E-Paper
Advertisement

Actress Nandini Death: నందిని ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్.. డైరీలో విస్తుపోయే నిజాలు!

Actress Nandini Death: నందిని ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్.. డైరీలో విస్తుపోయే నిజాలు!
Advertisement

Actress Nandini Death: ఇటీవల సీరియల్ నటి నందిని(Nandini) ఆత్మహత్య చేసుకొని మరణించిన ఘటన అందరిని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. నందిని ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన అమ్మాయి అయినప్పటికీ కన్నడ, తమిళ సీరియల్స్ లో నటిస్తూ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఈమె తమిళంలో గౌరీ అనే సీరియల్ లో నటిస్తున్నారు. ఈ సీరియల్లో ద్విపాత్రాభినయంలో నటిస్తున్న నందిని ఈ సీరియల్ ద్వారా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ సీరియల్ షూటింగ్ జరుగుతోంది.

ఆత్మహత్య చేసుకున్న నందిని..

బెంగళూరులో షూటింగ్ షెడ్యూల్ పూర్తిచేసుకుని చెన్నై బయలుదేరారు. కానీ నందిని మాత్రం బెంగళూరులో ఉన్న తన సొంత ఇంటికి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇలా ఈమె విశ్రాంతి కోసం ఇంటికి వెళ్లి శాశ్వత విశ్రాంతి తీసుకున్నారనే విషయం తెలిసిన అభిమానులు సీరియల్ నటీనటులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఇక ఈమె ఉన్నఫలంగా సూసైడ్ చేసుకోవడానికి గల కారణాలు ఏంటి అనే విషయంపై ఎన్నో సందేహాలు వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు నందిని ఆత్మహత్య కేసు పై పెద్ద ఎత్తున దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Also Read: Actress Nandini death: పెళ్లి ఒత్తిడి.. ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్న సీరియల్ నటి

కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగం..

ఈ నేపథ్యంలోనే పోలీసులు కీలక సమాచారాన్ని వెల్లడించారు .నందిని ఆత్మహత్య చేసుకున్న గదిలో తనకు సంబంధించిన డైరీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అయితే ఈ డైరీ ద్వారా కీలక విషయాలను పోలీసులు వెల్లడించారు. నందిని కుటుంబ సభ్యులకు ఈమె సీరియల్స్ లో నటించడం ఏమాత్రం ఇష్టం లేదని ఈ డైరీ ద్వారా తెలుస్తోంది. నందిని తండ్రి మరణించడంతో కారుణ్య నియామకం కింద నందినికి ప్రభుత్వ ఉద్యోగం లభించిందని, ఆ ఉద్యోగం చేయడం తనకు ఇష్టం లేదని, నటన పైనే నా జీవితం ఆధారపడి ఉన్నట్లు నందిని డైరీలో రాశారు .

Advertisement

అమ్మా నన్ను క్షమించు..

కుటుంబ సభ్యులు మాత్రం ప్రభుత్వ ఉద్యోగంలో కొనసాగాలి అంటూ ఆమెపై ఒత్తిడి తీసుకువచ్చిన తెలుస్తోంది. ఈ డైరీలో నందిని ..”అమ్మ నన్ను క్షమించు.. నాకు ప్రభుత్వ ఉద్యోగం ఇష్టం లేదు నటన అంటేనే ప్రాణం.. నా మాట ఎవరు వినడం లేదు” అంటూ ఈమె సూసైడ్ నోట్ రాసినట్లు పోలీసులు వెల్లడించారు. ఇలా ఉద్యోగం విషయంలో కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి ఉన్న నేపథ్యంలోనే నందిని ఇలాంటి దారుణానికి ఒడిగట్టారని తెలుస్తోంది. ఇక ఈమె ఆత్మహత్య కేసులో భాగంగా పోలీసులు మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు. ఇక నందిని మరణించడంతో తోటి నటీనటులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. నటన పరంగా మంచి సక్సెస్ అందుకున్న నందిని ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడంతో ఇప్పటికీ ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

Also Read: Nani Sujeeth Film: నాని, సుజీత్ సినిమాలో ప్రభాస్ ప్రాణ స్నేహితుడు.. కన్ఫర్మ్ అయినట్టే?

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×