E-Paper
Advertisement

విడాకుల దిశగా సెలబ్రిటీ జంట.. ఎవరు? అసలేం జరిగిందంటే?

విడాకుల దిశగా సెలబ్రిటీ జంట.. ఎవరు? అసలేం జరిగిందంటే?
Advertisement

Tollywood:ఈ ఏడాది సెలబ్రిటీలకు బాగా కలిసి వచ్చిందని చెప్పాలి. ముఖ్యంగా సుమారుగా ఒక ఐదు ఆరు జంటలు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాయి. మరి కొంతమంది పెళ్లి దిశగా అడుగులు వేస్తున్నారు. ఇంకొంతమంది తల్లిదండ్రులు కాబోతున్నామంటూ శుభవార్తలు తెలిపారు. ఇక అందరూ సంతోషంలో మునిగి తేలుతుంటే ఇక్కడ ఒక బాలీవుడ్ బ్యూటీ మాత్రం తన భర్త నుండి విడాకులు తీసుకోవడానికి సిద్ధమయ్యింది. పైగా ఇంస్టాగ్రామ్ వేదికగా అతడిని అన్ ఫాలో కూడా చేసేసింది. ఇక దీంతో అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు . ఒకప్పుడు అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకొని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాక.. తన భర్తతో కలిసి స్పెషల్ ఫోటోలు పంచుకున్న ఒక బ్యూటీ.. అందరి చేత బెస్ట్ కపుల్, బ్యూటిఫుల్ కపుల్ అని పేరు దక్కించుకొని , ఇప్పుడు విడాకులకు సిద్ధం అవ్వడంతో జీర్ణించుకోలేకపోతున్నారు. అసలు ఆమె ఎవరు? ఎందుకు తన భర్తకు విడాకులు ఇవ్వాలనుకుంటోంది ? అనే విషయాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి..

విడాకుల దిశగా సెలబ్రిటీ జంట..

సాధారణంగా సెలబ్రిటీ కపుల్స్ విడిపోవాలనుకున్నప్పుడు ముందుగా సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్స్ లలో ఒకటైన ఇంస్టాగ్రామ్ వేదికగా పరస్పరం అన్ ఫాలో చేసుకోవడం, ఫోటోలు తొలగించడం లాంటివి చేస్తూ మొదట హింట్ ఇస్తారు. ఇక ఆ తర్వాత నిజంగానే విడిపోతారు. ఇప్పుడు వీరి బాటలో ప్రముఖ బ్యూటీ మౌని రాయ్, ఆమె భర్త సూరజ్ నంబిహార్ కూడా ఇంస్టాగ్రామ్ వేదికగా ఇద్దరు ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారు. ఇక దీంతో నిజంగానే వీరిద్దరూ విడిపోతున్నారా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సెలబ్రిటీలు విడిపోయే ముందు ఇలాగే చేస్తారు కాబట్టి వీరు కూడా ఇలా అన్ ఫాలో కొట్టి విడిపోబోతున్నారు అని అభిమానులు, నెటిజన్స్ భావిస్తున్నారు. ఇకపోతే వీరిద్దరూ అన్ ఫాలో మాత్రమే చేసుకున్నారు. ఇంకా ఫోటోలను డిలీట్ చేయలేదు. మరి త్వరలోనే ఆ ఫోటోలను కూడా డిలీట్ చేస్తారేమో చూడాలి.

అప్పట్లో ఘనంగా పెళ్లి.. స్పందించని జంట..

Advertisement

మౌనీ రాయ్, సూరజ్ విషయానికి వస్తే.. దుబాయ్ కి చెందిన వ్యాపారవేత్త ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ అయిన సూరజ్ నంబిహార్ ను 2022 జనవరిలో మౌని వివాహం చేసుకుంది. గోవాలోని ప్రముఖ హిల్ టన్ రిసార్ట్ లో మలయాళీ, బెంగాలీ సాంప్రదాయ పద్ధతులలో వీరి వివాహం చాలా కన్నుల పండుగగా జరిగింది. ముఖ్యంగా ఆ సమయంలో నా జీవిత భాగస్వామి దొరికాడు అంటూ మౌని భావోద్వేగంతో కూడిన పోస్టు పంచుకుంది. బెంగుళూరుకి చెందిన జైన కుటుంబం నుంచి వచ్చిన సూరజ్.. పక్కా బెంగాలీ అయినా మౌని సాంప్రదాయాలను గౌరవిస్తూ చేసుకున్న ఆ పెళ్లి అప్పట్లో అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది .అయితే పెళ్లైన నాలుగేళ్లకే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో పాటు ఫిలిం వర్గాలలో చర్చ జరుగుతోంది. అయితే దీనిపై వీరు స్పందించలేదు.

also read:దిగొచ్చిన రవితేజ.. ఈ భారీ మార్పు వెనుక అసలు కారణం?

గందరగోళంలో కెరియర్ పై మౌని దృష్టి..

Advertisement

ఇదిలా ఉండగా మరొకవైపు మౌని రాయ్ వైవాహిక జీవితంలో ఇలాంటి గందరగోళం నడుస్తుంటే.. మౌనీ మాత్రం తన కెరియర్ మీద దృష్టి పెట్టింది. డేవిడ్ ధావన్ దర్శకత్వంలో వస్తున్న హే జవానీతో ఇష్క్ హోనా హై అనే చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుంది .ఇందులో వరుణ్ ధావన్, పూజా హెగ్డే , మృణాల్ ఠాకూర్ నటిస్తున్నారు.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×