జయతే, లవ్ యూ బంగారం, దుశ్శాసన, ముగ్గురు, సర్దార్ గబ్బర్ సింగ్ వంటి పలు చిత్రాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న సంజన.. తెలుగు, తమిళ్ , కన్నడ, హిందీ, మలయాళం వంటి భాషలతో సంబంధం లేకుండా అన్ని భాషలలో సినిమాలు చేసింది .కానీ స్టార్ స్టేటస్ ను మాత్రం సొంతం చేసుకోలేకపోయింది.

సినిమాలతోనే కాదు కాంట్రవర్సీలతో కూడా పాపులారిటీ..

Advertisement

ఇండస్ట్రీలోకి వచ్చి రెండు దశాబ్దాలు అవుతున్నా ఇప్పటికీ ఆ స్టార్ హోదాను దక్కించుకోలేదని చెప్పవచ్చు. మరోవైపు అటు సినిమాలతోనే కాదు ఇటు వివాదాలతో కూడా నిత్యం వార్తల్లో నిలిచింది. ఒకానొక సమయంలో శాండిల్ వుడ్ ఇండస్ట్రీని కుదిపేసిన డ్రగ్స్ వ్యవహారంలో ఈమె పేరు బయటకు రావడమే కాకుండా కొంతకాలం జైలు జీవితం కూడా గడిపింది.. అజీజ్ పాషా అనే ఒక డాక్టర్ను వివాహం చేసుకోగా ఒక కొడుకుతో పాటు కూతురు కూడా ఉన్నారు. కూతురు జన్మించిన తర్వాత ఈమె తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టి షాక్ ఇచ్చింది. నిజానికి తెలుగు సరిగా మాట్లాడడానికి రాకపోవడం , మధ్యలో కాంట్రవర్సీలు, హౌస్ మేట్స్ తో గొడవలు, దొంగతనం ఇలా ఎక్కువ రోజులు హౌస్ లో ఉండలేదని చాలామంది అనుకున్నారు. కానీ ఫైనల్స్ లోకి అడుగు పెట్టింది. కానీ టైటిల్ విజేతకి అడుగు దూరంలో ఎలిమినేట్ అయ్యి షాక్ ఇచ్చింది.

వెండితెరకు దూరం.. బుల్లితెరపై ప్రత్యక్ష..

ఇకపోతే బిగ్ బాస్ ద్వారా ఎంత పాపులారిటీ లభించినా అవకాశాలు మాత్రం రాలేదు. అందుకే వెండితెరను కాదని ఇప్పుడు బుల్లితెరను నమ్ముకుంది ఈ ముద్దుగుమ్మ. అందులో భాగంగానే తాజాగా సీరియల్స్ లోకి ఎంట్రీ ఇస్తోంది.. తెలుగులోనే తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యింది. త్వరలో మాటీవీలో ప్రసారం కానున్న “ఏ దేవి వరమో నీవు” అనే ఒక కొత్త సీరియల్ ద్వారా బుల్లితెరపై ప్రేక్షకులను అలరించబోతోంది. మరి ఈ సీరియల్ తో సంజనాకి ఎలాంటి గుర్తింపు లభిస్తుందో చూడాలి.

Advertisement

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×